For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వాణి కపూర్ పరువాల విందు.. మొన్న బికినీలో ఇప్పుడు అలా.. ఎద అందాలు ఆరబోస్తూ హాట్ ట్రీట్

  |

  ఎప్పుడైనా సినిమా వాళ్ళ మీద సామాన్యులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. వారు ఏం చేస్తారు? ఏం తింటారు? లాంటి విషయాల మీద ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అందుకే సినిమా అవకాశాలు రాని భామలు అందరూ ఇప్పుడు సోషల్ మీడియా బాట పడుతున్నారు. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు షేర్ చేయడం ద్వారా మళ్ళీ వార్తల్లో నిలుస్తూ క్రేజ్ సంపాదించి తద్వారా మళ్ళీ సినిమాల్లో మెరవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే సినీ పరిశ్రమకు దూరంగా ఉంటూ ఈ మధ్యనే రీ ఎంట్రీ ఇచ్చిన వాణి కపూర్ తాజాగా హాట్ ఫోటో షూట్ షేర్ చేసింది. ఈ ఫోటో షూట్ లో ఆమె ఎద అందాలు ఆరబోస్తూ రచ్చ చేసింది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోల మీద ఒక లుక్కేద్దాం పదండి.

  శుద్ధ్ దేశీ రొమాన్స్

  శుద్ధ్ దేశీ రొమాన్స్

  వాణి కపూర్ తండ్రి శివ కపూర్ ఢిల్లీలో ఒక ఫర్నిచర్ ఎక్స్పోర్ట్ కంపెనీ నడిపేవారు. దీంతో వాణి కపూర్ ఢిల్లీలో తన పాఠశాల విద్య పూర్తి చేసుకుని తర్వాత ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా టూరిజంలో బ్యాచిలర్ డిగ్రీ సంపాదించింది. ఆ తర్వాత సినిమాల మీద ఆసక్తితో ఆమె మోడల్ అయ్యే ప్రయత్నం చేసింది.

  అలా ఆమె యష్ రాజ్ ఫిలింస్ ద్వారా ఒకేసారి మూడు సినిమాలకు సంతకాలు చేసింది. శుద్ధ్ దేశీ రొమాన్స్ సినిమాతో తన కెరీర్ ప్రారంభించిన ఆమె ఆ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్, పరిణీతి చోప్రా లతో కలిసి నటించింది.

  ఆహా కళ్యాణం

  ఆహా కళ్యాణం

  ఇక ఈ శుద్ధ్ దేశీ రొమాన్స్ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. అందులో వాణీ కపూర్ నటించిన తార పాత్రకి సైతం మంచి స్పందన లభించింది. దానికి తగ్గట్టే సినిమా కమర్షియల్ గా సక్సెస్ కావడంతో ఆమెకు కూడా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత 2010వ సంవత్సరంలో హిందీలో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచిన బ్యాండ్ బాజా బారాత్ అనే సినిమాను తమిళంలో నాని హీరోగా, వాణి హీరోయిన్ గా తెరకెక్కించారు. దానిని తమిళం, తెలుగు భాషల్లో ఆహా కళ్యాణం పేరుతో విడుదల చేశారు.

  రీ ఎంట్రీ

  రీ ఎంట్రీ

  కానీ ఈ సినిమాకు మంచి పేరు అయితే దక్కలేదు. సినిమా బాగా ఆడకపోవడంతో వాణి కపూర్ కి కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత రెండేళ్ల గ్యాప్ తీసుకుని ఆమె బేఫికరే అనే సినిమాలో కనిపించింది. ఈ సినిమా కూడా ఆమెకు కలిసి రాకపోవడంతో సినిమాలకు కొంత గ్యాప్ తీసుకున్న ఆమె ఏకంగా మూడు ఏళ్ల పాటు సైలెంట్ అయిపోయింది. గ్యాప్ తీసుకున్న తర్వాత ఆమె హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన వార్ సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

  సోషల్ మీడియాలో యాక్టివ్

  సోషల్ మీడియాలో యాక్టివ్

  ఆ సినిమా సూపర్ హిట్ సక్సెస్ కావడంతో ఆమెకు మళ్ళీ సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి ఈ నేపథ్యంలోనే ఆమె 2021 సంవత్సరం లో బెల్-బాటం, చండీగఢ్ కరే ఆషికీఅనే రెండు సినిమాల్లో కనిపించింది. ఈ మధ్య కాలంలో ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది. యాక్టివ్ అవ్వడమే కాక సోషల్ మీడియాలో చేస్తున్న హాట్ షో చేస్తూ చర్చనీయాంశం అవుతోంది.

  ఎద అందాలు

  ఎద అందాలు

  మొన్నీమధ్య టూ పీస్ బికినీ ధరించి బీచ్ ఒడ్డున హొయలు పోతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కాగా ఒక ఘాటు ఫోటో షూట్ వదిలింది. ఆమె ఈ ఫొటోలో అయితే ఎద అందాలు ఆరబోస్తూ కనిపిస్తుంది. ఈ ఫోటో షూట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ప్రస్తుతం ఆమె షంషేర్ అనే సినిమా పూర్తి చేసింది. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

  English summary
  Vaani Kapoor shared her hot photo shoot, which gone viral in social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X