Don't Miss!
- News
తెలంగాణలో కరోనా కల్లోలం.. 457 మందికి పాజిటివ్
- Sports
బెయిర్ స్టోను కోహ్లీ అనవసరంగా గెలికాడు.. పుజారాలా ఆడేటోడు పంత్‌లా చెలరేగాడు: సెహ్వాగ్
- Finance
Axis Mutual Fund: యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ పై దావా వేసిన మాజీ ఫండ్ మేనేజర్.. ఎందుకంటే..?
- Technology
BSNL కొత్తగా మూడు ప్రీపెయిడ్ ప్లాన్లను జోడించింది!! ఆఫర్స్ మీద ఓ లుక్ వేయండి...
- Automobiles
2022 జూన్ అమ్మకాల్లో స్వల్ప వృద్ధి: హీరో మోటోకార్ప్
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జూలై 03 నుండి జూలై 9వ తేదీ వరకు..
- Travel
మన్యంలో మరుపురాని దృశ్యాలు రెండవ భాగం -2
బికినీలో నాని హీరోయిన్ పరువాల విందు.. లేటు వయసులో ఘాటు అందాలతో బాలీవుడ్ బ్యూటీ!
పెద్దగా సినిమా అవకాశాలు రాని భామలందరూ ఇప్పుడు సోషల్ మీడియా బాట పడుతున్నారు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం ద్వారా అభిమానుల్లో మళ్ళీ క్రేజ్ సంపాదించి తద్వారా సినిమాలు సంపాదించాలని చూస్తున్నారు. అందులో భాగంగానే చాన్నాళ్లుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్ తాజాగా ఒక హాట్ ఫోటో షేర్ చేసింది. టూ పీస్ బికినీలో బీచ్ ఒడ్డున నడుస్తూ ఉన్న ఫోటోను ఆమె షేర్ చేయడంతో అది ఇప్పుడు వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటో మీద ఒక లుక్కేద్దాం పదండి.

మోడలింగ్
వాణి కపూర్ తండ్రి శివ కపూర్ ఒక ఫర్నిచర్ ఎక్స్పోర్ట్ కంపెనీ నడిపేవారు. వాణి కపూర్ ఢిల్లీలో తన పాఠశాల విద్య పూర్తి చేసుకుని తర్వాత ఆమె ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా టూరిజంలో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించింది. ఆ తర్వాత ఓబరాయ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లో ఆమె ఇంటర్న్‌షిప్ చేసింది. ఆ తర్వాత మోడలింగ్ మీద మనసు మళ్లడంతో ఎలైట్ మోడల్ మేనేజ్మెంట్ అనే కంపెనీ ద్వారా మోడల్ అయ్యే ప్రయత్నం చేసింది.

శుద్ధ్ దేశీ రొమాన్స్ సినిమాతో
ఇక ఆమె యష్ రాజ్ ఫిలింస్ ద్వారా ఒకేసారి మూడు సినిమాలకు సంతకాలు చేసింది. శుద్ధ్ దేశీ రొమాన్స్ సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, పరిణీతి చోప్రా ల తో కలిసి కనిపించింది. ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. అందులో వాణీకపూర్ నటించిన తార పాత్ర కూడా మంచి స్పందన లభించింది. సినిమా కమర్షియల్ గా సక్సెస్ కావడంతో ఆమెకు కూడా మంచి పేరు వచ్చింది.

బ్యాండ్ బాజా బారాత్
ఇక ఆ తర్వాత 2010వ సంవత్సరంలో హిందీలో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచిన బ్యాండ్ బాజా బారాత్ అనే సినిమాను తమిళంలో నాని హీరోగా తెరకెక్కించారు. దానిని తమిళం, తెలుగు భాషల్లో ఆహా కళ్యాణం పేరుతో విడుదల చేశారు కానీ ఈ సినిమాకు మంచి పేరు అయితే దక్కలేదు. సినిమా బాగా ఆడకపోవడంతో వాణి కపూర్ కి కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఆమె బేఫికరే అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమా కూడా ఆమెకు కలిసి రాకపోవడంతో సినిమాలకు కొంత గ్యాప్ తీసుకుంది.

త్వరలోనే విడుదల
ఏకంగా మూడు ఏళ్ల గ్యాప్ తీసుకున్న తర్వాత ఆమె హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన వార్ సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడమే కాదు కమర్షియల్‌గా కూడా సక్సెస్ కావడంతో ఆమెకు మళ్ళీ సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి ఈ నేపథ్యంలోనే ఆమె 2021 సంవత్సరం లో బెల్-బాటం, చండీగఢ్ కరే ఆషిఖీ రెండు సినిమాల్లో కనిపించింది. ప్రస్తుతం ఆమె షంషేర్ అనే సినిమా పూర్తి చేసింది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది.

బికినీలో రచ్చ
అభిమానులను పెంచుకోవాలని అనుకుంటుందో లేక సినిమా అవకాశాలు దక్కించుకోవాలనే చూస్తుందో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో ఆమె సోషల్ మీడియాలో చేస్తున్న హాట్ షో ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా ఆమె టూ పీస్ బికినీ ధరించి బీచ్ ఒడ్డున హొయలు పోతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆమె అందం అదుర్స్ అంటూ ఆ ఫోటోకి ఇప్పుడు కామెంట్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. నిజానికి ఇప్పటి ఫోటో కాదని త్రో బ్యాక్ ఫోటో అని ఆమె పేర్కొంది కానీ ఈ ఫోటో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.