బేబి నిర్మాత SKN తో విభేదాలు.. హీరోయిన్ వైష్ణవి చైతన్య హాట్ కామెంట్స్.. ఆ సినిమా ఆగిపోవడం వెనుక?
ఇప్పుడిప్పుడే తెలుగు సినిమాలో తెలుగు హీరోయిన్స్ కి కూడా చెప్పుకోదగ్గ రీతిలో ఒకొక్కటిగా అవకాశాలు వస్తున్నాయి. మరి ఇలా కొందరు యువ హీరోయిన్స్ తమ టాలెంట్ తో నోటెడ్ యంగ్ హీరోల సరసనే కనిపిస్తూ వస్తున్నారు. కాగా మన తెలుగు సినిమాలోనే అటు హీరోయిన్స్ సహా ఆడియెన్స్ పరంగా కూడా పలు కంప్లైంట్స్ ఉన్నాయి. మన హీరోయిన్స్ కి మనమే అవకాశం ఇవ్వము.
తెలుగు కనీసం మాట్లాడలేని వేరే హీరోయిన్స్ ని ఎక్కడ నుంచో తెచ్చుకుంటాం అని. ఇలా ఒక కన్సెర్న్ అయితే చాలామందిలో లేకపోలేదు. ఇలా తెలుగు హీరోయిన్ గా తన మొదటి సినిమా తోనే సంచలనం సెట్ చేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా బేబి బ్యూటీ వైష్ణవి చైతన్య అని చెప్పవచ్చు.

కాగా యూట్యూబ్ లో పలు వెబ్ సిరీస్ లు టిక్ టాక్ లతో ఫేమస్ అయ్యిన ఈ టాలెంటెడ్ నటి తన మొదటి తెలుగు సినిమాతోనే 100 కోట్ల గ్రాస్ ని అందుకొని అదరగొట్టింది. కాగా ఇలా టాలీవుడ్ లో మొత్తానికి ఒక తెలుగు అమ్మాయికి మంచి గుర్తింపు వచ్చింది అని మిగతా హీరోయిన్స్ కూడా భావించారు. అయితే ఈమె విషయంలో టాలీవుడ్ మాస్ ప్రొడ్యూసర్ ఎస్ కె ఎన్ పలు షాకింగ్ కామెంట్స్ ఆ మధ్య చేయడం అనేది టాలీవుడ్ లో చర్చకి దారి తీసింది.
తమకి కావాల్సిన హీరోయిన్స్ తోనే సినిమాలు చేస్తామని మన తెలుగు అమ్మాయి అనుకోని ఒకామెకి అవకాశం ఇస్తే ఆమె ఏం చేసిందో మాకు తెలుసు అన్నట్టుగా చేసిన పలు ఘాటు కామెంట్స్ అన్నీ వైష్ణవి చైతన్య వైపే వెళ్లాయి. కాగా ఇక్కడ నుంచి ఆమెనే నిర్మాతలతో ఏదో చేసింది అనే రీతిలో చాలా ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. కాగా ఈ కాంట్రవర్సీపై ఫైనల్ గా ఈ యువ బ్యూటీ ఓపెన్ అయ్యింది.
తనకి తన బేబి నిర్మాత ఎస్ కే ఎన్ తో ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చింది. ఆయన ఆరోజున అలా మాట్లాడిన తర్వాత ఓ వీడియో కూడా వదిలారు. అందులో కూడా తననే అన్నట్టు అసలు ఎక్కడా లేదు కదా అని తెలిపింది. సో ఆయన అసలు తనని ఏమీ అనని దానికి నేనెందుకు రెస్పాండ్ అవుతాను అని క్లారిటీ ఇచ్చింది. కానీ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రశ్న కూడా ఉంది.
బేబి హిట్ తర్వాత అదే ఆనంద్ దేవరకొండతో వైష్ణవి చైతన్యతో మరో రొమాంటిక్ సినిమా అనౌన్స్ చేశారు కానీ ఈ సినిమా ఆగిపోవాల్సి వచ్చింది. కాగా ఈ సినిమా ఎందుకు ఆగింది అనే దానిపై ఏమో ఫ్యూచర్ లో సెట్ అవ్వొచ్చు అన్నట్టుగా రిప్లై ఇచ్చింది. దీనితో విభేదాలు లేకుండానే ఆగిపోయిందా అనే కొత్త ప్రశ్నలు కూడా ఇపుడు వస్తున్నాయి. అలాగే ఒకవేళ వైష్ణవితోనే ప్రాబ్లమ్ అయితే మేకర్స్ ఆమెని తీసేసి మరో హీరోయిన్ని కూడా పెట్టుకొని ఉండొచ్చు కదా? కానీ అలా జరగలేదు కాబట్టి తనకి ఈ నిర్మాతతో విభేదాలు లేవనే అనుకోవచ్చు.


Click it and Unblock the Notifications











