అనాథ బాలికలకు ఫుడ్ పంపిణీ చేసిన ఊర్వశి రౌటేలా

మాజీ మిస్ యూనివర్స్, బాలీవుడ్ నటి ఊర్వశి రటేలా మానవత్వానికి చాటుకొన్నారు. మహిళల హక్కులు, చైతన్యం గురించి తన వాణిని వినిపిస్తున్న ఊర్వశి తాజాగా అనాథ బాలికలతో కలిసి కన్య పూజా వేడుకను జరుపుకొన్నారు. ముంబైలో జరిగిన ఈ వేడుకలో పలువురు ఆనాథ బాలికలను ఆహ్వానించి వారికి ఆహారం పంపిణి చేశారు.

నవరాత్రి వేడుకల నేపథ్యంలో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. ఊర్వశి కుటుంబంలో అనాదిగా ఈ ఆచారం వస్తుందని తెలిపారు. ఈ వేడుకలో పలు రకాల ఆహార పదార్థాలను అందించారు. ఇలాంటి ఆచారాలు ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.

 Urvashi Rautela distributes food for underprivileged young girls in Mumbai

కన్య పూజ తర్వాత ఊర్వశి రౌటేలా విధుల్లోకి వచ్చి పోషక విలువలు ఉన్న ఆహార పదార్థాలు ఉన్న బాక్సులను పంచిపెట్టారు. లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ.. ముఖానికి మాస్క్, సానిటైజర్, చేతులకు గౌవ్స్ ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఇక ఊర్వశి రౌటేలా కెరీర్ విషయానికి వస్తే.. గౌతమ్ గులాటి, అర్చనా పూరన్ సింగ్‌తో కలిసి వర్జిన్ భానుప్రియా అనే చిత్రంలో నటించారు. అలాగే తెలుగులో సంపత్ నంది రూపొందిస్తన్న బ్లాక్ రోజ్ చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇదిలా ఉండగా, గాయని నేహా కక్కర్ పెళ్లికి హాజరైన ఊర్వశి హల్‌చల్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X