బాలకృష్ణతో అలాంటి అనుభవం.. సెట్‌లో నాతో ఆ రోజు అలా.. ఊర్వశి రటేలా

మెగాస్టార్ చిరంజీవి, గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లాంటి హీరోలతో స్పెషల్ సాంగ్స్ చేసి అభిమానుల హృదయాల్లో వేడి పుట్టించిన ఊర్వశీ రటేలా ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉంటారు. వివాదాల చుట్టు ఆమె ఉంటుందా? ఆమె చుట్టే వివాదాలు తిరుగుతుంటాయా? అనే విధంగా బోల్డుగా కామెంట్స్ చేస్తుంటారు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణకు సంబంధించిన ఓ చిలిపి విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకొన్నారు. బాలకృష్ణతో కలిసి పనిచేయడం వెనుక ఉన్న మజాను ఆమె క్లియర్‌ కట్‌గా వెల్లడించారు. అయితే బాలయ్య చేసిన చిలిపి పని ఏమిటంటే?

ఊర్వశీ రటేలా ఇటీవల ముంబైలోని రేడియో నషా అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. తన ప్రొఫెషనల్ కెరీర్ గురించిన చాలా విషయాలు బోల్డుగా వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో డాకు మహారాజ్ సినిమాలోని వివాదాస్పదమైన పాట దబిడి దిబిడి గురించి, అలాగే బాలకృష్ణ ప్రవర్తన గురించి చాలా విషయాలను ఆసక్తికరంగా పంచుకొన్నారు.

Balakrishna Urvashi Rautela

అయితే దబిడి దిబిడి సాంగ్ ఆన్‌లైన్‌లో వచ్చిన వ్యతిరేకతను ఆమె లైట్‌గా తీసుకొన్నారు. ఆ సినిమాలో బాలకృష్ణతో చేసిన యాక్షన్ సీన్ల గురించి ఎవరూ మాట్లాడరేంటి? అని ప్రశ్నించారు. ఒక్కొసారి ఇక విషయం మరొకదానిని క్రియేట్ చేస్తుంది. ఆలా ఎన్నో మలుపులు తిరుగుతుంటుంది ఆ విషయం. దబిడి దిబిడి విషయంలో అనవసరమైన రాదద్ాంతం జరిగింది.

బాలకృష్ణతో నటించడం నిజంగా అమేజింగ్. ఆయనతో కలిసి పనిచేయడంలో ఓ కిక్కు ఉంటుంది. సెట్లో చాలా సరదాగా ఉంటారు. ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా లక్కీనే అని ఊర్వశి అన్నారు. బాలకృష్ణ ఫ్యాన్స్‌తో చెప్పిన విషయాలు, తనతో కలిసి చేసిన పాటను వారు బాగా ఎంజాయ్ చేసిన తీరు బాగుంది. అభిమానులు చాలా ఇష్టంగా చూశారు. వాళ్లు ఎంత హ్యాపీగా ఉన్నారంటే మాటల్లో చెప్పలేం అని ఆమె అన్నారు.

అయితే బాలయ్య గొప్ప స్టార్‌నని ఎన్నడూ అనుకోరు. చాలా ఒద్దికగా ఉండి ప్రతీ ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తారు. గతేడాది వాలంటైన్ డే రోజున నాకు మొట్టమొదటి విషెస్ అంద చేసిన వారిలో ఆయన మొదటి వ్యక్తి. ఆయన చాలా జోష్‌తో ఉంటారు. ఆయన డిఫరెంట్ పర్సనాలిటీ. చాలా ఎనర్జిటిక్. ఆయనతో పని చేయడం చాలా సులభం. చిన్నపిల్లాడి మనస్తత్వం ఆయనది. ఆయన తీరు చూస్తే ఫన్ లవింగ్‌గా ఉంటుంది. అంతేకాదు ఆయన మాస్ ఫాలోయింగ్ ఉన్న సూపర్ స్టార్. సూపర్ ఎనర్జిటిక్ అని ఊర్వశీ రటేలా అన్నారు.

బాలయ్య ఎప్పుడూ కోపంతో ఉంటారనే విషయం అవాస్తవం. అలాంటి జోన్‌లో ఆయన కనిపించరు. ఉండరు కూడా. ఆయన డౌన్ టూ ఎర్త్‌గా ఉంటారు. చిన్న పిల్లలు, అభిమానులు, ప్రజలతో మమేకం అవుతుంటారనే విషయాన్ని నేను స్వయంగా గమనించాను అని ఊర్వశి ప్రశంసల వర్షం కురిపించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X