ఉర్ఫీ జావేద్‌కు రేప్ బెదిరింపులు..ఆవేదన వ్యక్తం చేసిన బోల్డ్ బ్యూటీ

సోషల్ మీడియా సంచలనం ఉర్ఫీ జావేద్ ఫ్యాషన్ ఫీల్డ్ లో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తూ ఉంటుంది. ఆమె ఫ్యాషన్ సెన్స్ చూసి ఆశ్చర్య పోయే వారు కొందరు అయితే, ఇవేం బట్టలురా బాబోయ్ అని చీదరించుకునే వారు కొందరు. అయితే ఆమె వేసుకునే బట్టలను మెచ్చుకునే వారికంటే తిట్టే వారే ఎక్కువ మంది ఉంటారు. ఈ కారణంగా ఉర్ఫీ జావేద్ ట్రోల్‌స్ కు గురవ్వాల్సి వస్తుంది. ఉర్ఫీ జావేద్ తరచుగా బెదిరింపులు మరియు అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది.

ఇప్పుడు ఉర్ఫీ దీని గురించి మొదటి సారిగా ఓపెన్ అయింది.'బాదే భ‌య్యాకీ దుల్మ‌నియా' సీరియ‌ల్‌తో హిందీ ప్రేక్ష‌కుల‌కు పరిచయం అయింది హాట్ బ్యూటీ ఉర్ఫీ జావెద్. ఆ తర్వాత 'మేరీ దుర్గా' అనే మరో సీరియల్ తో కూడా ఉర్ఫీ జావెద్ న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అయితే అలా చాలా సీరియల్స్ లో నటించిన ఆమెకు మంచి గుర్తింపు అయితే దక్కలేదు.

urfi javed opens up about online rape threats

కానీ గత ఏడాది కరణ్ జోహార్ హోస్ట్ గా జరిగిన హిందీ బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్‌గా పాల్గొనడం ద్వారా వచ్చింది. బిగ్‌బాస్ షో నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయిన ఉర్ఫీ తనకు తానే జనానికి దగ్గరయ్యే ప్రయత్నం ముమ్మరంగా చేస్తోంది. బిగ్ బాస్ తో వచ్చిన గుర్తింపు మ‌రింత పెంచుకోవ‌డానికి ఈ భామ వెరైటీ డ్రెస్సులు, హాట్ హాట్ గా డ్రెస్సులతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ ఉంటుంది.

అయితే అలా ఎప్పుడూ సందడిగా ఉండే ఉర్ఫీ జావేద్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక కథనాన్ని పంచుకున్నారు. అందులో ఉర్ఫీ ఇండియాలో సైబర్ పోలీసులు తాను చేసిన ఫిర్యాదులను పట్టించుకోలేదని పేర్కొంది. తాను అత్యాచారం బెదిరింపులు, దోపిడీలు, దుర్భాషలు, అవమానాలు ఎదుర్కొంటున్నానని, అయితే తనకు సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని పేర్కొంది.

urfi javed opens up about online rape threats

'భారతదేశంలో సైబర్ చట్టం లేదు. పోలీసులు మరియు సైబర్ సెల్‌లు చాలా కష్టతరమైన ఫిర్యాదులపై చాలా శ్రద్ధ చూపుతాయి. అందుకే ప్రజలు వారికి చెప్పడానికి కూడా ప్రయత్నించరు, దూరంగా ఉంటారు. మిమ్మల్ని బహిరంగంగా వేధించినా, మిమ్మల్ని దుర్భాషలాడినా ఆన్‌లైన్‌లో అత్యాచారం చేస్తామని బెదిరించినా ఎందుకు విస్మరించాలో అర్థం కావడం లేదు?' అని పేర్కొంది.

ఉర్ఫీ జావేద్ కంటే ముందే, చాలా మంది ప్రముఖులు ఇలా ఆన్ లైన్ బాధితులుగా మిగిలిపోయారు. పలువురు నటీమణులకు సాయం చేసేందుకు పోలీసులు కూడా ముందుకు వచ్చారు. అయితే, ఇది అందరి విషయంలో కాదని ఉర్ఫీ అంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X