లైవ్‌లో జారిపోయిన డ్రెస్.. అలాగే మీడియాకు ఫోజులు, హీరోయిన్ అరాచకం!

నటనతోనూ, వ్యక్తిగత వ్యవహారాలతోనూ సంచలనం సృష్టించిన నటీమణులు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. వీరిలో ముందు వరుసలో ఉంటారు తమిళనటి వనితా విజయ్ కుమార్. కెరీర్‌ కంటే ముందు పెళ్లిళ్లు, కాంట్రవర్సీ కామెంట్స్‌తో ఈమెకు బోల్డెంత పాపులారిటీ వచ్చింది. బట్టలు మార్చుకున్నంత ఈజీగా భర్తలను మార్చేస్తుందని ఈమెను అంతా ఆడిపోసుకున్నా .. ఐ డోంట్ కేర్ అన్నట్లు ధైర్యంగా బతికేస్తున్నారు వనిత. ఎవరేం అనుకున్నా.. తన జీవితం, తన ఇష్టమని తేల్చిచెబుతారు ఈ ముదురుభామ.

చేజేతులా కెరీర్ నాశనం

కోలీవుడ్ సీనియర్ నటుడు విజయ్ కుమార్ , దివంగత నటి మంజుల కుమార్తె వనితా విజయ్ కుమార్. చంద్రలేఖ అనే తమిళ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన ఆమె .. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవితో తెలుగువారిని పలకరించారు. కానీ ఈ సక్సెస్‌ను, స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడంలో వనిత విఫలమయ్యారు. వ్యక్తిగత జీవితం, పెళ్లిళ్లతో వనితా విజయ్ కుమార్ విమర్శలను ఎదుర్కోవడంతో పాటు లైఫ్‌ను నాశనం చేసుకున్నారని ఇప్పటికీ కోలీవుడ్‌లో చర్చించుకుంటూ ఉంటారు.

Vanitha Vijay Kumar s top suddenly came off in front of the media

మూడు పెళ్లిళ్లతో హల్‌చల్

తొలుత నటుడు ఆకాష్‌ను ఆమె వివాహం చేసుకోగా .. వీరికి విజయ్ శ్రీహరి, జోవిక అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆకాష్‌తో విడిపోయాక వ్యాపారవేత్త ఆనంద్ జే రాజన్‌ను పెళ్లాడగా వీరికి జయనిత అనే కుమార్తె ఉన్నారు. ఆ కొద్దిరోజులకే రాజన్‌తోనూ విడిపోయి పిల్లలను చూసుకుంటూ లైఫ్‌ను లీడ్ చేసింది. 2020లో కోవిడ్ సమయంలో పీటర్ అనే వ్యక్తిని మూడో పెళ్లి చేసుకుని మరోసారి ఇండస్ట్రీకి షాకిచ్చింది. తొలి రెండు పెళ్లిళ్ల మాదిరిగానే పీటర్‌తోనూ వనిత విడిపోగా.. అనారోగ్య కారణాలతో ఆయన కొద్దినెలల క్రితం మరణించారు.

రాబర్ట్‌తో క్లోజ్‌గా వనిత

ఈ తర్వాత రాబర్ట్ రాజ్‌ అనే కొరియోగ్రాఫర్‌తో వనితా విజయ్ కుమార్ కలిసి జీవిస్తున్నారని కోలీవుడ్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటున్నారు. చెన్నైలో ఆమె ఓ వస్త్ర దుకాణం కూడా ఓపెన్ చేసి బిజినెస్‌ను దిగ్విజయంగా నడుపుతోంది. ఇండస్ట్రీలో సీనియర్స్ అంతా తమ కొడుకులు, కూతుళ్లను సినిమాల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇదే బాటలో వనిత కూడా తన కుమార్తె జోవికను హీరోయిన్‌గా పరిచయం చేయాలని ట్రై చేస్తోంది. మంచి హైట్, ఫిగర్‌, తల్లిని మించిన అందంతో అప్పుడే ఈ చిన్నది కోలీవుడ్ దర్శక నిర్మాతల కళ్లలో పడింది. అన్ని సెట్ అయితే త్వరలోనే జోవికను హీరోయిన్‌గా పరిచయం చేస్తానని మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది వనితా విజయ్ కుమార్.

డ్రెస్ జారిపోయిన పట్టించుకోకుండా

వివాహం, విడాకులు సహా అనేక వివాదాల్లో చిక్కుకున్న వనిత సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. విజయ్ టీవీలో వచ్చే బిగ్‌బాస్ తమిళ్ షోలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో వనిత తన కుటుంబ మద్దతు లేకుండా ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది. బిగ్‌బాస్ షో తర్వాత ఆమె మరింత పాపులర్ కావడంతో అనీతి, హర, అంధకన్ వంటి చిత్రాల్లో నటించింది.

Take a Poll

సినిమాలో బిజీగా ఉంటూనే ఆడియో రిలీజ్‌లు, ట్రైలర్ లాంచ్‌లు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు క్రమం తప్పకుండా హాజరుకావడం అలవాటు చేసుకుంది. ఆ కోణంలో, ఆమె ఇటీవల ఒక కార్యక్రమానికి ట్రెండీ దుస్తులలో వచ్చింది. ఈ దశలో ఆమె దుస్తులపై టాప్ అకస్మాత్తుగా జారిపోయింది. అయితే అది ఏమాత్రం పట్టించుకోకుండా వనితా విజయ్ కుమార్ మీడియాకు ఫోజులిస్తూ వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: vanitha vijay kumar kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X