Don't Miss!
- News
ఎన్ఐఏకే సవాల్ విసిరిన తీవ్రవాదులు ? ముంబైని పేల్చేస్తేమంటూ.. !
- Finance
RBI: ప్రజలకు శుభవార్త..! ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు నిలిపివేత అప్పటి నుంచే..
- Sports
శుభ్మన్ కాదు.. కోహ్లీ వారసుడు అతనే: దినేశ్ కార్తీక్
- Lifestyle
Protein Powder:వెయిట్ లాస్,మజిల్ మాస్, బోన్ స్ట్రెంగ్త్ దేనికైనా ప్రోటీన్ పౌడర్! ప్రోటీన్ పౌడర్ ఇంట్లోనే తయారీ
- Technology
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Urfi Javed చేతులకు సంకెళ్లు .. నన్ను జైల్లో చూడాలనుకునే వారికోసమంటూ వ్యంగంగా బికినీ వీడియో!
ఉర్ఫీ జావేద్.. ఈ పేరు అంటే తెలియని నెటిజన్లు, బాలీవుడ్ ప్రేక్షకులు ఉండరు. విభిన్నమైన, చిత్ర విచిత్రమైన డ్రెస్సులు ధరించి, అందాలు ప్రదర్శిస్తూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమా ప్రపంచంలో నటిగా కొనసాగింది. ప్రస్తుతం టెలివిజన్ రంగంలో కూడా తనదైన శైలిలో అడుగులు వేస్తోంది. ఇక ఈ బ్యూటీ ఎలాంటి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిన కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక తాజాగా చేతులకు సంకెళ్లతో దర్శనమిచ్చిన ఉర్ఫీ జావేద్ పలువురికి కౌంటర్ గా హాట్ వీడియో షేర్ చేసింది.

ఊహించనంతగా..
సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ పొందిన ముద్దుగుమ్మ ఉర్ఫీ జావేద్. నిత్యం హాట్ వీడియోలతో దర్శనమిచ్చే కాంట్రవర్సీ బ్యూటి ఉర్ఫీ జావేద్ లక్నోలో పుట్టి పెరిగింది. ఇక మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనంతరం ఈ అమ్మడు చాలా తొందరగా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది. కానీ తను అనుకున్న దారిలో మాత్రం ఊహించినంత అవకాశాలు రాలేదు.

హిందీ బిగ్ బాస్ లోకి అవకాశం..
ఉర్ఫీ జావేద్ కు అవకాశాలు రాకపోవడంతో.. ఇక లాభం లేదనుకుని ఈ అమ్మడు టెలివిజన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవడానికి సీరియల్స్, రియాలిటీ షోలు చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే ఉర్ఫీ జావేద్ కు అత్యధిక ప్రేక్షకాదరణ పొందుతున్న హిందీ బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం లభించింది. గత ఏడాది బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 1 లో ఉర్ఫీ జావేద్ కంటెస్టెంట్ గా పాల్గొంది.

గ్లామర్ తో రెచ్చిపోయి..
బిగ్ బాస్ హిందీ తొలి ఓటీటీ సీజన్ లో అడుగు పెట్టిన హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్ మొదట్లోనే తన గ్లామర్ తో హడావుడి చేసింది. ఇక ఎక్కువ రోజులు ఉండాలని ఎంతగా ప్రయత్నించినప్పుటికీ కూడా ఉర్ఫీ జావేద్ కు అది సాధ్యం కాలేదు. ఉర్ఫీ జావేద్ కు అతి దూకుడు కారణంగా 13వ స్థానంతో సరిపెట్టుకొని మధ్యలోనే ఎలిమినెట్ అయ్యింది. అయితే బిగ్ బాస్ తరువాత అయినా ఉర్ఫీ జావేద్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ కావాలని అందుకుంది.

మీడియాను ఆకర్షించేందుకు.
.
బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన ఉర్ఫీ జావేద్ కు హిందీ సినిమాల్లో పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇక మళ్లీ టెలివిజన్ లోనే హైలెట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే MTV స్ల్పిట్స్ విల్లా లో కూడా ఉర్ఫీ జావేద్ కంటెస్టెంట్స్ గా పాల్గొంది. దాని ద్వారా కూడా ఆమెకు అంతగా క్రేజ్ ఏమి రాలేదు. ఇక టెలివిజన్ లో కూడా సరైన అవకాశాలు రాకపోవడంతో ఉర్ఫీ జావేద్ గత ఏడాది నుంచి గ్లామరస్ లుక్స్ తో మీడియాను ఎక్కువగా ఆకర్షించేందుకు ప్రయత్నం అయితే చేస్తోంది.

బీజేపీ నేత ఫిర్యాదు..
ఉర్ఫీ జావేజ్ రెగ్యులర్ గా కాకుండా కొత్తగా కనిపించాలని ఈ అమ్మడు డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు చేతులతోనే అందాలను దాచేస్తూ స్టిల్స్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆమె చర్యలపై పలువురు అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. అశ్లీల దుస్తులను ధరిస్తూ.. బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నందున ఆమెను కట్టడి చేయాలని, అలాగే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత చిత్రా వాఘ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

సంకెళ్లు వేసుకుని..
బీజేపీ నేత చిత్రా వాఘ్ ఫిర్యాదు నమోదు చేయడంపై ఇదివరకే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది ఉర్ఫీ జావేద్. విచారణ, దర్యాప్తు అంతా బుల్ షిట్. నీవు, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఆస్తులను బహిరంగంగా పరిస్తే.. నేను జైలుకు వెళ్లడానికి రెడీ అంటూ వ్యాఖ్యలు చేసింది ఉర్ఫీ. ఇప్పుడు తాజాగా ఓ హాట్ వీడియో వదిలింది. ఇందులో చేతులకు హ్యాండ్ కఫ్స్ వేసుకుని దర్శనమిచ్చింది ఈ భామ.

వ్యంగంగా అందాల ఆరబోత..
ఉర్ఫీ జావేద్ ఆ వీడియోను షేర్ చేస్తూ "నన్ను సంకెళ్లలో చూడాలనుకునే వారికోసమే ఇదంతా. మీ కోరిక నెరవేరింది" అంటూ రాసుకొచ్చి స్ట్రాంగ్ సెటైర్ వేసినట్లయింది. ఇక ఈ వీడియోలో లోదుస్తుల వలే ఉండే బ్లాక్ కలర్ బికినీ ధరించిన ఉర్ఫీ ఎద, బ్యాక్ అందాలను హద్దు లేకుండా ప్రదర్శించింది. ఉర్ఫీ జావేద్ మరింత హాట్ గా కనిపిస్తోన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.