twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిల్లర రాజకీయాలతో వేగలేక... ‘రంగీలా’ బ్యూటీ ఊర్మిళా సంచలన నిర్ణయం!

    |

    ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ చిత్రాల్లో గ్లామర్ తారగా ఓ వెలుగు వెలగడంతో పాటు 'రంగీలా' సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటి ఊర్మిళా మండోద్కర్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ తీర్థం పెచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఎన్నికల్లో పార్టీ తరుపున మహారాష్ట్ర నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఊర్మిళా మంగళవారం షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది.

    ప్రజల కోసం పని చేస్తానని చెబుతున్న ఊర్మిళ

    ప్రజల కోసం పని చేస్తానని చెబుతున్న ఊర్మిళ

    ‘ముంబై కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమైన నేతలు పార్టీని మెరుగుపరిచే పరిస్థితిలోలేరు' అని ఊర్మిళ వ్యాఖ్యానించినట్లు ముంబైకి చెందిన కొన్ని ఆంగ్లపత్రికలు పేర్కొన్నాయి. అయితే తాను ప్రజల కోసం పని చేస్తానని ఆమె పేర్కొన్నట్లు తెలుస్తోంది.

    చిల్లర రాజకీయాల వల్లే...

    చిల్లర రాజకీయాల వల్లే...

    పార్టీ అంతర్గత వ్యవహారాల్లో చిల్లర రాజకీయాలు చోటు చేసుకోవడం వల్లే ఊర్మిళా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ‘‘ముంబై కాంగ్రెస్‌లో పెద్ద లక్ష్యాల కోసం పని చేయడానికి బదులు చిల్లర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయని, ఇలాంటి పరిస్థితుల మధ్య పని చేయడానికి నా మనసు అంగీకరించడం లేదు' అని ఊర్మిళా పేర్కొన్నట్లు ఎఎన్ఐ పేర్కొంది.

    తన లేఖను పట్టించుకోకపోవడం వల్లే...

    తన లేఖను పట్టించుకోకపోవడం వల్లే...

    పార్టీలో జరుగుతున్న కొన్ని వ్యవహారాలపై ఆమె మే 16వ తేదీనే ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు మిలింద్ డియోరాకు లేఖ రాశారు. అయితే ఆయన ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో ఆమె రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ముంబై మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ సన్నిహితులు సందేష్ కొండ్విల్కర్, భూషణ్ పాటిల్ ప్రవర్తనను మాటోండ్కర్ తన లేఖలో విమర్శించినట్లు తెలుస్తోంది.

    ఊర్మిళా మండోద్కర్

    ఊర్మిళా మండోద్కర్

    44 సంవత్సరాల ఊర్మిళా మండోద్కర్ ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నార్త్ ముంబై స్థానం నుంచి పోటీ చేశారు. గెలుపు కోసం తన శక్తిమేర ప్రయత్నించారు. అయితే ఆమె బిజేపీ అభ్యర్థి గోపాల్ శెట్టి చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో ఆమెకు 2,41,431 ఓట్లు పడ్డాయి.

    English summary
    Actor-turned-politician Urmila Matondkar, on Tuesday resigned citing infighting in the Congress party. CNN-News18 quoted the actor-turned-politician as saying, "Key members of Mumbai Congress are unable to transform the party." She added that she would, however, continue to work for the people.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X