Rishabh Pant ప్రేమ కోసం ఊర్వశి రౌటేలా ఆరాటం.. ఒయ్యారాలు ఒలకబోస్తూ ఇన్స్‌టాలో పోస్ట్!
అందాల భామ ఊర్వశి రౌటేలా వరుస సినిమాలతో, స్పెషల్ ఐటెమ్స్ సాంగ్స్‌తో తన కెరీర్ గ్రాఫ్‌ను పెంచుకొంటూ పోతున్నది. హిందీ సినిమాలే కాకుండా తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా మారింది. ఇటీవల కాలంలో తెలుగులో స్టార్ హీరోలతో జతకడుతూ తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకొంటున్నది. అయితే ఇండియన్ క్రికెటర్ వన్ సైడ్ లవ్‌లో ఉన్న ఈ బ్యూటీ తాజాగా మరోసారి మనసు పారేసుకొన్నది. ఊర్వశి రౌటేలా తన ప్రియుడికి రాసిన పోస్టు వివరాల్లోకి వెళితే..
వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ అంటూ : ఊర్వశి రౌటేలా తెలుగు ప్రేక్షకులకు ఇటీవల కాలంలో చాలా దగ్గరైంది. వాల్తేరు వీరయ్య చిత్రంలోని బాస్ పార్టీ పాటలో చిరంజీవితో స్టెప్పులేసి విశేషంగా అభిమానులను సొంతం చేసుకొన్నది. అంతటితో ఆగకుండా ఇటీవల అఖిల్‌తో కూడా రొమాన్స్ చేసింది. ఇటీవల రిలీజైన ఏజెంట్ సినిమాలో ఊర్వశి రౌటేలా ఓ స్పెషల్ సాంగ్‌లో స్టెప్పులేసి ఆకట్టుకొన్నది.

ఫిలింఫేర్ అవార్డుల్లో: ఇలా జోష్‌లో ఉన్న ఊర్వశి రౌటేలా ఇటీవల ఫిలింఫేర్ అవార్డుల్లో మెరిసింది. లంగా..జాకెట్‌తో శృంగార దేవతగా మారింది. ఫిలింఫేర్ అవార్డుల్లో ప్రముఖలందరి చూపును తనవైపుకు తిప్పుకొనేలా చేసింది. దేశంలోనే పాపులర్ అవార్డుల ఫంక్షన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాంటి అందమైన డ్రస్సులో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
రిషబ్ పంత్ కోసం నర్మగర్బంగా : ఊర్వశి రౌటేలా తన ఇన్స్‌టాగ్రామ్‌లో తన అందమైన ఫోటోను పోస్టు చేసి అభిమానులతో పంచుకొన్నది. నీవు కోరుకొనే వ్యక్తి నిన్ను పట్టుకోవడానికి రెడీగా లేడు అని నర్మగర్భమైన పోస్టును పెట్టింది. ఊర్వశి రటేలా పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఊర్వశి షేర్ చేసిన ఫోటో రిషబ్ పటేల్ కోసమేనని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.

వైల్డ్ సాలా పాట సక్సెస్ : ఊర్వశి రౌటేలా పోస్టు చేసిన ఫోటోను చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. ఈ ప్రపంచంలో నీలాంటి మోస్ట్ బ్యూటీఫుల్ అమ్మాయి ఎవరు ఉండరు. వైల్డ్ సాలా పాట సక్సెస్ అయినందుకు మీకు కంగ్రాట్స్. రిషబ్ పంత్‌తో నీ ప్రేమ మహాభారతానికి ఎప్పుడు తెర పడుతుంది. రిషబ్ భయ్యా.. వదిన నీ కోసం బాగా తయారై ఎలా ఉందో చూడు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెట్టారు.
నిన్ను చూస్తే గోల్డ్ మైన్ అంటూ : ఇంకా అంతటితో ఆగకుండా నెటిజన్ల కామెంట్ల వర్షం కురిపిస్తునే ఉన్నారు. దేవుడు చాలా సమయం తీసుకొని నిన్ను సృష్టించి ఉంటారేమో. నిన్ను చూస్తే గోల్డ్ మైన్ గుర్తుకు వస్తుంది. నా కళ్లలో మెరుపులు మెరుస్తున్నాయి. నీ గోల్డ్ లుక్ చూసి తట్టుకోలేకపోయతున్నాను అంటూ నెటిజన్లు ఏకంగా కవిత్వాన్ని పోస్టు చేస్తున్నారు.

ఫిలింఫేర్ వేదికపై వైల్డ్ సాలా అంటూ : ఇక ఫిలింఫేర్ అవార్డుల్లో తన డ్యాన్స్ సత్తాను ఊర్వశి రౌటేలా చాటింది. అవార్డుల వేదికపై ఏజెంట్ సినిమాలోని వైల్డ్ సాలా పాటపై స్టెప్పులు వేసింది. ఈ పాటకు స్టెప్పులేసినంత సేపు స్టేడియం చప్పట్లు, కేరింతల హోరుతో మార్మోగింది. ఏజెంట్ సినిమాలో కూడా అఖిల్‌తో వేసిన స్టెప్పులకు మంచి రెస్పాన్స్ వచ్చింది.


Click it and Unblock the Notifications











