తమన్నా భాటియాపై కడుపుమంట.. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా అలాంటి పని

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. 'హ్యాపీ డేస్' సినిమాతో టాలీవుడ్లో తొలిసారిగా బిగ్ హిట్ అందుకున్న మిల్క్ బ్యూటీ ఆ తర్వాత నుంచి వరుసగా ఆఫర్లు అందుకుంటూ వచ్చింది. ఏకంగా స్టార్ హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, చిరంజీవి వంటి హీరోలకు జోడీగా నటించి మెప్పించింది. తెలుగుతో పాటు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటించి అక్కడా అదరగొట్టింది. ఇక కొన్నాళ్లుగా ఇటు తెలు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్లో దుమ్ములేపుతోంది.

తమన్నా భాటియా ప్రస్తుతం తన కెరీయర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. దీంతో కాస్తా రూటు మార్చి ఘాటుగా వెండితెరపై మెరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఏకంగా బోల్డ్ పాత్రల్లో నటించి ఆడియెన్స్ మతులు పోగొడుతోంది. 'లస్ట్ స్టోరీస్ 2', 'జీ కర్దా' వంటి ప్రాజెక్ట్స్ ల్లో తమన్నా ఎలాంటి పాత్రల్లో నటించిందో అందరికీ తెలిసిందే. బోల్డ్ మరియు ఛాలెంజింగ్ పాత్రల్లో నటిస్తూ రెండో దశ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

Urvashi Rautela gets Jealous about Tamannaah Bhatia Dance

ఇలా వచ్చిన అవకాశాలను మిల్క్ బ్యూటీ అందుకుంటూనే మరోవైపు తన డ్యాన్స్ నెంబర్స్ తోనూ సెన్సేషన్ గా మారుతోంది. స్పెషల్ సాంగ్స్ తో గతంలోనే ఆకట్టుకున్న ఈ స్టార్ బ్యూటీ ప్రస్తుతం మాత్రం వరుస పెట్టి ఐటెమ్ సాంగ్స్ ల్లో నటిస్తూ మెప్పిస్తోంది. కుర్ర గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. గ్లామర్ డోస్, తన ఊరమాస్ స్టెప్పులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ నటించిన 'రైడ్ 2' చిత్రం నుంచి తమన్నా భాటియా స్పెషల్ సాంగ్ 'నషా' వీడియో సాంగ్ విడుదలైంది.

ప్రస్తుతం ఆ పాట సోషల్ మీడియాలో దుమ్ములేపుతోంది. ఈ సందర్భంగా ఆ సాంగ్ కు వస్తున్న ఆదరణను తాజాగా స్పెషల్ డ్యాన్స్ లకు కెరాఫ్ అయిన ఊర్వశీ రౌటేలా జీర్ణించుకోలేకపోయిందని అంటున్నారు. ఆమె రెడిట్ లో తమన్నా సాంగ్ 'నషా' కంటే తన 'సారీ బోల్' సాంగే బాగుందనే పోస్ట్ ను పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. అయితే ఆ పోస్ట్ ను క్షణాల్లోనే డిలీట్ చేసినా సోషల్ మీడియాలో మాత్రం వార్త తెగ వైరల్ అవుతోంది. దీంతో తమన్నా పై ఇంత కడుపు మంట ఎందుకని అభిమానులు ఊర్వశీని అడుగుతున్నారు.

ఇక ఏదేమైనా తమన్నా భాటియా నటించిన లేటెస్ట్ 'నషా' వీడియో సాంగ్ మాత్రం యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. తమన్నా భాటియా మాస్ స్టెప్పులు, గ్లామర్ ట్రీక్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. మరోవైపు తమన్నా 'ఓదెల 2' చిత్రంలోనూ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అఘోరిగా అలరించబోతోంది. ఏప్రిల్ 17న గ్రాండ్ విడుదల కాబోతోంది. ఇక ఊర్వశీ రౌటేలా చివరిగా నందమూరి బాలకృష్ణ సరసన 'డాకూ మహారాజ్' చిత్రంలో 'దబిడి దిబిడి' సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతకు ముందు చిరంజీవి, రామ్ పోతినేని, అఖిల్ సరసన మాస్ స్టెప్పులేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X