Remuneration: దబిడి డబిడి పాటకు ఊర్వశి రౌటేల రెమ్యునరేషన్.. మాస్ సాంగ్ కి ఎన్ని కొట్లంటే?
రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్‌లో కూర్చోబెట్టడం అంత తేలిక కాదు. ఇందుకోసం దర్శక నిర్మాతలు ఎంతో శ్రమిస్తుంటారు. బిగ్ స్క్రీన్స్‌పై ఆడియన్స్‌ని అలరించడానికి సినిమాలో చాలా అంశాలు కీలకపాత్ర పోషిస్తాయి. హీరో ఎలివేషన్స్, ఫైట్స్, డ్రామా, ఎమోషన్, అలాగే పాటలు తదితర అంశాలు ముఖ్యమైనవి. వీటిలో దేనికదే కీలకం.. కాకపోతే పాటలు అయితే మరింత కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పాటల్లో ఐటెం సాంగ్స్ .. వాటికి ఉండే క్రేజ్ కూడా వేరే లెవెల్ అని చెప్పడంలో సందేహం లేదు.
ఒకప్పుడు ఐటెం సాంగ్స్ ట్రెండ్ ఒకలా ఉండేది ఇపుడు మాత్రం కొత్తగా మారిపోయాయి. ఐటెం సాంగ్స్‌కి ఒకపుడు తెలుగు సినిమా చూసుకున్నా.. హిందీ సినిమా తీసుకున్నా ఈ పాటల్లో యాక్ట్ చేయడానికి కొందరు ఆర్టిస్టులు ప్రత్యేకంగా ఉండేవారు. వారిని చూడటానికి కుర్రకారు థియేటర్లకు పోటెత్తేవారు. మన దగ్గర చూసుకుంటే జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్కి స్మిత వంటి వారు ఐటెం సాంగ్స్‌తోనే హీరోయిన్లను మించిన స్టార్ డమ్ సంపాదించుకున్నారు.

అయితే కాలక్రమేణా ఈ ట్రెండ్ నెమ్మదిగా మారుతూ వచ్చింది. కొత్త కొత్త హాట్ భామలు ఒకరు తర్వాత ఒకరు వచ్చి ఐటెం సాంగ్స్‌కి మరింత హాట్ నెస్ పెంచారు. ఈ తర్వాత ఇండియన్ అమ్మాయిల్లోని ఐటమ్ గర్ల్స్‌ని పక్కన పెట్టి విదేశాల నుంచి కూడా దింపిన ఉదంతాలు ఉన్నాయి. ఇప్పుడు దీనికి కూడా బ్రేక్ ఇచ్చి స్టార్ హీరోయిన్స్‌ని ఐటమ్ భామలుగా మార్చేసి కొత్త ట్రెండ్ స్టార్ట్ చేస్తే అది పెద్ద హిట్ అయ్యింది. టాలీవుడ్‌లో సమంత, తమన్నా, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ వంటి స్టార్ హీరోయిన్లు ఐటెం గర్ల్స్‌గా సక్సెస్ అయ్యారు.
తాజాగా పుష్ప 2లో యంగ్ బ్యూటీ శ్రీలీల కిస్సిక్ అంటూ అందాలను ఆరబోసి నేషనల్ వైడ్ పాపులారిటీ సంపాదించుకుంది. ఇక రీసెంట్‌గానే నితిన్ సినిమాలో కేతిక శర్మ కూడా ఐటెం గర్ల్‌గా అవతారమెత్తింది. పెద్దగా కష్టపడకుండానే పేరుతో పాటు కళ్లు చెదిరే పారితోషికం వస్తుండటంతో చాలా మంది ముద్దుగుమ్మలు ఐటెం సాంగ్స్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ - బాబీ కాంబినేషన్‌లో వస్తున్న డాకు మహారాజ్ సినిమాలో బాలీవుడ్ సెక్సీ బాంబ్ ఊర్వశి రౌటేలా ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. దబిడి దిబిడి అంటూ సాగే ఈ సాంగ్‌లో ఆమె నడుము, పిరుదు భాగాలను టచ్ చేస్తూ బాలయ్య వేసిన స్టెప్స్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. అయినప్పటికీ ఈ సాంగ్‌కు మాస్ జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఈ పాట కోసం ఊర్వశి తీసుకున్న పారితోషికం చర్చనీయాంశమైంది. దబిడి దిబిడి పాటలో నర్తించినందుకు గాను ఆమె అక్షరాల రూ. కోటి పారితోషికం అందుకున్నట్లుగా ఫిలింనగర్‌లో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ఈ న్యూస్ మాత్రం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. ఈమెకే ఇంత ఇస్తే హీరోయిన్లుగా చేసిన ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్‌లకు మేకర్స్ ఎంత ఇచ్చారోనంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











