Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
రెచ్చిపోయి డ్యాన్స్ చేసిన హీరోయిన్.. ఎన్ని దెబ్బలు తగిలాయో లెక్కే లేదట
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ - యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో కలిసి నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ 'వార్'. పూర్తి యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను సిద్దార్ద్ ఆనంద్ డైరెక్ట్ చేశారు. యస్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాలో వాణీ కపూర్ నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల చేయడానికి నిర్మాత సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా హిందీ, తెలుగుతో పాటు మరికొన్ని చిత్రాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
నాలుగు రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో హృతిక్, టైగర్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ను చూపించారు. వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడి మరీ నటించారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ఇద్దరు హీరోల మధ్య వచ్చే కార్ ఛేజింగులు, భారీ యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను కొత్త అనుభూతిని ఇవ్వనున్నాయని తెలుస్తోంది. అలాగే హీరోయిన్ గ్లామర్ కూడా ఆకట్టుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది.
రెండు రోజుల క్రితం ఈ సినిమాకు సంబంధించిన 'గుంగరో' అంటూ సాగే వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో హృతిక్ రోషన్ డ్యాన్స్ హైలైట్ అని చెప్పాలి. సునాయాసంగా ఆయన వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. వయసు పెరుగుతున్న ఆయనలో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని ఈ పాటలో డ్యాన్స్ చూస్తే అర్థం అవుతోంది. హృతిక్ డ్యాన్స్‌కు తోడు వాణీ కపూర్ గ్లామర్ దీనికి స్పెషల్ అట్రాక్షన్ అవుతోంది. ముఖ్యంగా ఆమె బికినీ ట్రీట్ యువతను మెప్పిస్తుందని చెప్పవచ్చు.
తాజాగా ఈ పాటకు సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఇందులో వాణీ కపూర్ ఎంతో బాగా డ్యాన్స్ చేసిందట. అంతేకాదు, సరికొత్త నృత్యాలను కూడా ట్రై చేసిందని సమాచారం. అలాగే, ఈ సినిమాలో పాటల కోసం ఆమె రెచ్చిపోయి మరీ డ్యాన్స్ చేసిందని చిత్ర యూనిట్‌లోని ఓ సభ్యుడు తెలిపాడు. ఈ డ్యాన్సులు చేస్తున్న సమయంలో వాణీ కపూర్ ఎన్నో సార్లు గాయపడిందని కూడా వెల్లడించాడు. హృతిక్‌తో పోటీగా డ్యాన్స్ చేయాలంటే ఈ మాత్రం ఉండాలంటున్నారు సినీ ప్రియులు.