ఇదేం జాకెట్టురా బాబోయ్.. మళ్ళీ హాట్ ఔట్ ఫిట్లో మెరిసిన ఉర్ఫీ జావేద్

ఉర్ఫీ జావేద్ అంటే తెలుగువారికి పరిచయం లేదు. కానీ కాస్త బాలీవుడ్ టచ్ ఉన్న వారందరికీ ఉర్ఫీ జావేద్ గురించి పరిచయమే. పలు సీరియల్స్ లో కనిపించిన ఈ భామ బిగ్ బాస్ ఓటీటీలో కనిపించి మంచి క్రేజ్ దక్కించుకుంది. హౌస్ లో ఉన్నది కొన్ని రోజులే అయినా మంచి క్రేజ్ దక్కించుకున్న ఈ భామ తర్వాత ఆ క్రేజ్ కొనసాగించడానికి అనేక హాట్ ఫోటో షూట్ లు చేస్తూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. తాజాగా బక్రీద్ సందర్భంగా ఆమె ఒక వెరైటీ శారీతో మీడియా ముందుకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

ప్రపంచంలో ఎక్కడా దొరకవు

ప్రపంచంలో ఎక్కడా దొరకవు

కరణ్ జోహార్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ ఓటీటీ హిందీ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా ఉర్ఫీ జావేద్ బాలీవుడ్ కి పరిచయమైంది. అంతకుముందు ఆమె కొన్ని సీరియల్స్ చేసింది కానీ అందులో ఆమెకు పెద్దగా క్రేజ్ అయితే లభించలేదు. కానీ బిగ్ బాస్ ఓటిపి సీజన్ ద్వారా ఆమె హిందీ ఫాలో అయ్యే వారందరికీ పరిచయమైంది అయితే ఆ షో ద్వారా వచ్చిన క్రేజ్ ఆమె ఇంకా పెంచుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఆమె ధరించే బట్టలు ఆమె దగ్గర తప్ప ఇంకా ప్రపంచంలో ఎక్కడా దొరకవు.

డ్రస్సులు రెడీ చేసుకుంటూ

డ్రస్సులు రెడీ చేసుకుంటూ

ఎందుకంటే ఆ బట్టలు ఆమె స్వయంగా డిజైన్ చేసుకుంటుంది. కొన్నింటిని డిజైనర్లతో కూడా సిద్ధం చేయించుకుంటూ ఉంటుంది. ఆమె అందాలు ఎలా ఆరబోయాలి అనే విషయం మీద పీహెచ్డీ చేసినట్టు ఉంది. అందుకే ఎక్కడ వరకు కనిపించాలో అక్కడి వరకు కనిపించే విధంగా కనిపించనివి కనిపించకుండా ఉండేలా ఇలా రకరకాల డ్రస్సులు రెడీ చేసుకుంటూ ఉంటుంది. ఆఖరికి ప్లాస్టిక్ కవర్లతో కూడా ఈమె డ్రెస్సులు రెడీ చేసుకుని ఆ డ్రెస్సుల్లో రోడ్డు ఎక్కింది.

ఎయిర్ పోర్ట్ కి వెళ్లి

ఎయిర్ పోర్ట్ కి వెళ్లి

అంటే ఆమెకు ఉన్న గుండె ధైర్యం గురించి ప్రస్తావించకుండా ఉండలేం. అయితే ఆ మధ్య ఇదే విషయం మీద ఆమెను కొంతమంది ట్రోల్ చేస్తూ ఉంటే సమంత ఇలాంటి డ్రెస్సులు ధరిస్తే అబ్బో సూపర్ అంటూ కామెంట్ చేస్తారు నేను ధరిస్తే మాత్రం ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అంటూ ప్రశ్నించి షాక్ ఇచ్చింది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె పని ఉన్నా లేకపోయినా ప్రతి రోజు ముంబై ఎయిర్ పోర్ట్ కి వెళ్లి కాసేపు గడిపి వస్తుందట.

 ప్రయాణాలు చేయదు

ప్రయాణాలు చేయదు

అలా ఎందుకు అని అడిగితే అది తన ఇష్టం అని అంటుంది. కానీ ముంబై ఎయిర్ పోర్ట్ లో చాలా మంది ఫోటోగ్రాఫర్లు బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. బాలీవుడ్ సెలబ్రిటీలు ఏదో ఒక ప్రాంతానికి వెళ్లి వస్తూ ఉంటే వారి ఫోటోలు వీళ్ళు తీసి వైరల్ చేస్తూ ఉంటారు. అయితే వారిలా ఈమె ప్రయాణాలు చేయదు కాబట్టి కనీసం ఎయిర్ పోర్టుకు అయినా వెళితే ఫోటోగ్రాఫర్లకు కంట పడవచ్చనేది తన ఆలోచన.

వింత జాకెట్టుతో

వింత జాకెట్టుతో

ఇక తాజాగా ఆమె చేసిన ఫోటో షూట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బక్రీద్ సందర్భంగా రోడ్ ఎక్కిన ఈ భామ బ్లూ కలర్ జాకెట్టు ధరించి అందాలు ఆరబోస్తోంది. చీర కట్టు కూడా కాస్త వింతగా కనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X