మళ్ళీ షాకిచ్చిన ఉర్ఫీ జావేద్.. అసలు బట్టలు ఉన్నా లేనట్టే ఫోటోలు.. మాములుగా లేదుగా!
హిందీలో జరిగిన ఓటీటీ బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఉర్ఫీ జావెద్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ఉర్ఫీ తన హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. రకరకాల డ్రెస్సింగ్ స్టైల్స్‌తో ప్రతి రోజూ అందాలను కనిపించీ కనిపించకుండా నెటిజన్లను టీజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఉర్ఫీ జావెద్ ఇప్పుడు వేసుకున్న డ్రెస్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వివరాల్లోకి వెళితే

హాట్ హాట్ డ్రెస్సులతో రచ్చ
నటిగా ఉర్ఫీ జావెద్ 'బాదే భయ్యాకీ దుల్మనియా' సీరియల్‌తో హిందీ ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తరువాత 'మేరీ దుర్గా' అనే మరో సీరియల్ తో నటిగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంది ఉర్ఫీ జావేద్. అన్ని సీరియల్స్ లో నటించినా రాని గుర్తింపు గత ఏడాది కరణ్ జోహార్ హోస్ట్ గా జరిగిన హిందీ బిగ్ బాస్ ఓటీటీలో కంటెస్టెంట్‌గా పాల్గొనడం వలన వచ్చింది.

రకరకాల కామెంట్లు
అయితే ఈ ఓటీటీ బిగ్‌బాస్ షో నుంచి మధ్యలోనే ఎలిమినేట్ అయినా ఉర్ఫీకి మంచి గుర్తింపు కూడా లభించింది. ఇక బిగ్ బాస్ తో వచ్చిన గుర్తింపు మరింత పెంచుకోవడానికి హాట్ హాట్ డ్రెస్సులతో రచ్చ చేస్తూ ఉంటుంది. ఉర్ఫీ వేసుకునే డ్రెస్సులు చూసిన నెటిజన్లు ఎప్పటికప్పుడు రకరకాల కామెంట్లు చేస్తూ ఉంటారు.

న్యూడ్ కలర్ వన్ షోల్డర్ ఆఫ్ ఫిట్
ఆమె ఫోటోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇప్పుడు మరోసారి ఉర్ఫీ తన వీడియోను పంచుకోగా ఆమె ఫోటో మీద ఇప్పుడు రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఉర్ఫీ జావేద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా స్టైలిష్ వీడియోను పంచుకున్నారు. ఈ స్టైలిష్ వీడియోలో, ఉర్ఫీ రూఫ్ టాప్ రెస్టారెంట్‌లో నడుస్తూ కనిపించింది. వీడియోలో, ఉర్ఫీ జావేద్ న్యూడ్ కలర్ వన్ షోల్డర్ ఆఫ్ ఫిట్‌ని ధరించి కనిపిస్తోంది.

విచిత్రంగా ఉన్నా
ఈ దుస్తుల్లోని ట్విస్ట్ ఏంటంటే, ఒక భుజం అలాగే ఒక కాలు మాత్రం కనిపించడం లేదు. అంటే అవి మాత్రం లేకుండా ఆ డ్రెస్ ను డిజైన్ చేశారు. అంటే ఒకరకంగా ఆ డ్రెస్ కలర్ ఒంటి రంగులో ఉండడంతో అసలు ఒంటి మీద బట్టలు ఉన్నాయా? లేవా అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఈ దుస్తులు ఎంత విచిత్రంగా ఉన్నాయో, ఉర్ఫీ ధరించిన తర్వాత ఆమె కూడా అంతే విచిత్రంగా కనిపిస్తోంది. ఇక ఆమె ఈ మధ్యనే బికినీ స్టైల్ బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని కనిపించింది.

ఉర్ఫీ మ్యాజిక్ తో
ఉర్ఫీకి చెందిన ఈ బికినీ స్టైల్ డ్రెస్‌లో పై భాగం టాప్ లాగా ఉన్నప్పటికీ కింది భాగం మాత్రం బికినీ స్టైల్‌లో డిజైన్ చేయబడింది. దిగువ భాగంలో బికినీ స్టైల్‌కు భిన్నంగా కొద్దిగా భిన్నమైన రూపాన్ని ఇచ్చే విధంగా కటింగ్లు కూడా ఉన్నాయి. ఈ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌ల కారణంగా ఉర్ఫీ చాలాసార్లు ట్రోల్ చేయబడుతుంది. అయితే ఇవేమీ పట్టించుకోకుండా ఉర్ఫీ తన స్టైల్‌లోని మ్యాజిక్‌ను ఏమాత్రం తడబడకుండా వ్యాపింప చేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటుంది.


Click it and Unblock the Notifications











