రామ్ చరణ్ అంటే పిచ్చి.. అలా మనసు పారేసుకున్న యంగ్ హీరోయిన్

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ అంటే అభిమానులకు ఎంత ఇష్టమో తెలిసిందే. ఆయన కూడా ఫ్యాన్స్‌ను అలాగే తన ప్రాణానికి ప్రాణంలా చూసుకుంటారు. సామాన్యులతోపాటు సినీ ప్రముఖులు కూడా రామ్ చరణ్ అభిమానులే. పలువురు సెలబ్రిటీలు చెర్రీపై తమకున్న ఇష్టాన్ని బయటపెట్టారు. తాజాగా ఓ యంగ్ హీరోయిన్ తనకు రామ్ చరణ్ అంటే క్రష్ అని చెప్పింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఈ ఏడాది కేరళ బాక్సాఫీస్‌ను వణికించింది వాజా 2. చిన్న సినిమాగా.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఏప్రిల్ మొదటి వారంలో విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా 210 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. కేరళలో 120 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి లోక, తుడారం సినిమాల సరసన చేరింది. మలయాళంలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగు వెర్షన్‌లో ఏప్రిల్ 24న అందుబాటులోకి తీసుకొచ్చారు.

Vaazha 2 fame Angel Maria Reveals Her Crush on Ram Charan

వాజా 2 నాలుగు రోజుల్లో తెలుగులో 3.78 కోట్ల రూపాయల గ్రాస్.. 1.85 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 3.50 కోట్ల రూపాయలు పలకగా.. ఆంధ్రా, నైజాంలలో వాజా 2 బ్రేక్ఈవెన్ కావాలంటే 7.50 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా రికవరీ సాధించడం విశేషం.

సావిన్ ఎస్ఏ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నటించిన కుర్రాళ్లంతా అద్భుతంగా నటించారు. హషిర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, బిజు కుట్టన్, అజితన్ జాయ్, వినాయక్ వితో పాటు హీరోయిన్‌గా నటించిన ఏంజెల్ మరియాకు మంచి పేరొచ్చింది. ముఖ్యంగా ఏంజెల్ కుర్రాళ్లకు కలల రాకుమారిగా మారిపోయారు. ఈ మూవీలో షైనాగా నటించిన మరియాకు భారీగా ఫాలోయింగ్ వచ్చింది. గతంలో ఆఫీసర్ ఆన్ డ్యూటీ మూవీలో ఒక చిన్న పాత్రలో నటించినప్పటికీ.. వాజా 2 ఆమెకు హీరోయిన్‌గా తొలి చిత్రం. తెరపై మరియా నటన.. సినిమాలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యత ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సినిమా దెబ్బతో మరియాకు తెలుగు, మలయాళం భాషలలో ఆఫర్లు క్యూ కట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు

తెలుగులో వాజా 2 విడుదల కావడానికి ముందు.. చిత్ర యూనిట్ తమ ప్రచార కార్యక్రమాలలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను కలిసింది. ఈ సందర్భంగా వాజా 2 మూవీ యూనిట్‌తో చెర్రీ ముచ్చటించారు. ఈ సినిమాకు విషెస్ తెలియజేసి.. వాజా 2ను ఆదరించాలని తెలుగు ప్రేక్షకులను కోరారు. ఇక చరణ్‌తో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది మరియా. తాను టీవీలో మగధీర సినిమా చూస్తూ పెరిగాను.. ఎట్టకేలకు చరణ్ సర్‌ని ప్రత్యక్షంగా కలవడం ఎంతో ఆనందాన్ని కలిగించింది అని రాసుకొచ్చింది.

తాజాగా వాజా 2 ప్రమోషన్స్‌లో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రామ్ చరణ్‌ గారిని కలవడం ఎలా ఉందని విలేకరులు అడిగిన ప్రశ్నకు మరియా సమాధానం ఇచ్చారు. నేను చిన్నప్పటి నుంచి రామ్ చరణ్ సర్‌కి పెద్ద ఫ్యాన్‌ని అంటూ సిగ్గుపడుతూ నవ్వేశారు. ప్రస్తుతం ఆమె క్యూట్ లుక్స్, స్మైల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read more about: ram charan Vaazha II
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X