Daaku Maharaaj: ‘దబిడి దిబిడి’ కాంట్రవర్సీ .. బాలయ్యపై ఊర్వశీ రౌతేలా వైరల్ కామెంట్స్..
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'(Daaku Maharaj). సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, బాబీ డియోల్, సచిన్ ఖేడేకర్, హర్షవర్థన్, హిమజ లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు థమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో ఊర్వశీ రౌతేల(Urvashi Rautela)తో బాలయ్య ఐటెమ్ సాంగ్‌లో మాస్ సెప్పులేయడం కాంట్రవర్సీగా మారింది. తాజాగా ఈ వివాదంపై ఊర్వశీ రౌతేల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజ్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. 'డాకు మహారాజ్' సినిమా సక్సెస్ కావడంతో 'దబిడి దిబిడి'(Dabidi Dibidi) ఐటెం సాంగ్(Item song) మెయిన్ గా నిలిచింది. ఈ సాంగ్ కూడా సినిమాపై హైప్స్ క్రియేట్ చేసిందో స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. అయితే ఇందులో బాలయ్య- ఊర్వశి మధ్య స్టెప్పులపై కాంట్రవర్సీ క్రియేట్ అయ్యింది. బాలయ్య ఒక స్టెప్ మాత్రం వివాదాస్పదంగా మారింది. తాజాగా దీనిపై ఊర్వశీ రౌతేలా స్పందించింది.

ఈ వివాదంపై ఊర్వశి రవితేజ మీడియాతో మాట్లాడుతూ.. ఒక సినిమా విజయం సాధించినప్పుడు దానిపై విభిన్న అభిప్రాయాలు, కథనాలు వ్యక్తం అవుతాయి. వాటన్నిటిని తాను అర్థం చేసుకోగలనని పేర్కొంది. బాలకృష్ణతో డాన్స్, యాక్టింగ్ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించడం గర్వంగా ఉందని పేర్కొంది. నందమూరి బాలకృష్ణ నటనలో ఓ లెజెండ్ అని, ఆయనతో కలిసి నటించే అవకాశం తనకు రావడం గర్వంగా భావిస్తున్నానని పేర్కొంది. ఇదంతా నటనలో భాగమేనని బాలకృష్ణతో నటించిన కేవలం పర్ఫామెన్స్ కాదు.. బాలయ్యపై ఉన్న గౌరవమేనని, బాలకృష్ణతో పనిచేయడం నా కల అని పేర్కొంది.
ఆ కల డాకు మహారాజ్ సినిమాతో నెరవేరిందని, బాలకృష్ణతో నటించడం అదృష్టమన్నారు. ఆయన తన సహనాటులకు ఎంతో సపోర్ట్ ఇస్తారని ప్రశంసలు కురిపించింది. అలాగే దబిడి దిబిడి సాంగ్ ట్రోల్స్ పై కూడా స్పందించారు. జీవితంలో ఏం సాధించలేని వారు.. కష్టపడి పని చేసే వారిని విమర్శించే అర్హత ఉండదన్నారు. రియల్ పవర్ అనేది ఇతరులను విమర్శించడం కాదని, వారిలోని గొప్పదనాన్ని గుర్తించమని, దాన్ని ఆదర్శంగా తీసుకోవడమే నేర్చుకోవాలని షాకింగ్ కామెంట్స్ చేశారు ఊర్వశి. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











