ఊర్వశి రౌతేలాకి చిప్ పోయిందా?.. సైఫ్‌పై దాడి ఘటనపై లెంపేసుకొన్న డాకు మహారాజ్ బ్యూటీ!
తెలుగు సినిమాల్లో పాటలకి మరీ ముఖ్యంగా ఐటెం సాంగ్స్ కి ఎలాంటి ట్రాక్ రికార్డు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలా ఇన్నేళ్ళలో ఎన్నో ఐటెం సాంగ్స్ అలరిస్తే వాటిలో ఎందరో హాట్ భామలు దేశ విదేశాల నుంచి కూడా వచ్చి మత్తెక్కించారు. కాగా ఇపుడు టాలీవుడ్ లో ట్రెండింగ్ లో ఉన్నటువంటి టాప్ అండ్ హాట్ ఐటెం బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది బాలీవుడ్ హాట్ భామ ఊర్వశి రౌతేలా అని చెప్పవచ్చు.
కాగా టాలీవుడ్ లో భారీ హిట్ అయ్యిన "వాల్తేరు వీరయ్య" సినిమాతో ఆమె మంచి బ్రేక్ అందుకోగా ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో వెంటనే కనిపించింది. ఇలా లేటెస్ట్ గా నటసింహం బాలకృష్ణ హీరోగా అదే వాల్తేరు వీరయ్య దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన భారీ హిట్ చిత్రం "డాకు మహారాజ్"లో ఐటెం భామగానే కాకుండా నటిగా కూడా కనిపించి అండ చందాలతో అదరగొట్టింది.

కాగా నటిగా ఐటెం గర్ల్ గా ఊర్వశి రౌతేలా పర్ఫెక్ట్ గానే సెట్ అయ్యింది కానీ ఆఫ్ లైన్ ఈమె చేసే పనులు మాత్రం వాటికి పొంతనే కుదరవు. కాగా ఇలానే రీసెంట్ గా డాకు మహారాజ్ సాంగ్ పై వచ్చిన ట్రోల్స్ ని పొగడ్తలు అనుకోని ఆ బండ బూతులు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. దీనితో ఆమెకి తెలుగు రాక అర్ధం కాక ఇలా చేసింది అనుకుంటే ఇపుడు మరోసారి సోషల్ మీడియాలో తన వింత ప్రవర్తనతో హాట్ టాపిక్ గా మారింది.
కాగా రీసెంట్ గానే బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ దారుణంగా కత్తి పోట్లకి లోనైన సంగతి తెలిసిందే. కాగా ఈ ఘటన బాలీవుడ్ సహా టాలీవుడ్ లో కూడా సంచలనంగా మారగా ఒక హిందీ నటిగా ఈ సెన్సిటివ్ ఘటనపై ఆమెని నేషనల్ మీడియా వారు ప్రశ్నిస్తే ఈమె చేసిన కామెంట్స్ ఇపుడు ఆశ్చర్యంగా మారాయి. ఆమెని సైఫ్ ఘటన కోసం అడిగితే అది వదిలేసి తాను నటించిన డాకు మహారాజ్ కోసం చెబుతుంది.
సినిమా నాలుగు రోజుల్లో 104 కోట్లు వసూలు చేసింది. మా అమ్మ నాకు డైమండ్స్ ఇచ్చారు మా నాన్న నాకు మినీ వాచ్ గిఫ్ట్ ఇచ్చారు. దర్శకుడు బాబీ, హీరో బాలకృష్ణలతో వర్క్ చేయడం బాగుంది అన్నట్టుగా సంబంధమే లేకుండా మాట్లాడుతుంది. దీనితో ఈ కామెంట్స్ విన్న హిందీ నెటిజన్స్ సైతం అవాక్కవుతున్నారు.
Reporter: “Saif Ali Khan got stabbed. What do you have to say about this?”
— Aaraynsh (@aaraynsh) January 17, 2025
Urvashi Rautela: “Yes, after Daaku Maharaj crossed 105 crores, my mom gifted me this diamond Rolex watch, and my dad gave me this mini watch!” 🥲
pic.twitter.com/FstP38BeXS
అసలు ఈమే ఏం మాట్లాడుతుందో ఈమెకే అర్ధం కాదు అన్నట్టుగా మళ్ళీ ఫన్నీ ట్రోల్స్ ఊర్వశిపై వేస్తున్నారు. ఇలా ఊర్వశి రౌతేలా పరిస్థితి ఉందని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఈమె డాకు మహారాజ్ హిట్ తో ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇలాంటివి మార్చుకుంటే తప్ప తనపై వచ్చే నెగిటివ్ కామెంట్స్ కూడా తగ్గవు. మరి ఈమెలో ఎపుడు మార్పు వస్తుందో అంటూ నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











