4 కాదు.. 40 పెళ్లిళ్లు చేసుకుంటా .. పవర్‌స్టార్‌తో పెళ్లిపై హీరోయిన్ ఘాటు వ్యాఖ్యలు
అన్ని రంగాల్లో మాదిరిగానే చిత్ర పరిశ్రమలోనూ వివాదాలతోనూ సహవాసం చేసేవారు కొందరున్నారు. వారు ఏం మాట్లాడినా, ఏం చేసినా ఖచ్చితంగా అది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది. ఈ కోవలోకే వస్తారు వనితా విజయ్ కుమార్. తన వ్యక్తిగత జీవితంతో పాటు మాటలు, చేతలతో ఈమె తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకుని ఇండస్ట్రీకి షాకిచ్చారు. ఎప్పుడు? ఎవరితో ఎలా ఉంటారో .. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని సినీ జనాలు కూడా ఈమెపై ఓ కన్నేసి ఉంచుతాయి.
కోలీవుడ్ సీనియర్ నటుడు విజయ్ కుమార్ , దివంగత మంజుల కుమార్తె వనితా విజయ్ కుమార్. సినీ నేపథ్యం కావడంతో వనిత లాంచింగ్ ఈజీగా జరిగిపోయింది. చంద్రలేఖ అనే తమిళ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె .. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి సినిమాతో తెలుగువారిని పలకరించారు. ఈ చిత్రం విజయం సాధించడంతో వనితకు అవకాశాలు క్యూకట్టాయి. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి షాకిచ్చారు.

నటుడు ఆకాష్‌ను ఆమె వివాహం చేసుకోగా .. వీరికి విజయ్ శ్రీహరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ దశలో సినిమాలకు కూడా ఆమె దూరమయ్యారు. మనస్పర్థలతో ఆకాష్ నుంచి విడిపోయాక వ్యాపారవేత్త ఆనంద్ జే రాజన్‌తో ఏడాడుగులు నడిచారు వనిత. వీరికి జయనిత అనే కుమార్తె సంతానం. రెండో పెళ్లి కూడా కొద్దిరోజుల్లోనే పెటాకులైంది. రాజన్‌తోనూ విడిపోయి ఒంటరిగానే పిల్లల బాధ్యత తీసుకుంది. మధ్య మధ్యలో సినిమాలు చేస్తూ బండి లాగించారు. అయితే 2020లో కోవిడ్ సమయంలో పీటర్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుంది. అనివార్య కారణాలతో పీటర్‌ను కూడా విడిచిపెట్టారు వనిత. ఈయన రెండేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు.
ఇది జరిగి నెలలు గడవకముందే నాలుగో పెళ్లి చేసుకుని షాకిచ్చిచారు వనిత. 2024 అక్టోబర్ 5న రాబర్ట్ రాజ్ అనే కొరియోగ్రాఫర్‌ను ఆమె పెళ్లాడారు. అయితే పీటర్‌తో పెళ్లికి ముందే వనిత - రాబర్ట్‌లు డేటింగ్‌లో ఉన్నట్లు అప్పట్లో గాసిప్స్ వైరల్ అయ్యాయి. ప్రస్తుతం పీటర్‌తో కలిసి యూట్యూబ్ ఛానెల్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు, వీడియోలు పెడుతూ హల్ చల్ చేస్తుంటారు. అలాగే చెన్నైలో ఆమె ఓ వస్త్ర దుకాణం కూడా ఓపెన్ చేసి నడుపుతున్నారు.
కాగా.. నాలుగేళ్ల క్రితం తమిళ పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో దండలు మార్చుకుంటూ ఉన్న వనిత ఫోటో అప్పట్లో కలకం రేపింది. ఈమె పవర్‌స్టార్‌ను పెళ్లి చేసుకోబోతున్నారా? అంటూ ట్రోలింగ్ నడిచింది. దీనిపై అప్పుడే ఘాటుగా స్పందించారు వనిత. పికప్ అండ్ డ్రాప్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ ఫోటోను ట్వీట్ చేశానని ఆమె క్లారిటీ ఇచ్చారు. పురుషులు నాలుగైదు పెళ్లిళ్లు చేసుకున్నా ఎవరూ మాట్లాడరు.. కనీసం వారిని నిలదీయరని అదే స్త్రీలను వెంటాడుతూ ఉంటారని వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే నేను 4 కాదు.. 40 పెళ్లిళ్లు చేసుకుంటా , నా జీవితం నా ఇష్టమని బోల్డ్ కామెంట్స్ చేసి షాకిచ్చారు. అప్పట్లో వనితా విజయ్ కుమార్ వ్యాఖ్యలు కలకలం రేపాయి.


Click it and Unblock the Notifications











