కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్న రంగీలా బ్యూటీ ఊర్మిళ
దేశంలో ఎక్కడ చూసినా ఎన్నికల సందడే కనిపిస్తోంది. రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతున్నాయి. నామినేషన్ గడువు దగ్గర పడుతుండటంతో అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్నాయి. పలువురు సినీ స్టార్లు సైతం ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకుంటున్నారు.
బాలీవుడ్ నటి ఊర్మిళా మండోద్కర్ ఈ వారం కాంగ్రెస్ పార్టీలో చేయబోతున్నారు. ముంబై నార్త్ నుంచి ఆమె లోక్ సభకు పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమె ముంబై కాంగ్రెస్ మాజీ చీఫ్ సంజయ్ నిరుపమ్‌ను మార్చి 25న కలిశారు. త్వరలో పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోన్నట్లు తెలుస్తోంది.

మరో వైపు బిగ్ బాస్ 10 కంటెస్టెంట్, తనకు తానుగా దేవుడిగా చెప్పుకుంటూ బాబాగా చలామణి అవుతున్న స్వామి ఓం కూడా ఈ సారి ఎన్నికల బరిలో దిగుతున్నారు. న్యూ ఢిల్లీ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. హిందూ వ్యతిరేకులపై పోరాటం చేసేందుకే తాను బరిలో నిలుస్తున్నట్లు స్వామి ఓం తెలిపారు.
గతేడాది ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి పాలైన ప్రముఖనటి జయప్రదకు ఈ సారి ఆ పార్టీ రాంపూర్ టికెట్ కేటాయించకపోవడంతో బీజేపీలో చేరారు.


Click it and Unblock the Notifications











