Urvashi Rautela బాస్ పార్టీ భామ ఒంటిపై ధగధగలు.. ఖరీదైన దుస్తులు, అభరణాలతో అందాల ఆరబోత
బాలీవుడ్ అందాల భామ ఊర్వశి రటౌలా ప్రస్తుతం అన్ని భాషల్లో అవకాశాలు చేజిక్కించుకొంటూ క్రేజీ స్టార్‌గా మారిపోయారు. దక్షిణాదిలో అగ్ర నటులు, భారీ బడ్జెట్ చిత్రాల్లో ఆఫర్లను దక్కించుకొంటున్నది. ఇక అందం, అభినయంతోనే కాదు సోషల్ మీడియాలో అందాల సోయగాలను కురిపిస్తూ అలజడి సృష్టిస్తున్నారు. ఇన్స్‌టాగ్రామ్‌లో తన అందాలను ఆరబోస్తూ భారీగా ఫాలోయింగ్‌ను సంపాదించుకొంటున్నారు. అయితే ఇటీవల ఊర్వశీ రటౌలా అందాల ఆరబోత సోషల్ మీడియాలో హాట్ హాట్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

తెలుగు, తమిళ సినిమాల్లో
ఊర్వశి రటౌలా కెరీర్ విషయానికి వస్తే.. తెలుగులోనే కాకుండా తమిళ భాషలో భారీ అవకాశాలతో దూసుకుపోతున్నది. శరవణన్ హీరోగా లెజెండ్ సినిమాలో గ్లామర్ తారగా ఆకట్టుకొన్నది. ఈ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్ అందుకొన్నది. దాంతో తమిళంలో మంచి గ్లామర్ తారగా గుర్తింపు పొందింది.

చిరంజీవితో బాస్ పార్టీ అంటూ
ఇక ఇటీవల తెలుగులో చిరంజీవి, రామ్ పోతినేని లాంటి హీరోలతో జతకట్టింది. ఇటీవల వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రంలో ఐటెమ్ సాంగ్‌లో బాస్ పార్టీ అంటూ యువత గుండెల్లో గిలిగింతలు పెట్టింది. బాస్ పార్టీ సాంగ్ ఇండియన్ మ్యూజిక్ రంగంలో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. రామ్ పోతినేని సినిమాలో కూడా స్పెషల్ సాంగ్‌లో జిగేల్ మనిపించింది. త్వరలోనే ఈ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నది.

ఫ్యాషన్ రంగంలో కూడా
ఇలా సినిమా రంగంలోనే కాకుండా ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్నది. ఫ్యాషన్, ర్యాంప్ షోలతో హంగామా చేస్తున్నది. కంపెనీల బ్రాండ్‌కు అంబాసిడర్‌గా మారింది. ఫ్యాషన్ ట్రెండ్‌కు తగినట్టుగా దుస్తులను సెలెక్ట్ చేసుకోవడంలో కూడా వైరెటీగా ఉంటుంది. ఆమె ధరించే దుస్తులు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఖరీదైన డ్రస్సులో అందాల ఆరబోత
ఊర్వశి రటౌలా ధరించిన దుస్తుల విలువపై నెటిజన్లు భారీగా కామెంట్ చేస్తున్నారు. ఇటీవల ట్రెండిగా ఉన్న అవుట్‌ఫిట్ ధర సోషల్ మీడియాలో నెటిజన్లు గుర్తించారు. ఆ డ్రెస్ గురించిన ధరను పెట్టి.. దానిపై కామెంట్లు చేశారు. ఆ ధర అక్షరాల 1 లక్షా 40 వేల రూపాయలు. డాలర్లలో 1700 డాలర్లు అని తెలిపారు. డైమండ్ జ్యువెల్లరితో చేసిన నగల విలువ 5 లక్షలకుపైగానే ఉంటుంది. అలాగే ఆమె చెప్పలు ధర 50 వేలు అని ఆమె అభిమానులు ఫోటోలు పోస్టు చేసి సోషల్ మీడియాలో కామెంట్ చేశారు.

ఊర్వశి రటౌలా ఫిలిం కెరీర్
ఊర్వశి రటౌలా కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్‌ను తన ఖాతాలో వేసుకొన్నది. ప్రస్తుతం రామ్ పోతినేనితో కలిసి నటిస్తున్నారు. హిందీలో రణ్‌దీప్ హుడా నటించిన ఇన్స్‌పెక్టర్ అవినాష్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అలాగే హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నది. మైఖెల్ మరోనేతో కలిసి నటించనున్నారు. అలాగే జాసన్ డెరులోతో కలిసి మ్యూజిక్ ఆల్బమ్‌లో నటించనున్నారు.


Click it and Unblock the Notifications











