24 క్యారెట్ల గోల్డ్ ఐఫోన్‌ పొగొట్టుకొన్న ఊర్వశీ రౌటేలా..నీ ఫోన్ ఇస్తా..కానీ అంటూ అభిమాని డిమాండ్ ఏమిటంటే?

బాలీవుడ్‌తోపాటు దక్షిణాది ప్రేక్షకులకు చేరువైన అందాల భామ ఊర్వశి రౌటేలా కొద్ది రోజులుగా కంగారు పడుతున్నది. ఇటీవల ఆహ్మాదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో అత్యంత ఖరీదైన ఐఫోన్‌ను పొగొట్టుకోవడం అందుకు కారణమైంది. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా 24 క్యారెట్ల బంగారంతో చేసిన ఐఫోన్‌ను ఎవరో దొంగిలించడంతో దాదాపు మనస్తాపానికి గురైంది.

అత్యంత ఖరీదైన ఐఫోన్ పోయిందని తెలుసుకొన్న వెంటనే ఆహ్మాదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గత కొద్ది రోజులుగా పొగొట్టుకొన్న ఐఫోన్ గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఆరాట పడుతున్నది. అయితే ఆ ఫోన్‌ దొంగిలించిన వ్యక్తి తాజాగా ఊర్వశీకి ఫోన్ చేసి షాకింగ్ మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్ వివరాల్లోకి వెళితే..

Urvashi Rautela gets email with Conditions from fan to returning her 24-carat gold iPhone

తన ఐఫోన్ ఆచూకీ కోసం ఊర్వశీ రౌటేలా శతవిధాల ప్రయత్నిస్తున్నది. తన ప్రయత్నాల్లో భాగంగా ఆమె ఇటీవల ఓ ప్రకటన కూడా చేసింది. తన ఫోన్ తిరిగి తీసుకొచ్చిన వారికి తగిన బహుమతి కూడా ఇస్తానని చెప్పింది. తన ఫోన్‌ చాలా విలువైనది. ఆ ఫోన్‌లో చాలా సమాచారం ఉంది. నా వ్యక్తి గత విషయాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరికైనా దొరికితే వెంటనే నాకు తెచ్చి ఇవ్వండి అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

అయితే ఊర్వశీ రౌటేలా పోస్టు పెట్టిన తర్వాత తన ఈమెయిల్‌కు ఓ వ్యక్తి మెసేజ్ పంపారు. ఈ మెయిల్ పంపిన వ్యక్తి ఆమెకు డై హార్డ్ ఫ్యాన్ కావడం గమనార్హం. అయితే ఆ ఫోన్ ప్రస్తుతం ఇంకా వాడకంలో ఉందనే విషయం మెసేజ్ ద్వారా తెలిసింది. అయితే ఊర్వశి రౌటేలాకు అభిమాని పంపిన సమాధానమే భావోద్వేగానికి గురిచేసేలా ఉంది.

Urvashi Rautela gets email with Conditions from fan to returning her 24-carat gold iPhone

ఊర్వశీ రౌటేలాకు అభిమాని మెసేజ్ చేస్తూ.. నా వద్ద నీ ఫోన్ ఉంది. మీకు ఆ ఫోన్ కావాలంటే.. నాకు భారీ సహాయం చేయాలి. నా సోదరుడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అతడి వైద్యానికి ఖర్చు అయ్యే మొత్తాన్ని ఇవ్వగలరా? అని ఈమెయిల్‌లో రాశాడు. దాంతో ఆ ఈమెయిల్‌కు సమాధానం ఇస్తూ.. సరే అని థమ్సప్ సింబల్ పెట్టింది. ఊర్వశీకి వచ్చిన ఈమెయిల్ గ్రో ట్రేడర్ అనే ఐడీ నుంచి రావడం జరిగింది.

అభిమాని నుంచి వచ్చిన ఈమెయిల్ స్క్రీన్ షాట్‌ను ఊర్వశి రౌటేలా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసింది. అంతేకాకుండా తన అభిమానిని కష్టాల్లో నుంచి ఆదుకొంటానని ప్రామిస్ చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X