తొలిసారి శ్రీలీల అందాల ఆరబోత.. స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో పైటను పక్కకు జరిపి మరీ!
తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న అమ్మాయిల్లో అతి తక్కువ మంది మాత్రమే సెన్సేషన్ అవుతున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ శ్రీలీల ఒకరు. చూపు తిప్పుకోకుండా చేసే అందం, ఫిదా చేసే నటనతో ఆకట్టుకుంటోన్న ఈ చిన్నది.. హిట్లు మీద హిట్లు కొడుతూ స్టార్‌డమ్‌ను అందుకుంది.
ఈ మధ్య కాస్త తడబడుతున్నా.. ఆఫర్లను మాత్రం భారీగానే అందుకుంటోంది. ఇక, సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే శ్రీలీల.. తాజాగా కొన్ని గ్లామరస్ ఫొటోలను షేర్ చేసింది. ఆలస్యం లేకుండా వాటిని మీరే చూసేయండి మరి!

డాక్టర్ నుంచి యాక్టర్‌గా మారి
శ్రీలీల అమెరికాలో జన్మించింది. ఆమె చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. టీనేజ్‌లో ఉన్నప్పుడు భరత నాట్యం నేర్చుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత డాక్టర్ అవ్వాలనుకుని మెడిసిన్ చదివింది. వైద్యురాలుగా మారి సమాజానికి సేవ చేయాలని భావించిన శ్రీలీల ఊహించని విధంగా 2019లో వచ్చిన 'కిస్' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్‌గా కెరీర్ మొదలెట్టింది.

పెళ్లి సందడితో.. 100 కోట్లతో
కన్నడంలో హీరోయిన్‌గా పరిచయమైన శ్రీలీల 2021లో వచ్చిన 'పెళ్లి సందD' అనే సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చింది. మొదటి చిత్రంతోనే ఈ అమ్మడు ఫుల్ పాపులర్ అయింది. ఆ తర్వాత ఈ చిన్నది రవితేజతో 'ధమాకా' చేసి వంద కోట్లు కొట్టింది. అనంతరం 'స్కంద', 'ఆదికేశవ', 'ఎక్స్‌స్ట్రా ఆర్డినరీ మ్యాన్' వంటి చిత్రాలు చేసింది. కానీ, హిట్‌ను అందుకోలేదు.

స్టార్లతోనే.. బాలయ్యతో హిట్
తెలుగులో వరుస సినిమాలతో సత్తా చాటుతోన్న శ్రీలీల.. గత ఏడాది నందమూరి బాలకృష్ణతో 'భగవంత్ కేసరి' మూవీ చేసింది. ఇది సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీని తర్వాత మహేశ్ బాబుతో చేసిన 'గుంటూరు కారం' అంతగా ఆడలేదు. ఇక, ఇప్పుడు స్టార్ హీరోయిన్ శ్రీలీల.. పవన్ కల్యాణ్ సరసన 'భగవంత్ కేసరి' అనే సినిమాను చేస్తోంది.
ఆ ఇద్దరితో మరోసారి కలిసి
ఇప్పటికే ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా ఆఫర్లను అందుకుంటోన్న శ్రీలీల.. ఇప్పుడు నితిన్ సరసన 'రాబిన్‌హుడ్' అనే సినిమాలో నటిస్తోంది. దీనితో పాటు రవితేజతో మరోసారి జతకడుతోంది. ఈ చిత్రాలు మాత్రమే కాదు.. శ్రీలీల ఏకంగా ప్రభాస్ సినిమాలోనూ చాన్స్ పట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ అమ్మడు టాలీవుడ్‌లో సెన్సేషన్ అవుతోంది.

అందులో యమా బిజీగానే
దాదాపు ఐదారేళ్లుగా తనదైన రీతిలో ప్రభావాన్ని చూపిస్తూ.. టాలీవుడ్‌లో స్టార్‌గా సత్తా చాటుతోన్న శ్రీలీల సోషల్ మీడియాలో సైతం యమ యాక్టివ్‌గానే ఉంటోంది. ఇందులో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు తన మేటర్స్‌ను ఫాలోవర్లతో పంచుకుంటోంది. ముఖ్యంగా పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూ వెళ్తోంది.
అప్పుడప్పుడూ అవి కూడా
టాలెంటెడ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ శ్రీలీల సుదీర్ఘ కాలంగా సందడి చేస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆమె గ్లామర్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన అందచందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. తద్వారా ఈ కుర్ర హీరోయిన్ తరచూ హైలైట్ అవుతూ ట్రెండింగ్‌లో ఉంటోంది.

క్రేజీ ఫొటోలను వదిలింది
తాజాగా హీరోయిన్ శ్రీలీల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఈ చిన్నది స్లీవ్‌లెస్ బ్లౌజ్‌ను వేసుకోవడంతో పాటు పైటను కాస్త పక్కకు జరిపి ఫోజులు ఇచ్చింది. ఇలా తన అందచందాలను చూపిస్తూ కుర్రాకారును హుషారెత్తిస్తోంది. దీంతో శ్రీలీల షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇవన్నీ వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











