twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వల్గర్ డాన్సులు, బూతులు, పెద్ద గొడవ... ప్రాణహాని ఉందని హీరోయిన్ ఫిర్యాదు, ఆర్జీవీ ట్వీట్!

    |

    రామ్ గోపాల్ వర్మ సినిమాల ద్వారా పాపులర్ అయిన నటి ఊర్మిళా మండోద్కర్ ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ముంబై నార్త్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయ్యారు.

    సోమవారం సాయంత్రం ఊర్మిళా మండోద్కర్ ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్, బీజేపీ వర్గాల వర్గల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆమెకు పోలీస్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశారు. ముంబైలోని బోరీవాలి రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఆమె ప్రచారం చేస్తుండగా ఒక వ్యక్తి మోడీ మోడీ అని అరవడంతో.. అది చివరకు రెండు వర్గాల మధ్య గొడవకు దారి తీసింది.

    నాకు హాని చేస్తారేమో; అందుకే పోలీస్ ప్రొటెక్షన్ కోరా

    నాకు హాని చేస్తారేమో; అందుకే పోలీస్ ప్రొటెక్షన్ కోరా

    ఈ సంఘటనపై ‘రంగీలా' నటి స్పందిస్తూ ఈ విషయంలో తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కొందరు బీజేపీ కార్యకర్తలు మా ర్యాలీలోకి ప్రవేశించి గొడవ చేశారని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. ‘ఇది ప్రారంభం మాత్రమే, మున్ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో? నాకు కూడా ఏమైనా హానీ చేయవచ్చు. అందుకే పోలీస్ ప్రొటెక్షన్ కోరాను' అని ఊర్మిళా తెలిపారు.

    వల్గర్ డాన్సులు చేస్తూ బూతులు

    వల్గర్ డాన్సులు చేస్తూ బూతులు

    ‘మా ర్యాలీలోకి ప్రవేశించిన సదరు వ్యర్తులు అసభ్యకరమైన నృత్యాలు చేస్తూ.. బూతులు తిడుతూ రెచ్చిపోయారు. కొందరు నన్ను బయపెట్టడానికి ప్రయత్నించారు, వారిలో ఒక మహిళ నా దగ్గరి వరకు వచ్చింది. ఈ సంఘటనతో నేను మెంటల్‌గా డిస్ట్రబ్ అయ్యాను, షాకయ్యాను.' అని ఊర్మిళా చెప్పుకొచ్చారు.

    ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు

    ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు

    వారు ఇలా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ అందుకు విరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారు. నాకు రక్షణ కోరడంతో పాటు నాకు మద్దతుగా ఉంటూ ఈ ర్యాలీలో పాల్గొన్న మహిళా కర్యక్తలకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదు అనే ఉద్దేశ్యంతోనే పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు.

    పోలీస్ ప్రొటెక్షన ఏర్పాటు చేసిన అధికారులు

    పోలీస్ ప్రొటెక్షన ఏర్పాటు చేసిన అధికారులు

    ముంబై 11వ జెన్ డీసీపీ, సంగ్రామ్ సింగ్ మాట్లాడుతూ... ఊర్మిళా మండోద్కర్‌కు పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. రక్షణ కోరుతూ ఆమె నుంచి మాకు ఒక అప్లికేషన్ వచ్చిందని, ఆమె ఫిర్యాదుపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

    రామ్ గోపాల్ వర్మ ట్వీట్

    కాగా... తన సినిమాల్లో హీరోయిన్‍‌గా నటించిన ఊర్మిళా ఎన్నికల్లో పోటీ చేస్తుండటంపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ... ‘తొలిసారి నాకు దేశాన్ని ప్రేమించాలనిపిస్తోంది. మేరా ఊర్మిళా మహాన్' అంటూ ట్వీట్ చేశారు.

    English summary
    Urmila Matondkar gets police protection after Congress and BJP workers had a scuffle last evening during the election campaign. The clash took place at Borivali railway station where Urmila Matondkar was canvassing and as per an onlooker, a BJP worker shouted 'Modi Modi' and that's when the Congress workers got into a heated argument and a fight broke out between the two party workers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X