‘ఎంతో మందితో రిలేషన్ పెట్టుకున్నా... చచ్చినా ఆ పని మాత్రం చేయను’
చిత్ర పరిశ్రమలో ఎందరో నటీనటులు ఉన్నారు. వీరిలో కొందరు సినిమాలతో ఫేమస్ అవ్వగా.. మరికొందరు మాత్రం వివాదాలు, వ్యక్తిగత జీవితంతో ఫేమస్ అయ్యారు. ఈ రెండో కోవలోకే వస్తారు సినీ నటి వనితా విజయ్ కుమార్. వివాదాస్పద వ్యాఖ్యలు, పెళ్లిళ్లతో వనిత వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఆమె ఏం చేసినా, ఏం మాట్లాడినా అది వివాదాస్పదంగా మారేది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వనితా విజయ్ కుమార్ తన పెళ్లిళ్లు, రిలేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
తమిళ సీనియర్ నటులు విజయ్ కుమార్.. దివంగత మంజుల దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. వారు ప్రీత విజయ్ కుమార్, వనిత విజయ్ కుమార్, శ్రీదేవి విజయ్ కుమార్. వీరంతా కూడా తల్లిదండ్రుల బాటలోనే వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. 1995లో దళపతి విజయ్ సరసన హీరోయిన్‌గా చంద్రలేఖ సినిమాతో కోలీవుడ్‌లో అడుగుపెట్టారు వనితా విజయ్ కుమార్. అనంతరం దేవి సినిమాతో తెలుగువారిని పలకరించారు. తొలి సినిమాతోనే అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేశారు వనిత. దాంతో తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు వచ్చాయి. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2000వ సంవత్సరంలో ఆకాష్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతనం. అయితే వీరి వైవాహిక బంధం ఎక్కువరోజులు సాగలేదు. పరస్పర అంగీకారంతో 2005లో ఆకాష్- వనితలు విడిపోయారు.

ఆకాష్‌తో విడాకుల తర్వాత 2007లో ఆనంద్ జై రాజన్‌ని పెళ్లాడారు వనిత విజయ్ కుమార్. ఇతనితో ఒక కుమార్తెకు జన్మనిచ్చారు. ఈ పెళ్లి కూడా పెటాకులు కావడంతో 2012లో విడాకులు తీసుకున్నారు. అనంతరం కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో వనితా విజయ్ కుమార్ కొన్నాళ్లు డేటింగ్ చేశారు. రేపో మాపో పెళ్లి చేసుకుంటారని అనుకున్న దశలో మనస్పర్ధలు కారణంగా 2017లో వీరిద్దరి బ్రేకప్ జరిగింది. ఆ తర్వాత పీటర్ పాల్ అనే ఫోటోగ్రాఫర్‌తో ప్రేమలో పడిన వనితా విజయ్ కుమార్.. 2020 జూన్ 27న అతనిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లూ ఇద్దరూ కలిసేఉండగా.. పీటర్ మద్యానికి బానిస కావడంతో అతనికి కూడా విడాకులు ఇచ్చేసింది వనిత.
అయితే మద్యానికి బానిస కావడంతో గుండెపోటుతో పీటర్ పాల్ 2023 ఏప్రిల్‌లో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అతనిని ఎంత బాగా చూసుకున్నప్పటికీ .. తనకంటే మద్యాన్ని ఎక్కువగా ప్రేమించాడని వనితా విజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. అడపాదడపా సినిమాలలో నటిస్తోన్న వనిత.. కొద్దిరోజుల క్రితం వనితా విజయ్ కుమార్ స్టైలింగ్ పేరుతో బట్టల వ్యాపారంలో దిగారు. ఇక తన కుమార్తె జోవికను హీరోయిన్‌గా పరిచయం చేసే పనుల్లో వనిత బిజీగా ఉన్నారు. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అగథలో జోవిక హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఇటీవల ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వనితా విజయ్ కుమార్ తన పెళ్లిళ్లు, రిలేషన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఎంతోమందితో సంబంధాలు పెట్టుకున్నాను.. కానీ ఈ రిలేషన్ సమయంలో ఎవరినీ నేను డబ్బులు అడగలేదు. గడిచిన 22 ఏళ్లుగా నేను నా కాళ్లపై నిలబడ్డానని గర్వంగా చెబుతాను. ఒక బంధం మీకు నచ్చనప్పుడు దాని నుంచి బయటకు రావడం తప్పు కాదు. వాస్తవానికి అదే సరైన పని. సమాజం కానీ, ఇరుగుపొరుగువారు గానీ ఏమంటారోనని మనం చింతించకూడదు. చివరికి మీ కన్న తల్లిదండ్రులు మీకు వ్యతిరేకంగా నిలిచినా సరే.. ఒక బంధంలో మీరు నిజంగా సంతోషంగా లేనప్పుడు ఆ రిలేషన్ నుంచి బయటకు రావడం అనేది మీకు మీరు చేసుకునే న్యాయమని వనిత విజయ్ కుమార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.


Click it and Unblock the Notifications


