ఆ హీరోపై చచ్చేంత ప్రేమ.. ‘బేబీ’ హీరోయిన్ మనస్సు పడ్డ స్టార్ ఎవరో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సెన్సేషన్ గా మారింది. తెలుగు హీరోయిన్ గా ఇప్పుడు మంచి ఆఫర్లు అందుకుంటూ ఆసక్తికరంగా తన కెరీర్ను ముందుకు నడిపిస్తోంది. నిర్మాత ఎస్ కే ఎన్ నిర్మించిన బేబీ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆనంద్ దేవరకొండ సరసన నటించి ప్రశంసలు అందుకుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ లో వైష్ణవి చైతన్య పోషించిన పాత్రకు సౌత్ మొత్తం షేక్ అయింది. ఇప్పటికే ఆమెను బేబీ హీరోయిన్ గానే ప్రేక్షకులు గుర్తుపెట్టుకున్నారంటే ఆ పాత్రలో ఎంతలా జీవించిందో అర్థం చేసుకోవచ్చు.

అయితే వైష్ణవి చైతన్య ప్రస్తుతం స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ సరసన జాక్ అనే చిత్రంలో నటించింది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బివిఎస్ఎన్ ప్రసాద్ తన వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నెగెటివ్ పాత్రలో అలరించబోతున్నారు. ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తోంది.

Vaishnavi Chaitanya have Crush on Ram Pothineni her Open comments Goes viral

ఇప్పటికే ఈ చిత్రంకి సంబంధించిన పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. మరోవైపు ఇంట్రెస్టింగ్ ట్రైలర్ కూడా విడుదలై సినిమాపై అంచనాలను పెంచాయి. ముఖ్యంగా వైష్ణవి చైతన్య ఈ చిత్రంతో మళ్లీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని అభిమానులు, ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో సినిమా థియేటర్లలో ప్రేక్షకులం ముందుకు రానుంది. ఈ క్రమంలో సిద్దు, వైష్ణవి చైతన్య బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూ ఇస్తూ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తున్నారు. సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య తన వ్యక్తిగత విషయాన్ని పంచుకుంది. వైష్ణవి చైతన్యకు టాలీవుడ్ ఉస్తాద్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని అంటే ఎంతో ఇష్టమని, ఆయనపై తన క్రష్ ఉందని చెప్పింది. ఇన్నాళ్లకు వైష్ణవి చైతన్య తన మనసు పడ్డ హీరో గురించి బయట పెట్టడంతో ఆమె మాటలు వైరల్ గా మారాయి. ప్రస్తుతానికి వైష్ణవి చైతన్య ఊపు మీద ఉండడంతో మునుముందు రామ్ పోతినేని కూడా నటించే అవకాశం రాకపోదని అభిమానులు అంటున్నారు. అంతేకాదు వైష్ణవి చెప్పు తన గురించి మరో విషయం కూడా చెప్పుకొచ్చింది.

వైష్ణవి చైతన్యకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటించిన గంగుబాయి కటియావాడి సినిమా అంటే చాలా ఇష్టమని, అలాంటి పాత్రలో నటించాలని తన డ్రీమ్ అని కూడా చెప్పింది. మునుముందు ఆఫర్లు వస్తే తప్పకుండా చేస్తానని ఓపెన్ గా చెప్పేసింది. ఇక చివరిగా బేబీ చిత్రం తర్వాత లవ్ మీ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది వైష్ణవి చైతన్య. ఇక జాక్ చిత్రం వైష్ణవి చైతన్యకు ఎలాంటి రిజల్ట్ అందిస్తుందో వేచి చూడాలి. మరోవైపు టాలీవుడ్ లోనే వైష్ణవి చైతన్య ఫిమేల్ లీడ్ గా ఓ సినిమా ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X