ఒక్క షోకు 80 లక్షలు పిండుకుంటున్న శృంగార తార!
హేట్ స్టోరీ 4 లాంటి అందాల డోసు ఎక్కువగా ఉండే చిత్రాలతో ఊర్వశి రౌటేలా గుర్తింపు తెచ్చుకుంది. ఘాటైన శృంగార సన్నివేశాల్లో సైతం ఊర్వశి నటించేస్తోంది. సోషల్ మీడియాలో ఊర్వశి రౌటేలా ఘాటైన ఫోజులు చొస్తే కుర్రకారు మతులు పోవాల్సిందే. పూర్తి స్థాయి హీరోయిన్ గా మాత్రం సరైన అవకాశాలు అందుకోలేకపోతోంది.
త్వరలో దుబాయ్ వేదికగా టి10 క్రికెట్ లీక్ ప్రారంభం కాబోతోంది. ఈ లీగ్ ప్రారంభోత్సవంలో నృత్య ప్రదర్శన చేసేందుకు నిర్వాహకులు ఊర్వశి రౌటేలాని సంప్రదించారట. ఈ ఒక్క ప్రదర్శనకు ఈ అమ్మడు డిమాండ్ చేసిన మొత్తం ఎంతో తెలిస్తే దిమ్మతిరగడం ఖాయం. కేవలం కొన్ని గంటల్లో ముగిసిపోయే షో కోసం ఊర్వశి రౌటేలా 80 లక్షల పారితోషకం డిమాండ్ చేసిందట.

దుబాయ్ పార్క్ అండ్ రిసార్ట్స్ లో ఈ వేడుక జరగనుంది. ఊర్వశి రౌటేలాతో పాటు పాకిస్థానీ హాట్ బ్యూటీ మహీరా ఖాన్ కూడా ప్రదర్శన చేయనున్నట్లు తెలుస్తోంది. ఊర్వశి రౌటేలా అందుకోబోతున్న పారితోషకం చూసి బాలీవుడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ చిత్రంతో ఊర్వశి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications











