ఊర్వశి రటేలా 5 కోట్ల విరాళం.. కరోనాపై పోరాటానికి బాలీవుడ్ నటి చేయూత
బాలీవుడ్ అందాల తార ఊర్వశి రౌటేలా మానవత్వాన్ని చాటుకొంటూ కరోనాపై పోరాటానికి ముందుకొచ్చారు. ఈ ప్రాణాంతక వ్యాధిపై పోరాటం చేయడానికి ఆమె తన వంతు బాధ్యతగా 5 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించడం బాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉందని, ఎవరైనా తమకు తోచిన విధంగా విరాళాలు అందించాలని, ఎంత ఇచ్చినా అది చిన్న మొత్తం కాదని ఆమె చెప్పారు.
ఇటీవల లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్‌లో డ్యాన్స్ క్లాసులు మొదలు పెట్టారు. బరువు తగ్గాలనే వారు తన డ్యాన్స్ క్లాసుల్లో ఉచితంగా పాల్గొన వచ్చని ఊర్వశి వెల్లడించారు. ఆ డ్యాన్స్ క్లాసులను టిక్‌టాక్ యాప్ ద్వారా నిర్వహించారు. ఆ పిలుపునకు దాదాపు 18 మిలియన్ల మంది టిక్‌టాక్‌లో స్పందించారు. దాంతో టిక్ టాక్ నుంచి 5 కోట్ల ఆదాయం వచ్చింది. ఆ మొత్తాన్ని ఆమె కరోనా వైరస్ పోరాటానికి విరాళంగా ఇచ్చారు.

కరోనాపై పోరాటంలో CRY, Unicef, Swadesh Foundation లాంటి స్వచ్ఛంద సంస్థలు ఎనలేని కృషిని చేస్తున్నాయి. ఈ సంస్థలు దిగువ ఆదాయం, ఇళ్లు లేని ప్రజలకు, ఇతర పేద వర్గాలకు సహాయం అందిస్తున్నాయి. వారికి నేను విరాళం అందిస్తున్నాను అని తెలిపారు.
కరోనాపై పోరాటానికి సినీ వర్గాల నుంచి వస్తున్న స్పందన అద్బుతంగా ఉంది. నటీనటులు, సాంకేతిక నిపుణులే కాకుండా రాజకీయ నేతలు, క్రీడాకారులు కూడా ముందుకు రావడం గొప్ప విషయం. వీరికి తోడుగా సామాన్య ప్రజలు కూడా ఈ పోరాటంలో భాగం కావాలి. తమకు తోచినంతగా విరాళాలు అందించాలి అని ఊర్వశి రటేలా చెప్పారు.
కెరీర్ పరంగా ఊర్వశి రటేలా పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. బీట్ పే తుమ్కా అనే డ్యాన్స్ ఆల్బమ్‌తో ముందుకు వచ్చారు. ఇటీవల రిలీజైన ఆ ఆల్బమ్‌కు విశేష స్పందన వస్తున్నది. వర్జిన్ భానుప్రియ అనే కామెడీ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ప్రత్యేకమైన పాటలో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











