దబిడి దిబిడి సాంగ్‌పై నోరు జారిన ఊర్వశి రౌటేలా.. వాళ్ల మైండ్ సెట్ కోసమే అంటూ!

15 ఏళ్లకే మోడలింగ్ లో అడుగుపెట్టి, ప్రస్తుతం సౌత్, నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన ఊర్వశీ రౌటేలా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ తో దుమ్ములేపుతున్న అందాల భామ ఆమె. బడా హీరోలు, యంగ్ హీరోల సరసన స్పెషల్ డ్యాన్స్ లతో అదరగొడుతోంది. తన మాస్ స్టెప్పులతో సౌత్ ఆడియెన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో వెండితెరపై తన సత్తా చాటుకుంటోంది. కొన్నాళ్లుగా తెలుగులో మాత్రం వరుస సినిమా ఆఫర్లను దక్కించుకుంటూ దుమ్ములేపుతోంది. తన పెర్ఫామెన్స్ తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గానూ మారుతోంది. మరోవైపు ఇప్పుడు నటిగానూ అవకాశాలు అందుకుంటోంది.

ఊర్వశీ రౌటేలా రీసెంట్ గా 'డాకు మహారాజ్' చిత్రంలో అలరించిన విషయం తెలిసిందే. నందమూరి నటసింహం బాలక్రిష్ణ సరసన ఈ బ్యూటీ నటించింది. ఎప్పుడూ స్పెషల్ సాంగ్స్ తో ఆకట్టుకునే ఊర్వశీ రౌటేలాకు 'డాకు మహారాజ్' చిత్రంతో నటిగా అవకాశం వచ్చింది. ఎస్ఐ జానకీ పాత్రలో అదరగొట్టింది. మరోవైపు బాలయ్య సరసన మంచి నటనను ప్రదర్శించింది. అలాగే ఈ చిత్రంలో 'దబిడి దిబిడి' సాంగ్ లో మాస్ స్టెప్పులతో యువతను ఊగిపోయేలా చేసింది. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ కు కిక్కిచ్చే పెర్ఫామెన్స్ ను కనబర్చింది. ఇక ఆ సాంగ్ కూడా ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే.

Urvashi Rautela given Clarity on Balakrishna Daaku Maharaj Movie Dabidi Dibidi Song

అయితే.. డాకు మహారాజ్ లోని 'దబిడి దిబిడి' సాంగ్ లిరిక్స్, డాన్స్ విషయంలో ఆ మధ్య కొంత ట్రోలింగ్ జరిగింది. బాలయ్య - ఊర్వశీ రౌటేలాతో వేసిన కొన్ని స్టెప్పులకు పలువురు విమర్శలు కురిపించారు. దీనిపై టీమ్ పెద్దగా స్పందించకున్నా.. ట్రోలింగ్ మాత్రం ఒకింత బాగానే నడించింది. మహిళలను గౌరవించే బాలయ్యతో మరీ బోల్డ్ స్టెప్పులు వేయించారని, పలు రకాలుగా ట్రోల్ జరిగింది. దీనిపై ఇక తాజాగా ఊర్వశీ రౌటేలా స్పందించింది. ఇటీవల ఓ హాలీవుడ్ రిపోర్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'దబిడి దిబిడి' సాంగ్ పై స్పందించింది.

'దబిడి దిబిడి సాంగ్ లోని లిరిక్స్ ను గమనిస్తే.. పూర్తిగా బాలక్రిష్ణ అభిమానుల కోసమే రాసింది. ప్రతి లిరిక్, ప్రతి వాఖ్యం వాళ్ల మైండ్ సెట్ కోసమే క్రాఫ్ట్ చేశారు... ఇక నా రిహార్సల్ విషయానికొస్తే.. ప్రతిది బాగానే జరిగింది. ప్రతి సాంగ్ కొరియోగ్రాఫ్ కంటే ఈ సాంగ్ కు చాలా మంచి రిహార్సల్ జరిగింది. శేఖర్ మాస్టర్ తో కలిసి పనిచేయడం బాగుంది. ఇప్పటి నాలుగు సార్లు ఆయన కొరియోగ్రఫీలో నటించాను. రిహార్సల్ మాత్రం చాలా సౌలభ్యంగా జరిగింది.

Urvashi Rautela given Clarity on Balakrishna Daaku Maharaj Movie Dabidi Dibidi Song

కానీ ఒక్కసారిగా నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకు కొరియోగ్రఫీని ఆ కోణంలో చూశారో అర్థం కాలేదు. కొరియోతో అందరూ సాంగ్ ను ఎలా చేస్తారో అలాంటి వాతావరణమే కనిపించింది. కానీ అనుకున్నట్టుగానే సాంగ్ ను మాత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.' అని చెప్పుకొచ్చింది. ఇక ఊర్వశీ రౌటేలా 'వాల్తేరు వీరయ్య' నుంచి తెలుగు ఆడియెన్స్ కు స్పెషల్ సాంగ్స్ తో దగ్గరైంది. ఆ తర్వాత వరుసగా 'ఏజెంట్', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'బ్రో', స్కంద, వంటి చిత్రాల్లో మెరిసింది. బాస్ పార్టీ, మైడియర్ మార్కండేయ, కల్ట్ మామ, దబిడి దిబిడి వంటి సాంగ్స్ ఊర్వశీకి మంచి రెస్పాన్స్ ను తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X