నాతో పడుకొంటావా.. ఆఫర్ ఇస్తా.. నిర్మాతతో యంగ్ హీరోయిన్‌కు చేదు అనుభవం

దేశవ్యాప్తంగా సినీ పరిశ్రమలో మీటూ ఉద్యమం ఊపందుకోవడంతో హీరోయిన్లపై నిర్మాతలు, దర్శకులు, హీరోల లైంగిక వేధింపులు అదుపులోకి వచ్చాయనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు హీరోయిన్లు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తమ సమస్యలను చెప్పుకోవడానికి ఛాన్స్ దొరికిన నేపథ్యంలో వేధింపులకు గురయ్యే సంఘటనలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి క్రమంలో యువ తార వాణి భోజన్ సంచనల కామెంట్లు చేశారు. వివరాల్లోకి వెళితే..

వాణి భోజన్‌పై లైంగిక వేధింపులు

వాణి భోజన్‌పై లైంగిక వేధింపులు

టాలీవుడ్‌లో శ్రీరెడ్డి, బాలీవుడ్‌లో పలు తారలు బహిరంగంగా కొందరు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేయడంతో పలు సినీ పరిశ్రమల్లో కొత్త చట్టాలు, కొత్తరకమైన నిబంధనలు, కమిటీలు ఏర్పాటు చేశారు. దాంతో మహిళా నటులకు అసభ్యకరమైన ప్రపోజల్స్ రావడం తగ్గిపోయాయి. కొంత వరకు లైంగిక వేధింపుల వార్తలు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఓ చిత్ర యూనిట్‌పై వాణి భోజన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది.

నాతో అసభ్యంగా

నాతో అసభ్యంగా

ఓ చిత్ర యూనిట్ తనతో అసభ్యంగా ప్రవర్తించారు. పడక గదిలోకి వస్తే ఆఫర్ ఇస్తామని అన్నారు. నేను అందుకు ఒప్పుకోకపోవడంతో ఆ సినిమా నుంచి నిర్మాత నన్ను తొలగించారు. ఆ సంఘటన నన్ను మానసికంగా కుంగదీసింది అని వాణి సంచలన విషయాలను బయటపెట్టారు. అయితే ఆ చిత్ర యూనిట్ గురించి గానీ, నిర్మాత గురించిన విషయాలను వెల్లడించకపోవడంతో ఇప్పుడు వారెవరూ అనే విషయంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది.

నిజాయితీతో కూడిన నిర్మాతలతోనే

నిజాయితీతో కూడిన నిర్మాతలతోనే

ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్‌లో అవకాశాలు లేవు. నిజాయితీ కూడిన నిర్మాతలు, సినీ ప్రముఖుల సినిమాల్లో పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను. మహిళలను అవసరానికి వాడుకొనే వస్తువులుగా చూసేవారికి దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నాను. టాలెంట్‌ను నమ్మి సినిమాలు చేసే వారితో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని వాణి భోజన్ అన్నారు.

తమిళ టెలివిజన్ రంగంలో

తమిళ టెలివిజన్ రంగంలో

వాణి భోజన్‌కు కెరీర్ విషయానికి వస్తే.. 2012లో తొలిసారి మాయ అనే సీరియల్‌తో తమిళ టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఆహా, కామెడీ జంక్షన్, జీన్స్ లాంటి సీరియల్స్‌లో నటించి మెప్పించింది. కింగ్స్ ఆఫ్ కామెడీ జూనియర్ లాంటి షోలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.

Recommended Video

Surekha Vani & Her Daughter Angry On a Netizen
వెండితెరపైన హీరోయిన్‌గా

వెండితెరపైన హీరోయిన్‌గా

2010లో తొలిసారి వెండితెరపై అదృష్టాన్ని పంచుకోనేందుకు ప్రయత్నించింది. తమిళంలో ఓర్ ఎరవ్వు అనే చిత్రంలో నటించింది. తాజాగా 2019లో తెలుగులో మీకు మాత్రమే చెప్తా అనే చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ఓహో మై కడవులే చిత్రంలో నటించింది. ప్రస్తుతం లాకప్, మిస్టర్ డబ్ల్యూ, ఆథర్వ మురళితో మరో చిత్రంలో నటిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X