టాప్ విప్పేసి మరీ రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: తొలిసారి ఇంత ఘాటుగా కనిపించిన వకీల్ సాబ్ భామ

గతంతో పోలిస్తే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి లోకల్ అమ్మాయిలు కూడా చాలా మందే వస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది అందగత్తెలు.. టాలెంట్ ఉన్న భామలు వెలుగులోకి రావడంతో పాటు సరైన అవకాశాలను కూడా అందుకుంటున్నారు. అలా ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా మందే సందడి చేస్తున్నారు. అలాంటి వారిలో సత్తుపల్లి చిన్నది అనన్య నాగళ్ల ఒకరు.

సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును దక్కించుకున్న ఈ బ్యూటీ.. అందమే కాదు.. నటనలోనూ సత్తా చాటుతోంది. తద్వారా మరన్ని ఆఫర్లను అందుకుంటోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే అనన్య కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిపై మీరూ లుక్కేయండి!

‘షాదీ'తో అనన్య యమ పాపులర్

‘షాదీ'తో అనన్య యమ పాపులర్

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే అనన్య నాగళ్ల చాలా కాలం పాటు యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే 'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌ ద్వారా యాక్టింగ్ కెరీర్‌ను మొదలు పెట్టింది. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు ఉత్తమ నటిగా అవార్డులనూ కూడా సొంతం చేసుకుంది.

హీరోయిన్‌గా ఎంట్రీ.. అదరగొట్టేసి

హీరోయిన్‌గా ఎంట్రీ.. అదరగొట్టేసి

ఒకే ఒక్క షార్ట్ ఫిల్మ్‌తో సినీ ప్రముఖుల దృష్టిలో పడింది అనన్య నాగళ్ల. ఈ క్రమంలోనే పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన 'మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో ప్రియదర్శి టైటిల్ రోల్ చేశాడు. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ మూవీలో అనన్య సహజమైన నటనతో అదరగొట్టిం విశేషమైన గుర్తింపును దక్కించుకుంది.

‘వకీల్ సాబ్‌'తో మరింత ఫేమస్

‘వకీల్ సాబ్‌'తో మరింత ఫేమస్

'మల్లేశం' మూవీతో అనన్య నాగళ్ల పరిశ్రమలో ఒక్కసారిగా హైలైట్ అయింది. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'వకీల్ సాబ్'లో అవకాశం దక్కించుకుంది. ఇందులో అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రలో నటించింది. ఈ మూవీలో ఇనోసెంట్ రోల్‌లో కూడా ఆమె అదిరిపోయేలా చేసింది. ఫలితంగా మరింత ఎక్కువగా ఫేమస్ అయింది.

అన్నీ హిట్లే.. వరుస ఆఫర్లతో బిజీ

అన్నీ హిట్లే.. వరుస ఆఫర్లతో బిజీ

తెలుగు సినీ ఇండస్ట్రీలో అనన్య నాగళ్ల లక్కీ హీరోయిన్ అయింది. ఇప్పటికే 'ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించిన ఆమె.. 'మాస్ట్రో'లోనూ తళుక్కున మెరిసింది. అలా ఇప్పటి వరకూ చేసిన అన్ని చిత్రాలూ సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ జోష్‌తోనే ఆమె మరో రెండు చిత్రాల్లో లీడ్ రోల్ చేస్తోంది. ఒక దానిలో సొహైల్ హీరోగా చేస్తున్నాడు.

అందులో మాత్రం యమ యాక్టివ్

అందులో మాత్రం యమ యాక్టివ్

వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న అనన్య నాగళ్ల.. వరుస ఆఫర్లతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేస్తోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను పెంచుకుంటోంది.

లేలేత అందాలతో కవ్విస్తోందిగా

లేలేత అందాలతో కవ్విస్తోందిగా

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తెలుగు అమ్మాయి అనన్య నాగళ్ల సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఇప్పటికే ఈ భామ ఎన్నో హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను షేర్ చేసింది. తద్వారా తన అందంతో ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేసింది. సినిమాల్లో ఇప్పటి వరకూ పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీ.. ఇంటర్నెట్‌ను మాత్రం షేక్ చేసేస్తోంది.

హాట్ ఫొటోలను వదిలిన అనన్య

హాట్ ఫొటోలను వదిలిన అనన్య

తాజాగా అనన్య నాగళ్ల తన సోషల్ మీడియా ఖాతాల్లో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె గ్రీన్ కలర్ జాకెట్ ధరించి ఉంది. దాని జిప్ తీసేసి క్లీవేజ్ షో చేస్తూ రచ్చ చేసేసింది. అంతేకాదు, ఘాటు ఫోజులతో కుర్రకారును రెచ్చగొడుతోంది. ఫలితంగా ఈ పిక్స్‌కు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో ఇవి విపరీతంగా వైరల్ అయిపోయాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X