Rolls Royce Cullinan: ఫస్ట్ హీరోయిన్‌గా ఊర్వశీ రౌతేలా.. ఈ భామ కారు రేటు ఎన్ని కోట్లో తెలుసా?

ప్రెజెంట్ తెలుగు సినిమా దగ్గర ఐటెం సాంగ్స్ అంటే మొదటి ఛాయిస్ గా నిలుస్తున్న ఏకైక హాట్ బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా అని చెప్పవచ్చు. హిందీ సినిమా నుంచి తెలుగులోకి వచ్చిన వారిలో తెలుగు ఆడియెన్స్, నిర్మాతలు ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు. అలాగే ఊర్వశి రౌతేలాకి కూడా మనవాళ్ళు బాగానే ,పట్టం కట్టారు.

మెయిన్ గా తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన వాల్తేరు వీరయ్య అనే సినిమా ఎప్పుడైతే ఈమె చేసిందో అక్కడ నుంచే ఊర్వశి దశ తిరిగిపోయింది. కాగా ఈ సినిమాలో చిరంజీవి పక్క బాసు వేరీజ్ ది పార్టీ అంటూ చిందులేసి ఆ తర్వాత వెంట వెంటనే భారీ ఆఫర్స్ ని తెలుగులో అందుకుంది. ఇలా హిందీ సినిమా కంటే తెలుగులోనే ఫుల్ బిజీ అయ్యిన ఈ శిల్పం లాంటి నటి ఈ మధ్య కాలంలో తఱచుగానే వార్తల్లో వినిపిస్తుంది.

Urvashi Rautela s own s Rolls Royce Cullinan Here Daaku Maharaaj s Actress Car worth

కాగా తనపై పలు విమర్శలు, ట్రోల్స్ ఉన్నప్పటికీ లేటెస్ట్ గా మాత్రం ఇండియన్ సినిమా దగ్గర ఏ హీరోయిన్ గాని ఏ మహిళా నటి గాని సెట్ చేయని అరుదైన ఫీట్ సెట్ చేసి హిస్టరీ క్రియేట్ చేసినట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ గా ఊర్వశి రౌతేలా ఏకంగా 12 కోట్లు పెట్టి ఓ కార్ ని కొనేసిందట.

Take a Poll

అయితే ఇందులో ఏమంత పెద్ద గొప్ప ఉంది కార్ కొనుకోవడం కూడా పెద్ద విషయమా అంటే అక్కడ ఉన్నది ఊర్వశి రౌతేలా కదా కొంచెం ఎక్కువే అటెన్షన్ అందుకుంటుంది. ఇలా మన దేశంలో మొట్టమొదటిగా రోల్స్ రాయ్స్ కార్ ని కొనుగోలు చేసిన మొట్టమొదటి నటిగా చరిత్ర సృష్టించినట్టుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Urvashi Rautela s own s Rolls Royce Cullinan Here Daaku Maharaaj s Actress Car worth

ఆటో మొబైల్స్ లో రోల్స్ రాయ్స్ అనే బ్రాండ్ చాలా తక్కువమందికే అది కూడా అర్హతలు ఉన్నవారికే తమ కార్లు తయారు చేసి అందిస్తారు. అందుకే వీటి ఖరీదు కూడా చాలా ఎక్కువే ఉంటుంది. కాగా మన ఇండియాలో కూడా చాలా తక్కువమంది స్టార్స్ దగ్గరే ఈ కార్ ఉంది. తెలుగులో మొట్ట మొదటిగా మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత ప్రభాస్ వీరి తర్వాత రామ్ చరణ్ లు కొనుకుంటే తమిళ్ లో విజయ్ కొనుగోలు చేసాడు.

ఇలా బిగ్గెస్ట్ స్టార్స్ మాత్రమే రోల్స్ రాయ్స్ కొంటే హీరోయిన్స్ లో మాత్రం ఒక్కరు కూడా లేరు. కానీ మొట్ట మొదటిసారిగా ఈ కార్ ని ఏకంగా 12 కోట్లు పెట్టి కొనుగోలు చేసినందుకు ఇపుడు సోషల్ మీడియాలో బాలీవుడ్ వర్గాల్లో ఊర్వశి రౌతేలా ఒక సంచలనంగా మారింది. కాగా ఆమె కొన్ని రోజులు కితమే ఈ కార్ కొనుక్కోగా దీనిపై ఓ వీడియో కూడా వైరల్ గా మారింది.

ఇలా మొత్తానికి ఇండియన్ సినిమా దగ్గర మొదటి నటిగా అలాగే మరింత మంది బిగ్ స్టార్స్ సరసన ఈ కార్ ఓనర్ గా లిస్ట్ లో చేరింది అని బాలీవుడ్ మీడియా కొనియాడుతున్నారు. ఇక ఇవి పక్కన పెడితే ఈ హిట్ బ్యూటీ రీసెంట్ గానే మన తెలుగులో బాలకృష్ణ హీరోగా నటించిన భారీ సినిమా డాకు మహారాజ్ లో స్పెషల్ సాంగ్ చేయడమే కాకుండా సినిమాలో కీలక పాత్ర కూడా చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X