For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స్పోర్ట్స్ వేర్ లో ఉన్న ఊర్వశి మీద జిమ్ ట్రైనర్ పంచ్ ల వర్షం.. వామ్మో మరీ ఇంతలానా?

  |

  బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకోవాలని అక్కడ స్టార్ హీరోయిన్ కావాలని ఆరాటపడుతున్న ఊర్వశి రౌటేలా అనక సినిమాలు చేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో 'సనమ్ రే' 'గ్రేట్ గ్రాండ్ మస్తీ' 'హేట్ స్టోరీ 4' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాలలో నటించినా ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఆ సినిమాల్లో అందాలను ఎంత ఆరబోసినా కూడా ఈ భామకు స్టార్ హీరోయిన్ గుర్తింపు మాత్రం రాలేదనే చెప్పాలి. అయితే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ తన అభిమానులను అలరిస్తున్న ఈ భామ తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

  ఆరోజుల్లోనే

  ఆరోజుల్లోనే

  ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిందువులు చాలా పవిత్రంగా భావించే హరిద్వార్ పట్టణంలో ఈ భామ ఒక రాజ్ పుత్ కుటుంబంలో పుట్టింది. అదే రాష్ట్రానికి చెందిన కోట్ద్వార అనేది ఆమె సొంత ఊరు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఆధ్వర్యంలో నడిచే గార్ఘి కాలేజీలో ఆమె తన చదువు పూర్తి చేసుకుంది. చదువుతున్న రోజుల్లోనే కేవలం 15 ఏళ్ల వయసులో ఆమె ఇండియన్ ఫ్యాషన్ వీక్ లో పాల్గొంది.. అంతేకాక 2009 సంవత్సరానికి గాను మిస్ టీన్ ఇండియా కూడా అవార్డు సంపాదించింది.

  అలా ఎంట్రీ

  అలా ఎంట్రీ

  ఇక ఆ రోజుల్లోనే ఆమె అనేక అవార్డులు రివార్డులు సంపాదించి ఫ్యాషన్ రంగంలో మకుటంలేని మహారాణిలా అనేక షోస్ చేసింది. అయితే నటిగా నిరూపించుకోవాలని భావించిన ఆమె 2013లో సింగ్ సాబ్ ది గ్రేట్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా కలిసి రాకపోవడంతో రెండేళ్ళు ఆగి ఆమె కన్నడలో మిస్టర్ ఐరావత అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా కూడా ఆమెకు కలిసి రాలేదు

  బాలీవుడ్ మీద ఫోకస్

  బాలీవుడ్ మీద ఫోకస్


  ఇక ఆ తర్వాత ఎక్కువగా హిందీ సినిమా పరిశ్రమ మీద ఫోకస్ పెట్టిన ఈ భామ సనంరే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, హేట్ స్టోరీ ఫోర్, పాగల్ పంటి, వర్జిన్ భానుప్రియ అనే హిందీ సినిమాల్లో నటించింది. ఇక ఈ భామ ప్రస్తుతం తెలుగులో బ్లాక్ రోజ్ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్నారు. ఈ సినిమా కాకుండా ఆమె మరో పేరు పెట్టని సినిమాలో కూడా నటిస్తోంది. ఆ సినిమాని ఏకకాలంలో హిందీ, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలు ఆమెకు తెలుగు, తమిళ భాషలలో డెబ్యూ సినిమాలుగా నిలవనున్నాయి.

  ఎక్కువగా మ్యూజిక్ వీడియోస్

  ఎక్కువగా మ్యూజిక్ వీడియోస్


  ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఈ భామ ఎక్కువగా మ్యూజిక్ వీడియోస్ లో కనిపించింది. యో యో హనీ సింగ్ తో లవ్ డోస్, గల్ బన్ గయీ సాంగ్స్ ఆమెకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టాయి. మొత్తం మీద 9 మ్యూజిక్ వీడియోస్ లో ఆమె కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ఇక మ్యూజిక్ వీడియోస్ తో పాటు ఈ భామ మూడు వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది. 2 వెబ్ సిరీస్ లో చిన్న పాత్రులే అయినా 3వ వెబ్ సిరీస్ లో ఆమె ఒక కీలక పాత్రలో నటించింది. అయితే అది ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.. ఆ వెబ్ సిరీస్ పేరు ఇన్స్పెక్టర్ అవినాష్.

  అమ్మో నెవర్ బిఫోర్

  అమ్మో నెవర్ బిఫోర్


  ఇక ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్ లు చేస్తూ ప్రేక్షకులకు హాట్ ట్రీట్ ఇచ్చే ఈ భామ తాజాగా మాత్రం జిమ్ ట్రైనర్ తో పంచ్ లు గుద్దించుకుంటున్న వీడియోను షేర్ చేసింది. కష్టం లేనిదే ఫలితం దక్కదని, అతను నన్ను సరయిన చోటనే పంచ్ చేస్తున్నాడు, ఇలా గట్టిగా పంచ్ చేయడం కూడా నా యాక్షన్ ఫిలిం కోసమే అని, అతని పంచ్ లను తాను లాగేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

  English summary
  Actress Urvashi Rautela posted a new video in her instagram, where she is seen training like a beast. “NO PAIN NO GAIN. He clocks me right in the gut. Getting walloped is part of my action film… absorbing his blows” she captioned the video.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X