నల్లచీరలో అచ్చ తెలుగు అందం .. నడుము మడతలతో కవ్విస్తోన్న బేబీ
తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం లేదని కొందరు బహిరంగంగా విమర్శలు చేసిన సందర్భాలు ఎన్నో. అందం, అభినయం ఉన్న నటీమణులు మన దగ్గరే దొరుకుతుంటే ఢిల్లీ, ముంబై, బెంగళూరు , కొచ్చి వైపు ఎందుకు చూస్తున్నారని కొందరు సినీ పెద్దలు మండిపడుతుంటారు. అయితే మరికొందరు తెలుగు అమ్మాయిలు మాత్రం వరుస ఆఫర్లు పట్టేస్తున్నారు. ఇలాంటి వారిలో వైష్ణవి చైతన్య ఒకరు.
4 జనవరి 1993న హైదరాబాద్‌లో జన్మించారు వైష్ణవి చైతన్య. ఈమెకు నితీష్ అనే తమ్ముడు ఉన్నాడు. షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ మొదలుపెట్టారు వైష్ణవి చైతన్య. అలాగే సినిమాల్లో హీరో, హీరోయిన్ల చెల్లెలిగా .. ఫ్రెండ్‌గా ఇతర సహాయపాత్రలు పోషించింది. లవ్ ఇన్ 143 అవర్స్, ది సాఫ్ట్‌వేర్ డెవలపర్, అరెరె మానస, మిస్సమ్మ వంటి షార్ట్ ఫిల్మ్స్ వైష్ణవి చైతన్యను యువతకు దగ్గర చేశాయి. టచ్ చేసి చూడు, ఏ మాయ ప్రేమితో, అల వైకుంఠపురంలో, రంగ్ దే, టక్ జగదీష్, వరుడు కావలెను, ప్రేమదేశం వంటి సినిమాలలో నటించింది.

ఈ దశలో సాయిరాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో పాటు బెడ్ రూమ్ సీన్స్‌లోనూ ఇరగదీసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. కేవలం కమర్షియల్‌గానే కాకుండా అవార్డుల రూపంలోనూ ఈ సినిమా ఘన విజయం సాధించిందని చెప్పొచ్చు. ఏకంగా దాదాపు ఐదు ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకుని సంచలనం సాధించింది.
మరీ ముఖ్యంగా ఈ చిత్రంలో నటనకు గాను ఉత్తమ నటిగా వైష్ణవి చైతన్యకు అవార్డు దక్కింది. బేబీ గ్రాండ్ సక్సెస్ తర్వాత వైష్ణవి చైతన్యకు పలు సినిమాల్లో అవకాశాలు క్యూకట్టాయి. రీసెంట్‌గా దిల్‌రాజు ప్రొడక్షన్స్‌లో లవ్ మీ అనే సినిమాలో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. తర్వాత సిద్దు జొన్నలగడ్డ హీరోగా వచ్చిన సినిమాలోనూ వైష్ణవి చైతన్య ప్రధాన పాత్ర పోషించింది. కథాబలం, తన పాత్రకు ఇంపార్టెన్స్ ఉండే పాత్రలనే ఎంచుకుంటూ దూసుకెళ్తోంది వైష్ణవి చైతన్య.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే వైష్ణవి చైతన్య తన సినిమాలు , వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. ఇక అందమైన ఫోటో షూట్‌లతో గిలిగింతలు పెడుతుంటారు. తాజాగా బ్లాక్ శారీలో నడుము అందాలను చూపిస్తూ ఫోటో షూట్ చేసిన వైష్ణవి.. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. మరి ఇంకేందుకు ఆలస్యం మీరు కూడా వైష్ణవి చైతన్య అందాలపై ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











