ఓ ఫ**క్ అనేసిన వైష్ణవి చైతన్య.. ‘బేబీ’ హీరోయిన్ కి చుక్కలు
టాలీవుడ్ యంగ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య ప్రస్తుతం ట్రోలింగ్ కు గురి అవుతుంది. తన మాట్లాడిన మాటలతో ఒక్కసారిగా విమర్శలను ఎదుర్కొంటుంది. సోషల్ మీడియాలో బేబీ హీరోయిన్ ను నెటిజన్స్ తను మాట్లాడిన మాటలకు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇప్పటివరకు సంపాదించుకున్న క్రేజ్ పై సందేహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వైష్ణవి చైతన్య అలాంటి మాట మాట్లాడుతుందని అసలు ఊహించలేదని నెటిజెన్స్ అనుకుంటున్నారు.
వైష్ణవి చైతన్య బేబీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆశ్చర్య పరిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఆనంద్ దేవరకొండ ఈరోజు నటించారు వీరాజ్ మరో హీరోగా నటించారు. ఇక విరాజ్ కు ఏకంగా లిప్ లాక్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు హీరోయిన్ అయినప్పటికిని టాలీవుడ్ లో తన నేచురల్ పర్ఫామెన్స్ తో యువతను కట్టిపడేసింది. ముఖ్యంగా వైష్ణవి చైతన్య తన తెలంగాణ స్లాంగ్ తో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది.

వైష్ణవి చైతన్య బేబీ సినిమాలో తన నటనతో పాటు ఆమె స్లాంగ్ కు చాలా మంది ప్రేక్షకులు ఆకర్షితులయ్యారు. ఇప్పుడున్న హీరోయిన్లలో తెలంగాణ యాసలో, అంత డేరింగ్ గా ముక్కు సూటిగా మాట్లాడే తత్వం కలిగి ఉన్న హీరోయిన్లు చాలా తక్కువ అని చెప్పాలి. ఈ క్రమంలోనే వైష్ణవి చైతన్య కు మాస్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ప్రస్తుతం వైష్ణవి చైతన్య స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ సరసన జాక్ అనే సినిమాలో నటిస్తుంది.
జాక్ మూవీ ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయింది. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వైష్ణవి చైతన్య రీసెంట్ గా భీమవరం లో నిర్వహించిన ఈవెంట్ కు హాజరైంది. అయితే భీమవరం కు బదులు రాజమండ్రి అని ఆ లొకేషన్ ను సంబందించింది. అలా మిస్టేక్ చేశానని ఒక్కసారిగా వేదికపైనే ఓ ఫ..క్ అంటూ మాట్లాడింది. ఒకసారి గా వైష్ణవి చైతన్య అలా మాట్లాడడంతో అందరూ షాక్ అయ్యారు. ఎప్పుడూ క్యూట్ స్పీచ్ తో కట్టిపడేసే ఈ ముద్దుగుమ్మ బూతు పదం వాడటం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారు.
ఆ పదం వాడిన వైష్ణవి చైతన్యకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. అచ్చమైన తెలుగులో మాట్లాడే ముద్దుగుమ్మ అలాంటి పదాలు వాడటం ఏంటని మండిపడుతున్నారు. అసలు తను ఫేక్ లాంగ్వేజ్ లో మాట్లాడుతుందా అని సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. తెలుగు హీరోయిన్ అయినప్పటికిని షాక్ లో ఉండి కూడా తెలుగు మాట్లాడకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
వైష్ణవి చైతన్య చక్కగా తెలుగులో మాట్లాడితేనే బాగా ఉంటుందని అభిమానులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక వైష్ణ చైతన్య 'బేబీ’ సెన్సేషన్ తర్వాత 'లవ్ మీ’ అనే చిత్రంతో అలరించింది. ప్రస్తుతం జాక్ తో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











