మెడ మీద శృంగార గాటు.. లవ్ బైట్‌పై స్పందించిన ఊర్వశి రటేలా.. అసలు విషయం చెప్పేసిందిగా!
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ కావాలని ఆరాటపడుతున్న ఊర్వశి రటేలా అనేక సినిమాలు చేస్తున్నా ఆమెకు కాలం కలిసి రావడం లేదు. అయితే అనుకోకుండా ఆమె ప్రేమ విఫలం అయింది అంటూ ఆ మధ్య కధనాలు వచ్చాయి. ఆ విషయం మీద ఆమె స్పందించలేదు సరికదా ఇప్పుడు అనుకోకుండా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఒక వెబ్ సైట్ తీరు మీద ఆమె కాస్త ఘాటుగానే స్పందించింది. ఆ వివరాల్లోకి వెళితే

హాట్ ఫోటో షూట్లు చేస్తూ
బాలీవుడ్ లో 'సనమ్ రే' 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాల్లో నటించినా ఊర్వశి రటేలాకి పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ సినిమాల్లో అందాలను ఎంత ఆరబోసినా కూడా ఈ భామకు గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్లు చేస్తూ తన అభిమానులను అలరిస్తుంది ఈ భామ.

మిస్ టీన్ ఇండియా
ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ పట్టణంలో ఈ భామ ఒక రాజ్ పుత్ కుటుంబంలో జన్మించింది. . ఉత్తరాఖండ్ కోట్ ద్వార ఆమె సొంత ఊరు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఆధ్వర్యంలో నడిచే గార్గి కాలేజీలో ఆమె తన చదువు పూర్తి చేసుకుంది. అయితే చిన్నప్పటి నుంచే అందం మీద ఆసక్తి పెంచుకున్న ఆమె చదువుకునే రోజుల్లోనే 15 ఏళ్ల వయసులో ఆమె ఇండియన్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది.. ఆ తరువాత 2009 సంవత్సరానికి గాను మిస్ టీన్ ఇండియా అవార్డు కూడా సంపాదించింది.

లవ్ బైట్
నటిగా నిరూపించుకోవాలని భావించిన ఊర్వశి 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా కలిసి రాకపోవడంతో రెండేళ్ళు ఆగి ఆమె కన్నడలో మిస్టర్ ఐరావత అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా కూడా ఆమెకు కలిసి రాలేదు. హిందీలో సనంరే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ ఫోర్, పాగల్ పంటి, వర్జిన్ భానుప్రియ అనే హిందీ సినిమాల్లో నటించింది.

లవ్ బైట్
ఈమధ్య ఆమె విమానాశ్రయంలోవెళుతుండగా ఫోటోగ్రాఫర్ లు క్లిక్ మానిపించారు. ఆ సమయంలో ఆమె మెడపై ఎర్రటి గుర్తు కనిపించింది. ఒక వెబ్ పోర్టల్ ఆమె మెడపై ఉన్న ఎరుపు గుర్తు లవ్ బైట్ అదేనండీ అచ్చ తెలుగులో చెప్పాలంటే శృంగార కాటు అంటూ చెప్పుకొచ్చింది. దెబ్బకు ఊర్వశికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో నిప్పులా వ్యాపించింది. ఫిబ్రవరి ప్రారంభంలో ఊర్వశి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. ఆ సమయంలో, సీక్విన్ రెడ్ టాప్ మరియు బ్లాక్ మినీ స్కర్ట్ ధరించింది. ఇక ఊర్వశి మెడపై కనిపించే ఎరుపు గుర్తు గురించి ఒక పోర్టల్ అప్పట్లోనే కధనాన్ని వండి వార్చింది. ఇప్పుడు ఈ వైరల్ వార్తపై నటి స్వయంగా స్పందించింది.
Recommended Video

నా పని గురించి రాయచ్చుగా
ఊర్వశి తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఈమేరకు ట్వీట్ చేసింది. ఈ వార్తను 'హాస్యాస్పదమైనది' అని ఆమె పేర్కొంది. ఊర్వశి రౌతేలా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో ఇలా రాశారు, "హాస్యాస్పదంగా ఉంది!!!! ఇది నా ఎరుపు రంగు లిప్‌స్టిక్, నా మాస్క్ ద్వారా అక్కడ అంటుకుంది. ఎరుపు లిప్‌స్టిక్‌ను హ్యాండిల్ చేయడం ఎంత కష్టమో ఏ అమ్మాయినైనా అడగండి. నమ్మలేకపోతున్నాను." వారు ఏదైనా వ్రాయగలరు. ఒకరి ఇమేజ్‌ను, ముఖ్యంగా అమ్మాయిల గురించి హాని చేసే విధంగా ఎలా రాస్తున్నారు? మీ స్వంత ప్రయోజనాల కోసం నకిలీ వార్తలను వ్యాప్తి చేయడానికి బదులుగా మీరు నా విజయాల గురించి ఎందుకు వ్రాయకూడదు" అని పేర్కొంది. ఇక ఆమె త్వరలో జియో స్టూడియోస్ వెబ్ సిరీస్ 'ఇన్‌స్పెక్టర్ అవినాష్'లో రణదీప్ హుడా సరసన కనిపించనుంది.


Click it and Unblock the Notifications











