టాలీవుడ్లో ఊర్వశి రౌతేలాకి బంపరాఫర్.. బిగ్గెస్ట్ పాన్ ఇండియా కాంబినేషన్లో ఓకే అయ్యిందా?

రీసెంట్ గా తెలుగు సినిమా దగ్గర అదరగొడుతున్న నార్త్ బ్యూటీస్ లో వరుస ఆఫర్స్ అందుకుంటున్న హీరోయిన్ మాత్రం ఒకే ఒక్క నటి ఉందని చెప్పాలి. కాగా ఆమె ఎవరో కాదు తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య అనే సినిమా చేసి అందులో బాస్ బ్యూటీగా స్టెప్పులేసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన బ్యూటీ ఊర్వశి రౌతేలా అని చెప్పాలి. కాగా ఇక్కడ నుంచి ఊర్వశి రౌతేలా తెలుగు సినిమా దగ్గర మళ్ళీ వెనక్కు తిరిగి చూసుకోలేదు.

అలా పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసుకునే స్టేజి నుంచి ఇపుడు వాటితో పాటుగా తెలుగు సినిమాలో కూడా నటిగా ఆమె ఎంట్రీ ఇచ్చింది. నందమూరి మాస్ గాడ్ బాలకృష్ణ హీరోగా అదే వాల్తేరు వీరయ్య దర్శకుడు కొల్లి రవీంద్ర తెరకెక్కించిన బిగ్ హిట్ డాకు మహారాజ్ లో ఊర్వశి రౌతేలా అందాల విందు చూపించింది. అంతేనా ఈ సినిమాలో బాలయ్యతో దబిడి దిబిడి సాంగ్ అయితే గ్లోబల్ రీచ్ ని కూడా అందుకుంది.

urvashi rautela got a sensational offer in telugu cinema

ఇలా తెలుగు సినిమాలో ఊర్వశి రౌతేలా ఓ రేంజ్ లో దూసుకెళ్తుండగా ఇపుడు టాలీవుడ్ లో ఆమె కెరీర్లోనే బిగ్గెస్ట్ ఆఫర్ ని అందుకున్నట్టుగా పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. ఊర్వశి హిందీ సినిమా నుంచి వచ్చింది అని అందరికీ తెలిసిందే. కానీ హిందీలో కూడా ఆమెకి రాని కెరీర్ బిగ్ ఆఫర్ ఇపుడు తెలుగు సినిమా నుంచి వచ్చింది అట.

ప్రస్తుతం మన తెలుగు సినిమా నుంచి పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ఎలాంటి హైప్ అందుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ఈ పాన్ ఇండియా లెవెల్లోనే ఆడియెన్స్ ఆసక్తిగా ఉన్న ఓ కాంబినేషన్ లో ఓకే అయ్యిందట. మరి ఇంతకీ ఆ సినిమా ఏదో కూడా కాదు సెన్సేషనల్ దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ల కలయికలో చేస్తున్న "డ్రాగన్" సినిమాలో అట..

urvashi rautela got a sensational offer in telugu cinema

కాగా ఈ సినిమాలో కీలక పాత్ర లేదా ఓ హాట్ ఐటెం సాంగ్ నెంబర్ కోసం ఊర్వశి రౌతేలా పేరుని మేకర్స్ లాక్ చేసినట్టుగా ఇపుడు పలు పుకార్లు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి ఇదే కానీ నిజం అయితే తన కెరీర్లోనే బిగ్గెస్ట్ ఆఫర్ ని ఆమె పట్టేసినట్టే అని చెప్పి తీరాలి. మరి ఈ బిగ్ ప్రాజెక్ట్ లో ఆమె ఉందో లేదో ఇంకొంత కాలం ఆగి చూడాల్సిందే.

ఇటీవల డాకు మహారాజ్ లో కనిపించిన ఈ బ్యూటీ మొన్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా సందడి చేయడమే కాకుండా పాన్ ఇండియా ఇండస్ట్రీ హిట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన చిత్రం పుష్ప 2 ది రూల్ సినిమా దర్శకుడు సుకుమార్ తో కూడా కనిపించి కాసేపు హల్చల్ చేసింది. ఇవి కూడా ఓ పక్క వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X