NBK109 300 కోట్ల బాలయ్య మూవీలో బాస్ పార్టీ భామ.. రోల్ లీక్ చేసి హైప్ పెంచిన ఊర్వశి రౌటేలా!

నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో 109వ సినిమాగా రూపొందుతున్న తెలుగు సినిమా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన విషయాలు అభిమానుల్లో హైప్ క్రియేట్ చేస్తున్నాయి. దాంతో షూటింగ్ దశలోనే ఈ సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడుతున్నది. ఈ సినిమాకు సంబంధించిన లీకులను హీరోయిన్ ఊర్వశి రౌటేలా ఇస్తూ మరింత బజ్ క్రియేట్ చేస్తున్నది. తాజాగా ఊర్వశి రౌటేలా ఇచ్చిన లీకులు ఏమిటంటే?

నందమూరి బాలకృష్ణ, బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా షూటింగు శరవేగంగా జరుగుతున్నది. ఈ సినిమాను సుమారుగా 300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. అంతేకాకుండా యానిమల్ సినిమాతో ఇండియన్ ఇండస్ట్రీలో పాపులారిటీ సాధించిన బాబీ డియోల్ విలన్‌గా, అలాగే సీతారామంతో ప్రేక్షకులకు చేరువైన దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో నటించడం విశేషంగా మారింది.

Urvashi Rautela leaks her role in 300 crore massive budget movie of Nandamuri Balakrishnas NBK109

NBK109 చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతున్నది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నాగవంశీ తమ సితారా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. బాలయ్య, పలువురు నటీనటులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా విషయాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే NBK109 మూవీలో ఊర్వశి రౌటేలా కీలక పాత్రను పోషిస్తున్నది. ఈ క్రమంలో ఆమె తన పాత్ర గురించి వివరాలను వెల్లడిస్తూ మూవీపై క్రేజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్‌లో ఉండే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాను. నా రోల్ చాలా పవర్‌ఫుల్‌గా, కొత్తగా ఉండబోతుంది అని ఊర్వశి రౌటేలా చెప్పారు.

Urvashi Rautela leaks her role in 300 crore massive budget movie of Nandamuri Balakrishnas NBK109

ఇదిలా ఉండగా, NBK109 సినిమాలో ఆఫర్ రావడానికి ప్రధాన కారణం ఇన్స్‌పెక్టర్ అవినాష్ మూవీ. నేను ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటించాను. ఆ రోల్‌కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచే కాకుండా క్రిటిక్స్ నుంచి మంచి స్పందన లభించింది. ఆ సినిమాకు ఐఎండీబీలో 8.5 రేటింగ్ వచ్చింది. డైరెక్టర్ బాబీ ఆ సినిమాను చూసి నాకు అవకాశం ఇచ్చారు అని చెప్పారు.

Urvashi Rautela leaks her role in 300 crore massive budget movie of Nandamuri Balakrishnas NBK109

ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో ఊర్వశీ రౌటేలా తెలుగులో అగ్రనటులతో కలిసి నటించింది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, పవన్ కల్యాణ్ నటించిన బాబీ, రామ్ పోతినేని నటించిన స్కంధ మూవీలో ఈ భామ స్పెషల్ సాంగ్స్‌తో ఆకట్టుకొన్నారు. తాజాగా NBK109 మూవీలో ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X