మూడో భర్తతో హీరోయిన్ కారులో షికారు.. తొలి సెల్ఫీతో రచ్చ రచ్చ

ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురు, తమిళ నటి వనితా విజయ్ కుమార్ పెళ్లి వార్త బయటకు రాగానే ఇంటర్నెట్‌లో సెన్సేషన్‌గా మారింది. అభిమానులు, ఫాలోవర్స్‌ అభినందనలతో ప్రశంసలు కురిపించారు. భారీ ఎత్తున కంగ్రాట్స్ అంటూ మెసేజ్‌ల వరద పారించారు. అయితే పెళ్లి అయిన వెంటనే ఆమె తన మూడో భర్తతో కలిసిన చేసిన షికారు వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

గతంలో రెండు వివాహాలు

గతంలో రెండు వివాహాలు

ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కూతురైన వనితా విజయ్ కుమార్‌కు గతంలో రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తొలుత ఆమె వివాహం 2007లో ఆకాశ్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. తన మొదటి భర్తతో విజయ్ శ్రీహరి అనే కుమారుడు కలిగాడు. ఆ తర్వాత దాంపత్య జీవితంలో కలహాలు తలెత్తడంతో విడాకులు తీసుకొన్నారు.

రెండో పెళ్లి ద్వారా ఇద్దరు సంతానం

రెండో పెళ్లి ద్వారా ఇద్దరు సంతానం

ఆ తర్వాత ఆనంద్ జాయ్ రాజన్ అనే వ్యక్తితో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వారి అఫైర్ పెళ్లి వరకు వచ్చింది. దాంతో వారిద్దరూ 2007లోనే పెళ్లి చేసుకొన్నారు. అయితే ఐదేళ్లు కాపురం చేసిన తర్వాత మళ్లీ కథ మొదటికి వచ్చింది. వైవాహిక జీవితంలో కలతలు చోటు చేసుకోవడంతో వారిద్దరు విడిపోయారు. రాజన్‌తో వనితకు జోవితా, జయనిత అనే ఇద్దరు అమ్మాయిలు సంతానంగా ఉన్నారు.

కొరియోగ్రాఫర్‌తో డేటింగ్

కొరియోగ్రాఫర్‌తో డేటింగ్

ఆ తర్వాత కోరియోగ్రాఫర్ రాబర్ట్ తో డేటింగ్ చేసింది. 2013 నుంచి 2017 వరకు రాబర్ట్‌తో సహజీవనం చేశారనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. వారిద్దరు కలిసి ఎంజీఆర్ శివాజీ, రజనీ కమల్ అనే సినిమాను నిర్మించారు.అయితే వారిద్దరూ పెళ్లి చేసుకొంటారని భావించారు. కానీ అనుకోకుండా వారిద్దరు తమ అఫైర్‌కు బ్రేకప్ చెప్పేసుకొన్నారు.

మూడో పెళ్లితో మళ్లీ దాంపత్య జీవితంలోకి

మూడో పెళ్లితో మళ్లీ దాంపత్య జీవితంలోకి

ఆ తర్వాత పీటన్ పాల్‌తో అఫైర్ మొదలైంది. అతనితో పెళ్లికి ముందు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. నా జీవితంలోకి ఓ కలలా ప్రవేశించారు. నా లైఫ్‌లో ఏర్పడిన అఘాతాన్ని పూరించేశాడు. అతను నాతో ఉంటే సెక్యూర్‌గా, జీవితం పరిపూర్ణంగా అనిపించింది. లాక్‌డౌన్‌లో నా యూట్యూబ్ ఛానెల్‌కు సమస్యలు వస్తే టెక్నికల్‌గా సహాయం అందించారు. నేను కష్టాల్లో ఉంటే నాకు తోడుగా నిలిచారు అని తన పోస్టులో పేర్కొన్నారు.

Recommended Video

Bigg Boss Tamil Contestent Madhumitha Confirms Police Complaint Against Her By The Channel
తొలి సెల్ఫీని ఇన్స్‌టాగ్రామ్‌లో

తొలి సెల్ఫీని ఇన్స్‌టాగ్రామ్‌లో

అలా పీటర్ పాల్, వనితా విజయ్ కుమార్ కొద్దిరోజుల క్రితం పెళ్లి చేసుకొన్నారు. పెళ్లి తర్వాత తన మూడో భర్తతో కలిసి ఆనంద క్షణలను పంచుకొన్నారు. కారులో షికారుకు వెళ్తూ తొలి సెల్పీ దిగారు. ఆ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X