ప్రపంచంలో ఇదే మొదటి సినిమా.. ఊర్వశీ రౌటేలా కామెంట్స్ వైరల్
బాలీవుడ్ ఐటెం బాంబ్ ఊర్వశీ రౌటేలా తెలుగు తెరకు పరిచయం కాబోతోందన్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సంపత్ నంది అందించిన కథతో తెరకెక్కుతోన్న చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. బ్లాక్ రోజ్ అంటూ టైటిల్ లుక్, ఊర్వశీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అంతేకాకుండా ఈ మధ్యే ఓ ఐటెం సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు. బ్లాక్ రోజ్ మూవీ ప్రమోషనల్ సాంగ్ అంటూ రిలీజ్ చేసిన ఆ పాట తెగ వైరల్ అయింది.
బ్లాక్ రోజో ఫస్ట్ లుక్‌తోనే సినిమా ఎలా ఉండబోతోందో చెప్పేశారు. కార్పోరేట్ మోసాలు, అప్పులు ఇస్తే వ్యవహారం ఎలా ఉంటుందో చెప్పే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమా ఇదని తెలుస్తోంది. డబ్బు అప్పుగా ఇస్తే.. మీరు డబ్బునైనా కోల్పోతారు లేదా.. శత్రువునైనా తెచ్చుకుంటారు అని పోస్టర్‌పై రాసి ఉంది. ఊర్వశీ రౌటేలా కార్పోరేట్ మోసాలకు పాల్పడే కిలాడీ లేడీగా కనిపిస్తోందని టాక్. తాజాగా ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

ప్రపంచం మొత్తంలో కరోనా లాంటి క్లిష్ట్ సమయంలో షూటింగ్ ప్రారంభించి.. పూర్తి చేసిన మొదటి చిత్రంగా బ్లాక్ రోజ్ నిలుస్తుంది. ఇదంతా టీం వర్క్ వల్లే సాధ్యమైంది అంటూ ఊర్వశీ చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఈ మూవీకి మోహన్ భరద్వాజ్ దర్శకుడిగా వ్యవహారిస్తున్నాడు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











