Bro The Avatar పవన్ కల్యాణ్‌కు ఓటేసిన ఊర్వశి రౌటేలా.. వైఎస్ జగన్‌ను రిజెక్ట్ చేసిన బాలీవుడ్ భామ
బాలీవుడ్ ముద్దు గుమ్మ ఊర్వశి రౌటేలా స్పెషల్ సాంగ్స్‌తో గ్లామర్ పంట పండిస్తూ.. దక్షిణాది ప్రేక్షకులకు చేరువవుతున్నారు. ఇటీవల తమిళ చిత్రం లెజెండ్ మూవీతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న ఈ అందాల భామ .. సంక్రాంతి రేసులో చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రంలో బాసు పార్టీ సాంగ్‌లో అదరగొట్టింది. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో కలిసి బ్రో ది అవతార్ సినిమాలో మరో స్పెషల్ సాంగ్ చేసి హిట్ మూవీని ఖాతాలో వేసుకొన్నది.
అయితే బ్రో ది అవతార్ సినిమా సక్సెస్ సాధించి దూసుకెళ్తుతన్న నేపథ్యంలో #AskUrvashi అనే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ట్విట్టర్‌లో నిర్వహించింది. ఈ సందర్బంగా ఆమె ఇచ్చిన సమాధానాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఊర్వశి ఇచ్చిన సమాధానం ఏమిటంటే?

బ్రో ది అవతార్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తున్న క్రమంలో ఊర్వశి రౌటేలా తన అభిమానులు, నెటిజన్లతో మాటమంతి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నెటిజన్లు, అభిమానులు వేసిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చింది.
ట్విట్టర్‌లో #AskUrvashi ఛాటింగ్ సందర్భంగా మీరు YS Jagan లేదా Pawan Kalyan లో ఎవరో ఒకరిని ఎంచుకోమని అడిగితే.. ఎలాంటి మొహమాటం లేకుండా, తడుముకోకుండా PSPK (Power Star Pawan Kalyan) అంటూ నేరుగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఊర్వశీ రౌటేలా సమాధానం మీడియాలోను, సోషల్ మీడియాలోను భారీగా చర్చ జరుగుతున్నది.

ఊర్వశి రౌటేలా ఇచ్చిన సమాధానంతో పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ సైనికులు ఆనందంలో మునిగిపోయారు. సమాజంలో మార్పు తెచ్చే ఏకైక నేత పవన్ కల్యాణ్ అని నమ్మే జనసైనికులు.. ముఖ్యమంత్రి పదవికి పవన్ కల్యాణ్ అర్హుడు అంటూ ఊర్వశి రౌటేలా ఇచ్చిన సమాధానానికి కామెంట్లు పెడుతున్నారు. ఊర్వశి రౌటేలా సమాధానం నచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.

బ్రో ది అవతార్ సినిమా విషయానికి వస్తే.. సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన మూవీలో పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్, తదితరులు నటించారు. జూలై 28వ తేదీన విడుదలైన ఈ సినిమా గత మూడు రోజుల్లో సుమారు 90 కోట్ల మేర వసూళ్లను సాధించింది. త్వరలోనే ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











