నవరాత్రి, దుర్గాపూజ అంటే.. కొత్త నిర్వచనం చెప్పిన ఊర్వశి రౌటేలా
నవరాత్రి పండుగ అంటే మహిళా శక్తి, సామర్థ్యం ప్రతీక. అంతేకాకుండా రంగులు, ఆచారాలు, వేడుకలకు ప్రతిరూపం. ఆదిశక్తి గా భావించే దుర్గామాతను పశ్చిమ బెంగాల్, గుజరాత్‌లో భక్తి శ్రద్దలతో కొలుస్తారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అమ్మవారి కరుణ కటాక్షాల కోసం పలు రకాల పూజలు చేస్తుంటారు. దుర్గామాత పూజను సినీ సెలబ్రిటీలు కూడా నిష్ఠగా జరుపుకొంటారు. ఈ క్రమంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా నవరాత్రి పండుగను తనదైన శైలిలో అభివర్ణించారు.
నవరాత్రి పండుగ అంటే.. ఏదో పర్వదినమని నేను జరుపుకోను. మహిళల గౌరవాన్ని చాటి చెప్పే దుర్గాపూజ విశిష్టతను తెలుసుకోనేందుకు ప్రయత్నిస్తాను. విశ్వవ్యాప్తంగా దుష్టశక్తులను వెంటాడే దుర్గామాత శక్తిని తెలుసుకొంటాను అని తెలిపారు. చెడును దూరంగా చేసే నవరాత్రి పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగు తీసుకురావాలి. సమస్యలను ఎదురించే శక్తిని ప్రసాదించాలని కోరుకొంటాను. హ్యాపీ నవరాత్రి అంటూ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ పోస్టు పెట్టారు.

నవరాత్రి అంటే తొమ్మిది అద్భుతాలు. శక్తిమంతమైన మహిళ సాధించిన అద్భుతాలకు ప్రతీరూపం ఈ పండుగ. తొమ్మిది అవతారాల నుంచి భక్తులు దీవెనలు పొందాలను కోరుకొంటారు. ఈ పండుగలో తొమ్మిది రకాల విశిష్టతలు ఏమిటంటే.. శక్తి, సంతోషం, మానవత్వం, శాంతి, విజ్ఞానం, భక్తి, పేరు, ప్రఖ్యాతులు, ఆరోగ్యం అని ఊర్వశి రౌటేలా అన్నారు.
ఇక ఊర్వశి రౌటేలా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల వర్జిన్ భానుప్రియ చిత్రంలో నటించారు. ప్రస్తుతం తెలుగులో సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న బ్లాక్ రోజ్ అనే చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











