తిరుమలలో ప్రత్యక్షమైన ఊర్వశీ రౌటేలా.. పిక్స్ వైరల్
బాలీవుడ్ భామ ఊర్వశీ రౌటేలా ఇప్పుడు తెలుగులో రచ్చ చేసేందుకు రెడీగా ఉంది. సంపత్ నంది అందించిన కథతో వస్తోన్న బ్లాక్ రోజ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్దంగా ఉంది. ఆ మధ్య విడుదల చేసిన ఐటెం సాంగ్ ఓ రేంజ్‌లో క్లిక్ అయింది. అన్ లాక్ ప్రక్రియలోనే సినిమా ప్రారంభించి దాదాపు షూటింగ్ మొత్తం పూర్తి చేసేశారు. అయితే ఊర్వశీ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది.
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఊర్వశీ తిరిగి ముంబైకి వెళ్లింది. తన ఫ్యామిలీతో కలిసి తిరుమలకు వచ్చానని చెప్పింది. అయితే మళ్లీ తిరిగి వెళ్లిన సమయంలో ఎయిర్ పోర్ట్‌లో ఊర్వశీ ప్రత్యక్షమవ్వడం, అక్కడ అందరికీ తిరుమల లడ్డు ప్రసాదాన్ని పంచుతూ కనిపించింది. అలా ఊర్వశీని చీరలో చూడటంతో అందరూ షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.

రెండు మూడు రోజుల క్రితం సోషల్ మీడియాలో ఊర్వశీ తన పేరుకు అర్థం చెబుతూ హాట్ వీడియోలను షేర్ చేసింది. ఊర్వశీ (Urvashi)లో UR అంటే మీరు, మీ హృదయాలు.. Vashi అంటే నియంత్రించేది.. ఊర్వశీ అంటే మీ హృదయాలను కంట్రోల్‌లో ఉంచేదంటూ.. ఈ షూటింగ్ జరుగుతుంటే ఇప్పుడే తెలుసుకున్నా అంటూ ఊర్వశీ చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఇలా చీరలోనిండుగా కనిపించి అందరినీ కట్టిపడేస్తోంది.


Click it and Unblock the Notifications











