Urfi Javed: నేను బట్టలు ఎందుకు వేసుకోనంటే? ఫ్రూఫ్స్ తో సహా నిరూపించిన బిగ్ బాస్ బ్యూటి!

వెరైటీ డ్రెస్సులు, విభిన్నంగా అందాల ఆరబోత, ట్రోలింగ్, బెదిరింపులు, వివాదాలు ఇవన్నీ కలబోస్తే ఉర్ఫీ జావేద్. బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన ఈ భామ వేసిన డ్రస్సులు మొదట్లో చూసిన నెటిజన్లు షాక్ అయ్యేవారు. రోజుకో వింత డ్రెస్సుతో మరింత విభిన్నంగా కనిపించేది ఈ బ్యూటి. అయితే రాను రాను ఉర్ఫీ జావేద్ స్టైల్ కు అలవాటు పడిపోయారు. ఎప్పుడైనా ఉర్ఫీ జావేద్ సాధారణమైన చుడీదార్ వంటి పద్ధతి గల దుస్తులు ధరిస్తే తను ఉర్ఫీనేనా అని అనుమానం కలిగించేలా ఈ భామ తన స్టైల్ తోటి జనాల్లోకి నాటుకుపోయింది. అయితే తను పూర్తిగా, ఒళ్లు కప్పేలా బట్టలు ఎందుకు ధరించదో తాజాగా చెప్పేసింది. ఆధారాలతో సహా తను దుస్తులు ధరించకపోవడానికి గల కారణాలను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.

అందాలతో ఆశ్చర్యపరిచే..

అందాలతో ఆశ్చర్యపరిచే..

ఉర్ఫీ జావేద్ అంటే ఇప్పుడు తెలియని వారుండరు. ఎందుకంటే వెరైటీ డ్రెస్సులు, ఎవరు ప్రదర్శించని విధంగా అందాల ఆరబోతతో నిత్యం ఆశ్చర్యపరిచే బ్యూటి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం ఉర్ఫీ జావేద్ మాత్రమే. మోడలింగ్ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకోవాలనే కోరికతో అందులో నుంచే కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ తర్వాత సినిమా ప్రపంచంలో నటిగా కొనసాగింది. ప్రస్తుతం బుల్లితెరపై రాణించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

సినిమా ఇండస్ట్రీలో..

సినిమా ఇండస్ట్రీలో..

కాంట్రవర్సీలతో, హాట్ ఫొటోషూట్ లతో నిత్యం సోషల్ మీడియా ద్వారా యమ పాపులర్ అయింది ఈ ఉర్ఫీ జావేద్. తన ట్రెండీ వేర్ తో నిత్యం నెటిజన్లు ఔరా అనిపించే ఈ ముద్దుగుమ్మ లక్నోలో పుట్టి పెరిగింది. మోడల్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన అనంతరం చాలా తొందరగా సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేసింది గ్లామరస్ భామ ఉర్ఫీ జావేద్. కానీ తను అనుకున్నంత త్వరగా అవకాశాలు రాలేదు.

హిందీ బిగ్ బాస్ లో ఛాన్స్..

హిందీ బిగ్ బాస్ లో ఛాన్స్..


సినిమా ఇండస్ట్రీలో తను అనుకున్నంతలా ఛాన్సెస్ రాకపోవడంతో బుల్లితెర రంగంమైన టెలివిజన్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అక్కడైన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకోవాలన్న ఉద్దేశంతో సీరియల్స్, రియాలిటీ షోలు చేసుకుంటూ వచ్చింది. ఈ క్రమంలోనే హిందీ బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం లభించింది. గతేడాది ప్రసరామైన బిగ్ బాస్ హిందీ ఓటీటీ మొదటి సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొంది ఈ వెరైటీ భామ.

 ఎక్కువ కాలం ఉండలేక..

ఎక్కువ కాలం ఉండలేక..


ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ హిందీ ఓటీటీ తొలి సీజన్ లో స్టారింగ్ లో తన గ్లామర్ తో విచిత్రమైన ప్రయోగాలు చేసింది హాట్ బ్యూటి ఉర్ఫీ జావేద్. అక్కడ కూడా విభిన్నమైన దుస్తులు ధరిస్తూ ఎంతగా హడావిడి చేయాలో అంతలా చేసింది. దీంతో ఈ రియాలిటీ షోలో ఎక్కువకాలం ఉండలేకపోయింది. ఉర్ఫీ జావేద్ అతి దూకుడు తనం కారణంగా 13వ స్థానంతో సరిపెట్టుకుని బిగ్ బాస్ హౌజ్ ను వీడి బయటకొచ్చింది.

బట్టలు వేసుకోవచ్చు కదా..

బట్టలు వేసుకోవచ్చు కదా..

బిగ్ బాస్ హౌజ్ ను వీడాక MTV స్ల్పిట్స్ విల్లా వంటి షోలో పాల్గొంది. అనంతరం ఎలాగైన తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న లక్ష్యంతో రెగ్యులర్ గా కాకుండా విభిన్నమైన, వింత డ్రెస్సులు వేసుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో మొదట్లో అనేక విమర్శలు ఎదుర్కుంది ఈ భామ. అంతేకాకుండా ఆమె అస్సలు బట్టలు వేసుకోకపోవడం చూసిన నెటిజన్లు దుస్తులు ధరించవచ్చు కదా అంటూ విపరీతమైన ట్రోలింగ్ కూడా చేశారు.

బట్టలంటే అలర్జీ..

బట్టలంటే అలర్జీ..

అంతేకాకుండా ఉర్ఫీ జావేద్ వేషధారణపై పలువురు బీజేపీ నేతలు సైతం ఫిర్యాదు చేస్తే.. కొంతమంది బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. అయితే వారందరికీ ఎప్పటికప్పుడు గట్టిగానే కౌంటర్లు ఇచ్చేది ఈ సుందరి. ఇక తాజాగా తాను ఎందుకు బట్టలు వేసుకోదో, అందుకు ఒక కారణం ఉందని సోషల్ మీడియా ద్వారా చెప్పుకొచ్చింది బ్యూటిఫుల్ ఉర్ఫీ జావేద్. తనకు ఉన్ని బట్టలు అంటే అలర్జీ అని ఉర్ఫీ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో స్టోరి పెట్టింది.

బట్టలు వేసుకుంటే దద్దుర్లు వస్తాయి..

బట్టలు వేసుకుంటే దద్దుర్లు వస్తాయి..

"నా చర్మానికి ఉన్న దుస్తులు అస్సలు పడవు. నేను అలాంటి దుస్తులను ఒక్క నిమిషం కూడా వేసుకోలేను. ఎందుకంటే నా శరీరాన్ని కప్పేసే డ్రెస్సులు వేసుకుంటే నాకు స్కిన్ ప్రాబ్లమ్ వస్తుంది. నిజం చెప్పాలంటే నాకు బట్టలంటేనే అలర్జీ. అందుకే నేను ఎక్కువగా శరీరం నిండా కప్పే బట్టలు వేసుకోను. ఇలాంటి (వింత) బట్టలు మాత్రమే వేసుకుంటాను. కావాలంటే మీరే చూడండి. నా చేతులు, కాళ్లపై దద్దుర్లు ఎలా వచ్చాయో. నేను బట్టలు వేసుకోకపోవడానికి ఇవే ఆధారాలు" అని ఉర్ఫీ జావేద్ చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X