Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వాలెంటైన్స్ డే రోజు కాకా హోటల్లో కాజల్ అగర్వాల్.. భర్తతో కలిసి చందమామ చాలా సింపుల్‌గా
టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. అమ్మడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 14 ఏళ్లవుతోంది. ఎన్ని సినిమాలు చేసినా పోటీగా ఎంతమంది హీరోయిన్స్ వచ్చినా కూడా కాజల్ కు ఉన్న డిమాండ్ ఎప్పుడు తగ్గలేదు. తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెలుతోంది. ఇక పెళ్లి అనంతరం కాజల్ మొదటి వాలెంటైన్స్ డేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంది అనే విషయం కొందరిలో ఆసక్తిని కలిసించింది. అయితే కాజల్ ఎవరు ఊహించని ప్లేస్ లో స్పెషల్ గా లంచ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
హనీమూన్ కొసం..
పెళ్లి అనంతరం కాజల్ అగర్వాల్ హనీమూన్ పై వార్తలు ఏ రేంజ్ లో వచ్చాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మాల్దీవ్స్ లో సముద్ర మట్టానికి 16 అడుగుల దిగువన ఉన్న ఒక స్పెషల్ రూమ్ లో ఇద్దరు రొమాంటిక్ గా ఎంజాయ్ చేశారు. అసలైతే ఈ విహార యాత్రకు ఆమె దాదాపు 5కోట్లకు పైగా ఖర్చు చేసిందని టాక్ వచ్చింది.
సముద్రంలో ఒక రాత్రి
అండర్ వాటర్ హోటల్ మురాకాలో అందమైన వేలాది చేపల నడుమ కొన్ని రాత్రులు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మురాకాలో ఒక రాత్రికి అయ్యే ఖర్చు యాభై వేల డాలర్లు, అంటే మన కరెన్సీలో సుమారు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు. అయితే ఆ ఆఫర్ ను మాల్దీవ్స్ కు చెందిన ప్రభుత్వమే ప్రమోషన్ లో భాగంగా ఇచ్చినట్లు అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి.
కాకా హోటల్ లో గౌతమ్
ఆ విషయాలను పక్కన పెడితే వాలెంటైన్స్ డే రోజు కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ తో కలిసి ఒక చిన్నపాటి కాకా హోటల్ కు వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. పొల్లాచిలోని శాంతి మెస్స్ అనే ఒక సాధారణ హోటల్ కాజల్ తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భర్తతో డిన్నర్ చేసింది. తొమ్మిది సంవత్సరాలకు పైగా కాజల్ కు ఆ హోటల్ తెలుసట.
అందుకే వారి ఆహారం రుచిగా ఉంటుంది
అందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ఈ విధంగా వివరణ ఇచ్చింది. పొల్లాచిలో ఇది నా అభిమాన శాంతి మెస్స్. శాంతి అక్కా మరియు బాలకుమార్ అన్నా, మాకు ఎంతో ప్రేమతో వడ్డించారు. అందుకే గత 27 ఏళ్ళ నుండి వారి ఆహారం స్థిరంగా రుచికరంగా ఉంటుందని అనిపిస్తోంది. గత 9 ఏళ్ల నుంచి వారితో నా ప్రయాణం కొనసాగుతోందని కాజల్ అగర్వాల్ వివరణ ఇచ్చారు.
కాజల్ చేసిన పనికి..
నిజంగా కాజల్ చేసిన తన ఆనందం కోసం చేసిన పని ఓ కుటుంబానికి మద్దతుగా నిలిచింది. సెలబ్రెటీ అంటే డబ్బుకోసం ప్రమోషన్స్ చేస్తుంటారు. కానీ కాజల్ అలా కాకుండా ఒక చిన్న హోటల్ లో ఉండే నాణ్యతను ఇంకా గుర్తు పెట్టుకొని మరి అక్కడికి వెళ్లడంతో ఆమె మంచి మనసుకు అభిమానులు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు.