ఆ హీరోయిన్ల ముందు మోకాళ్లపై ఊర్వశి రౌతేలా.. దిమ్మతిరిగేలా నటి రియాక్షన్

ప్రపంచ చలన చిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ముగిసింది. అన్ని దేశాల చిత్ర పరిశ్రమలకు చెందిన ముద్దుగుమ్మలు కేన్స్‌లో రెడ్ కార్పెట్‌పై సందడి చేస్తూ మెరిసిపోయారు. భారత్ నుంచి ఐశ్వర్యరాయ్, అలియా భట్, ఊర్వశి రౌతేలా తదితర ముద్దుగుమ్మలు కేన్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఈ వేడుకల్లో తెలంగాణకు చెందిన ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మీ ఠాకూర్ అలరించారు. అయితే ఈ 79వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కొన్ని వివాదాలను కూడా తెచ్చింది. ఇదే సమయంలో నటి ఊర్వశి రౌతేలాపై దారుణంగా ట్రోలింగ్‌ జరిగింది. దీనికి ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

తొలుత అలియా భట్‌ను కేన్స్‌లో ఫోటోగ్రాఫర్లు పట్టించుకోలేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు, మీమ్స్ వైరల్ అయ్యాయి. దీనికి ఘాటుగా బదులిచ్చారు అలియా. ఇక ఊర్వశి రౌతేలా ఎప్పుడు కేన్స్‌కి వెళ్లినా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఆమె లుక్, డ్రెస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాయి. వియత్నాంకు చెందిన ప్రఖ్యాత ఫ్యాషన్ బ్రాండ్ జోలిపొచి కోచర్ రూపొందించిన క్రిస్టల్ గౌనులో ఊర్వశి రెడ్ కార్పెట్‌పై సందడి చేశారు. అంతేకాదు. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బ్రాండ్‌గా, లుక్‌గా ఊర్వశి అరుదైన గుర్తింపు తెచ్చుకున్నారు.

Urvashi Rautela Trolled at Cannes 2026 Actress Gives Strong Reply to Viral AI Comparison

ఈ లుక్ విలువ 155.87 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 1500 కోట్ల రూపాయలు). నీలం రంగుతో ఉన్న ఈ డ్రెస్‌లో వజ్రాలు పొదిగినట్లుగా ఉన్న క్రిస్టల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ డ్రెస్ కోసం కళాకారులు దాదాపు 8 నెలలు పాటు శ్రమించారని టాక్. రెడ్ కార్పెట్‌తో పాటు రివేరా నది ఒడ్డున ఊర్వశి చేసిన ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అచ్చుగుద్ధినట్లు సాగర కన్యలాంటి అందంతో సెగలు రేపారు ఊర్వశి.

కేన్స్‌ ఫెస్టివల్‌లో పాల్గొన్న హీరోయిన్లతో ఒకరినొకరిని పోల్చడం మామూలే .. గతంలోనూ ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. ఊర్వశి విషయానికి వస్తే బాలీవుడ్ అగ్రనటి ఐశ్వర్యరాయ్‌తో ఆమెను పోల్చుతూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. గతేడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్యతో పోల్చడంపై ఇబ్బందిపడిన ఊర్వశికి ఈసారి ఏఐ టెక్నాలజీతో ట్రోలింగ్ ఎదురైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కొందరు దారుణంగా ఆమెను ట్రోల్ చేశారు.

ఈ ఫోటోలో ఐశ్వర్యను గ్లోబల్ బ్యూటీగా టాప్ ఛైర్‌లో కూర్చోబెట్టారు. ఆ తర్వాత వరుసలో దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, మాధురి దీక్షిత్‌లు ఉన్నారు. కింద వరుసలో ఆలియా భట్, కరీనా కపూర్, కత్రినా కైఫ్, ఊర్వశి రౌతేలాలు పైన ఉన్న వారి ముందు మోకాళ్లతో మోకరిల్లినట్లుగా ఉంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఊర్వశి స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. ప్రతి నటికి తనకంటూ సొంతంగా ప్రయాణం ఉంటుంది.. ఇందుకోసం ఎంతో శ్రమిస్తుంది. ఇలాంటి మహిళల్ని ఒకరితో ఒకరిని పోల్చుతూ ఫ్యాన్ వార్ సృష్టించడం వల్ల వచ్చేదేమీ ఉండదు. దీనికి బదులుగా టాలెంట్‌ను గుర్తించండి.. ఇలా విషం చిమ్మడం ఆపేయండి అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఊర్వశి రౌతేలా పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఆమెకు నెటిజన్లు అండగా నిలుస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X