ఊర్వశి రౌటేలాపై మోజు పడుతున్న ఆ నిర్మాతలు.. హిట్టు లేకపోయినా కోట్ల రెమ్యునరేషన్‌తో!
నార్త్ సినిమా నుంచి తెలుగు సినిమాకి వచ్చి సెన్సేషన్ గా మారిన హిట్ బ్యూటీస్ లో మంచి హ్యాపెనింగ్ బ్యూటీగా దూసుకెళ్తున్న నటి ఊర్వశి రౌతేలా కూడా ఒకామె అని చెప్పాలి. కాగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య లో మెరిసిన తాను అక్కడ నుంచి తెలుగులో వరుస ఆఫర్స్ ని అందుకొని దూసుకెళ్లడం జరిగింది. ఇక ఇక్కడ నుంచి చాలా ఐటెం సాంగ్స్ నుంచి ఇపుడు నటిగా కూడా తెలుగులో ఎంట్రీ ఇచ్చేసింది.
ఇలా హిందీలో కంటే తెలుగు లోనే సూపర్ బిజీగా మారిపోయిన ఊర్వశి రౌతేలాకి తెలుగులో గట్టి డిమాండ్ ఉందని అర్ధం అవుతుంది కానీ ఇక్కడ తనపై ఓ నిర్మాణ సంస్థకి స్పెషల్ ఇంట్రెస్టింగ్ ఉందా అనే అవుననే అనిపిస్తుందని చెప్పాలి. కాగా తెలుగులో ఊర్వశి రౌతేలాని హైలైట్ చేసిన నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అని చెప్పాలి.

మెగాస్టార్ తో వాల్తేరు వీరయ్య కోసం ఆమెని తీసుకొచ్చిన మైత్రి మూవీ మేకర్స్ ఇపుడు ఈమెనే తమ బ్యానర్ లో పలు సినిమాలకి కొనసాగిస్తుండడం గమనార్హం. అక్కడ వాల్తేరు వీరయ్య తర్వాత లేటెస్ట్ గా వారి దర్శకుడు బాబీ మళ్ళీ మొన్న బాలయ్యతో డాకు మహారాజ్ సినిమాలో కూడా చేయించాడు. ఇక మళ్ళీ మైత్రి నుంచే మళ్ళీ మరో ఆఫర్ ఈమెకి ఇచ్చారు.
మైత్రి మూవీ మేకర్స్ హిందీలో చేస్తున్న మొదటి భారీ చిత్రం "జాట్" హీరో సన్నీ డియోల్ చేస్తున్న చిత్రంలో స్పెషల్ ఐటెం సాంగ్ ని ఇపుడు మేకర్స్ రివీల్ చేశారు. కాగా ఈ సాంగ్ లో మొదట కనిపించేది ఎవరు అనేది చూపించలేదు కానీ ఇపుడు సాంగ్ తో మళ్ళీ ఉర్వశి రౌతేలాని వారు తీసుకొచ్చారు. దిల్ తుజ్‌కే దుంగే.. పహ్లే సారీ బోల్ అనే పాటతో మరోసారి స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. దీనితో వరుస ఆఫర్స్ ని ఈ సంస్థ అందించడం ఆసక్తిగా మారింది అని చెప్పాలి.
అంతే కాకుండా మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న మరో భారీ చిత్రం ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా ఈమె ఉందని పలు పుకార్లు కూడా ఉన్నాయి. ఇక వీరితో పాటుగా మరో నిర్మాణ సంస్థ కూడా ఊర్వశి పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ గానే ఉన్నట్టు కనిపిస్తుంది. ఇపుడు జాట్ నిర్మాణ సంస్థ మైత్రితో పాటుగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు కూడా ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్నారు.
అలాగే వీరితో కూడా ఊర్వశి ఇపుడు ఈ సినిమా మాత్రమే కాకుండా ఇదే ప్రొడక్షన్ హౌస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సాయి ధరమ్ తేజ్ కలయికలో వచ్చిన బ్రో ది అవతార్ లో కూడా ఆమె స్పెషల్ సాంగ్ చేయడం విశేషం. ఇలా ఈ రెండు బడా నిర్మాణ సంస్థలు కూడా ఊర్వశి పట్ల స్పెషల్ ఇంట్రెస్ట్ గా ఉన్నారని చెప్పవచ్చు.
మరి ఫ్యూచర్ లో వీరి నుంచి ఆమెతో మరిన్ని సినిమాలు ఏమన్నా ఉంటాయో ఏమో అనేది చూడాలి మరి. ఇక ప్రస్తుతం తన నుంచి వచ్చిన జాట్ సాంగ్ హిందీ ఆడియెన్స్ ని అలరిస్తుండగా అందులో ఊర్వశి రౌతేలా మరోసారి తన అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో నెటిజన్స్ నడుమ ట్రెండింగ్ టాపిక్ గా నిలిచింది. ఇదిలా ఉంటే.. సోలోగా సింగిల్ హిట్టు లేని హీరోయిన్.. భారీ రెమ్యునరేషన్ ఆఫర్లతో మంచి డిమాండ్‌తో ఉండటం ఏమిటని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు.


Click it and Unblock the Notifications











