4 పెళ్లిళ్లతో వివాదాల్లో తల్లి... హీరోయిన్‌గా కాంట్రవర్సి బ్యూటీ కూతురు, ఫస్ట్ లుక్ వైరల్

వనితా విజయ్ కుమార్.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సినిమాల కంటే వివాదాలతోనే ఈమె వివాదాలతోనే పాపులర్ అయ్యింది. నటుడు విజయ్ కుమార్- దివంగత మంజుల కుమార్తె వనిత. తెలుగు, తమిళ భాషలలో పలు హిట్ చిత్రాల్లో నటించిన వనిత.. ఎందుకో సక్సెస్‌ను కంటిన్యూ చేయలేకపోయింది. చిన్న వయసులోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టి ఆ తర్వాత నాలుగు పెళ్లిళ్లతో వివాదాల్లో ఇరుక్కుంది. తాజాగా వనిత తన కుమార్తెను హీరోయిన్‌గా దించింది. ఈ వివరాల్లోకి వెళితే..

విజయ్ కుమార్- మంజుల దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. వారు ప్రీత విజయ్ కుమార్, వనిత విజయ్ కుమార్, శ్రీదేవి విజయ్ కుమార్. వీరంతా కూడా తల్లిదండ్రుల బాటలోనే సినీరంగంలోనే అడుగుపెట్టారు. 1995లో దళపతి విజయ్ హీరోగా వచ్చిన చంద్రలేఖ సినిమాలో ఆయన సరసన హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టారు వనితా విజయ్ కుమార్. అనంతరం తెలుగులో దేవి సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ కాగా.. ఆమెకు వరుసపెట్టి అవకాశాలు వచ్చాయి. కెరీర్ పీక్స్‌లో ఉండగానే 2000వ సంవత్సరంలో ఆకాష్ అనే వ్యక్తిని పెళ్లాడింది. ఈ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతనం. అయితే వీరి వైవాహిక బంధం ఎక్కువరోజులు సాగలేదు. పరస్పర అంగీకారంతో 2005లో ఆకాష్- వనితలు విడిపోయారు.

Vanitha Vijayakumar s Daughter Jovika Makes Her Heroine Debut with Agadha

ఆకాష్‌తో విడాకుల తర్వాత 2007లో ఆనంద్ జై రాజన్‌ని పెళ్లాడారు. ఈ దంపతులకు ఒక కుమార్తె. ఈ పెళ్లి కూడా ఐదేళ్లు తిరిగేసరికి 2012లో విడాకులతో ముగిసింది. విడాకుల తర్వాత కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో వనితా విజయ్ కుమార్ డేటింగ్ చేసింది. వీరిద్దరూ కలిసి ఎంజీఆర్ శివాజీ రజనీ కమల్ అనే సినిమాను నిర్మించారు. త్వరలో పెళ్లి చేసుకుంటారని అనుకున్న దశలో రాబర్ట్‌తో మనస్పర్ధలు రావడంతో 2017లో వీరిద్దరి బంధానికి ఎండ్ కార్డ్ పడింది. తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వడంతో పాటు నటిగా కొంత బిజీ అయ్యారు వనిత. తిరిగి పీటర్ పాల్ అనే ఫోటోగ్రాఫర్‌తో ప్రేమలో పడిన వనితా విజయ్ కుమార్.. 2020 జూన్ 27న అతనిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లూ ఇద్దరూ కలిసేఉండగా.. పీటర్ మద్యానికి బానిస కావడంతో అతనికి కూడా విడాకులు ఇచ్చేసింది వనిత. అడపాదడపా సినిమాలలో నటిస్తోన్న వనిత.. కొద్దిరోజుల క్రితం వనితా విజయ్ కుమార్ స్టైలింగ్ పేరుతో బట్టల వ్యాపారంలో దిగారు.

తన కుమార్తె జోవికను సినిమాల్లోకి తీసుకురావాలని గత కొద్దికాలంగా ప్లాన్ చేస్తున్నారు వనితా విజయ్ కుమార్. ప్రముఖ దర్శకుడు, నిర్మాత ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న అగధలో జోవిక హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బులుసు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అగధలో హరిణి అనే పవర్‌ఫుల్ రోల్‌లో జోవిక నటిస్తున్నారు. తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసిన పోస్టర్‌లో పెద్ద కత్తి పట్టుకుని, వర్షంలో తడుస్తూ వైల్డ్ లుక్‌లో కనిపిస్తోంది జోవిక.

ఈ లుక్‌ని బట్టి చూస్తే సినిమాలో జోవిక లుక్‌పై అంచనాలు నెలకొన్నాయి. నెగిటివ్‌ షేడ్స్‌తో నటనకు స్కోప్ ఉన్న పాత్రలో జోవిక కనువిందు చేయనున్నారని ఫిలింనగర్ జనాలు చెబుతున్నారు. అగధలో మా ఊరి పోలిమేర ఫేమ్ కామాక్షి భాస్కర్ల, శ్రావణ్ రెడ్డిలు సింహాగా నటిస్తున్నారు. ఉల్కా గుప్తా, షిజు అబ్ధుల్ రషీద్ తదితర నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో 45 నిమిషాల పాటు ఉండే భారీ వీఎఫ్ఎక్స్‌ సన్నివేశాలు హైలైట్‌గా ఉంటాయని చెబుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి కాగా.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో అగధ మూవీ రిలీజ్ కానుంది. మరి జోవిక విజయ్ కుమార్ తన డెబ్యూ మూవీలో ఎలాంటి మార్కులు సంభవిస్తుందో చూడాలి.

Read more about: vanitha vijayakumar movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X