For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Ananya Nagalla Hot Video: ‘వకీల్ సాబ్’లో అలా ఇంట్లో ఇలా.. భంగిమలతో కవ్వింపు!

  |

  టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు అంతగా అవకాశాలు దక్కవన్న టాక్ ఉంది.. అయితే, అదంతా గతం.. ఇప్పుడా పరిస్థితులు మారిపోయాయి. ఉత్తరాది వాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా లోకల్ బ్యూటీలు సైతం ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో సత్తుపల్లి చిన్నది అనన్య నాగళ్ల ఒకరు. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో సత్తా చాటుతోన్న ఈ భామ.. వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలోనే తన గ్లామర్ ట్రీట్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ హాట్ వీడియో షేర్ చేసింది. వివరాల్లోకి వెళితే...

  Photos: Bollywood Actress latest Hot Pics

   ఆ షార్ట్ ఫిల్మ్‌తో మొదలు పెట్టింది

  ఆ షార్ట్ ఫిల్మ్‌తో మొదలు పెట్టింది

  ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన అనన్య నాగళ్ల సినిమాల మీద ఉన్న ఆసక్తితో యాక్టింగ్‌లో శిక్షణ తీసుకుంది. ఈ క్రమంలోనే ‘షాదీ' అనే షార్ట్ ఫిల్మ్‌ ద్వారా యాక్టింగ్ కెరీర్‌ను ప్రారంభించింది. ఇందులో ఆమె చేసిన నటనకు ఊహించని రీతిలో రెస్పాన్స్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటూ మంచి పేరు తెచ్చుకుంది. తద్వారా ఉత్తమ నటిగా అవార్డులనూ అందుకుంది.

  హీరోయిన్‌గా అడుగు... అదరగొట్టి

  హీరోయిన్‌గా అడుగు... అదరగొట్టి

  ఒకే ఒక్క షార్ట్ ఫిల్మ్‌తో సినీ ప్రముఖులను మొత్తం తన వైపునకు తిప్పుకుంది అనన్య నాగళ్ల. ఈ క్రమంలోనే పద్మశ్రీ చింతకింది మల్లేశం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మల్లేశం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో ప్రియదర్శి టైటిల్ రోల్ చేశాడు. రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ చిత్రంతో అనన్య అదిరిపోయే ఆరంభాన్ని దక్కించుకుందనే చెప్పాలి.

   ఏకంగా పవన్ సినిమాలో భాగం

  ఏకంగా పవన్ సినిమాలో భాగం

  ‘మల్లేశం' సినిమాలో అనన్య పోషించిన పాత్రకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సినిమా తర్వాత ఆమె ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ఈ క్రమంలోనే పవర్ స్టార పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్'లో అవకాశం దక్కించుకుంది. ఇందులో అంజలి, నివేదా థామస్‌తో కలిసి దివ్య నాయక్ అనే పాత్రలో నటించింది. ఈ రోల్‌ను కూడా ఆమె అదిరిపోయేలా చేసి ప్రశంసలు అందుకుంది.

  బాలీవుడ్‌లోనూ నటిస్తుందంటూ

  బాలీవుడ్‌లోనూ నటిస్తుందంటూ

  అనన్య నాగళ్ల వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే ఏకంగా బాలీవుడ్ మూవీలో సైతం అవకాశాన్ని అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దివ్యాంగ్ టక్కర్ తెరకెక్కిస్తోన్న ‘జయేష్ బాయ్ జోర్ధార్' అనే సినిమాలో ఆమె నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్ హీరోగా, ‘అర్జున్ రెడ్డి' భామ షాలినీ పాండే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.

  వరుస ఆఫర్లు.. మరో రెండింటిలో

  వరుస ఆఫర్లు.. మరో రెండింటిలో

  అనన్య నాగళ్ల తెలుగు సినీ ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్‌లా మారింది. అందుకే ఆమెను తమ సినిమాల్లో పెట్టుకునేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ‘ప్లేబ్యాక్' అనే సినిమాలో నటించిన ఆమె.. మరో రెండు చిత్రాల్లో లీడ్ రోల్ చేస్తోంది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అదే సమయంలో అనన్య మరికొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి.

  అందులో అనన్య యమ యాక్టివ్

  వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న అనన్య నాగళ్ల.. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో సైతం ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తన వ్యక్తిగత, సినీ కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు విశేషాలన ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ కొంత కాలంగా ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అయిపోతోంది.

   హాట్ వీడియోతో షాకిచ్చిన బ్యూటీ

  హాట్ వీడియోతో షాకిచ్చిన బ్యూటీ

  తరచూ ఏదో ఒక ఫోటోనో, వీడియోనో షేర్ చేసే అనన్య నాగళ్ల.. తాజాగా ఓ సెల్ఫీని ఇన్‌స్టాగ్రామ్‌లో వదిలింది. ఇందులో అద్దం ముందు నిల్చుని ఉన్న ఈ బ్యూటీ.. తన అందాలను చూపిస్తూ వీడియోను రూపొందించింది. దీనిలో ఆమె నడుము షేపులు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ సెల్ఫీ వీడియోకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇంకేముంది ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.

  English summary
  Telugu Actress, Vakeel Saab Movie Fame Ananya Nagalla Very Active in Social Media. Now She Shared Hot Selfie Video in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X