బాత్రూంలో ప్రైవేట్ వీడియో లీక్.. ఏం జరిగిందంటే? ఊర్వశి రౌటేలా క్లారిటీ
హిందీ సినిమా నుంచి మన సౌత్ లోకి వచ్చి బాగా బిజీ అయ్యిన హీరోయిన్స్ కూడా కొందరు ఉంటారు. అయితే హీరోయిన్ గా కాదు కానీ నార్త్ మార్కెట్ నుంచి వచ్చి సౌత్ లో ఒక ఊపు ఊపుతున్న టాప్ బ్యూటీ ఎవరైనా ఉన్నారు అనేది ఖచ్చితంగా గ్లామరస్ నటి ఊర్వశి రౌటేలా అని చెప్పి తీరాలి. కాగా ఊర్వశి ఇప్పుడు తెలుగు సహా హిందీలో కూడా పలు చిత్రాలు చేస్తుంది. హిందీలో హీరోయిన్ లేదా కొన్ని పాత్రలు కూడా చేస్తుండగా తెలుగులో ఎక్కువ ఐటెం సాంగ్స్ కి పరిమితం అయ్యింది.
అయితే కేవలం ఐటెం సాంగ్స్ మాత్రమే కదా అని ఆమె తక్కువేమి ఛార్జ్ చేయట్లేదట. ఆమెకి నిర్మాతలు పెద్ద మొత్తంలోనే ముట్టజెబుతున్నారట. ఇలా రెండు భాషల్లో కూడా ఇప్పుడు బాగానే సెటిల్ అయ్యిపోయిన ఊర్వశి రౌటేలా కి రీసెంట్ గా ఒక ఊహించని షాక్ తగిలింది. ఆమెకి సంబంధించిన ఓకే ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఎలాగో లీక్ అయ్యి ఒక్కసారిగా వైరల్ అయ్యిపోయింది.

దీనితో ఒక రెండు రోజులు అలా ఊర్వశి రౌటేలా కోసమే అంతా మాట్లాడుకున్నారు. ఈ సమయంలోనే ఆమె తన మేనేజర్ కి వార్నింగ్ ఇచ్చిన కాల్ కూడ ఒకటి లీక్ అయ్యింది. అందులో అసలు నా వీడియో ఎలా రికార్డు అయ్యి బయటికి వచ్చింది అని సోషల్ మీడియాలో తీసారా లేదా అంటూ చీవాట్లు పెట్టింది. దీనితో వీడియో తీయిస్తున్నాను అని బదులిచ్చాడు. ఇక ఇదిలా ఉండగా ఈ వీడియో లీక్ పై ఊర్వశి రౌటేలా స్పందించింది.
నాపై అలా ఒక వీడియో లీక్ అవ్వడం అనేది చాలా బాధగా అనిపించింది అని అప్పుడు చాలా సేపు అప్సెట్ గా ఉండిపోయాను, కాకపోతే అది నా పర్శనల్ వీడియో కాదు సినిమాకి సంబంధించిన లీక్ అని చెప్పుకొచ్చింది. కాగా ఆ లీక్ చాలా మంది ఆమె పర్శనల్ స్పేస్ లోనిది అని అనుకున్నారు కానీ సినిమా నుంచి అని క్లారిటీ ఇచ్చింది అలాగే ఆ లీక్ అయినందుకు ఆమె బాధపడినట్టుగా తెలియజేసింది.
కాగా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి చేసిన భారీ బ్లాక్ బస్టర్ హిట్ "వాల్తేరు వీరయ్య" లో బాస్ తో స్టెప్పేసి బాస్ బ్యూటీగా ఓవర్ నైట్ లో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ అయిపోగా ఆ వెంటనే మరిన్ని క్రేజీ ఆఫర్స్ ని ఆమె సొంతం చేసుకుంది. రామ్ "స్కంద", పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల "బ్రో ది అవతార్" చిత్రాల్లో కూడా ఆమె ఐటెం భామగా మెరిసి అదరగొట్టింది.
ఇక ఇపుడు ఊర్వశి తెలుగులో నటసింహ బాలయ్య చేస్తున్న 109వ సినిమాలో ఒక ఫుల్ లెంగ్త్ పాత్ర చేస్తుండగా ఆమె ఇందులో పోలీస్ అధికారిణిగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని అప్పుడు వాల్తేరు వీరయ్య దర్శకుడే కొల్లి బాబీ తెరకెక్కిస్తుండగా ఈసారి ఫుల్ లెంగ్త్ రోల్ ని ఆమెకి అందించాడు.


Click it and Unblock the Notifications











